Sunday, 3 December 2017

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటర్ , డిప్లొమాతో ఎయిర్‌మెన్‌లు, న్యూక్లియర్ ఫిజిక్స్‌లోఉద్యోగాలు, సీఎస్‌ఐఆర్ - యూఆర్‌డీఐపీ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, ఐసీఏఆర్-డీవోజీఆర్ ఉద్యోగాలు, ఇంజినీర్స్ ఇండియాలో ఉద్యోగాలు, డిఫెన్స్ అకౌంట్స్‌లో ఉద్యోగాలు, ఇస్రో-ఎల్‌పీఎస్సీలో ఉద్యోగాలు, బీఎంహెచ్‌ఆర్‌సీ రెసిడెంట్ డాక్టర్లు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటర్ , డిప్లొమాతో ఎయిర్‌మెన్‌లు,

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)లోని గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై (నాన్ టెక్నికల్) ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
airforce
-ఇంటర్, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన అలవెన్స్‌లు
వివరాలు:
పోస్ట్ పేరు: ఎయిర్‌మెన్ (గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై)
-అర్హతలు: గ్రూప్ ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు కాకుండా)- గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి లేదా తత్సమానకోర్సు లేదా మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమాలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిప్లొమా లేదా ఇంటర్/పదోతరగతి ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
-గ్రూప్ వై పోస్టు (ఆటోమొబైల్ టెక్నీషియన్, జీటీఐ, ఐఐఎఫ్ (పీ), ఐఏఎస్ (ఎస్), మ్యూజీషియన్ ట్రేడ్‌లు కాకుండా మిగిలిన ట్రేడ్‌లకు)- ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
-గ్రూప్ వై (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్) పోస్టులకు - కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/10+2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
నోట్: డిప్లొమా అభ్యర్థులు కేవలం గ్రూప్ ఎక్స్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ట్రేడ్‌లకు అర్హులుకారు.
-వయస్సు: 1998, జనవరి 13 నుంచి 2002, జనవరి 2 మధ్య జన్మించి ఉండాలి. గరిష్ఠంగా 21 ఏండ్లు మించరాదు.
శారీరక ప్రమాణాలు:
-ఎత్తు- 152.5 సెం.మీ.
-ఛాతీ- శరీరానికి తగిన అనుపాతంలో ఉండాలి. గాలిని పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం చెందాలి.
-బరువు- ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ పరీక్షల ద్వారా చేస్తారు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..
-6 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి.
-10 పుష్ అప్‌లు, 10 సిట్ అప్‌లు, 20 స్కాట్స్.
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు.
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు జాయింట్ బేసిక్ ఫేజ్ ట్రెయినింగ్‌ను కర్ణాటకలోని బెల్గావిలో ఇస్తారు. శిక్షణ అనంతరం వారికి కేటాయించిన ట్రేడ్‌ల వారీగా ఉద్యోగం ఇస్తారు. మొదట 20 ఏండ్ల కాలానికి ఉద్యోగ నియామక పత్రాన్ని ఇస్తారు. దీన్ని 57 ఏండ్లు వయస్సు వచ్చే వరకు పొడిగించవచ్చు.
-పే స్కేల్: శిక్షణ కాలంలో నెలకు రూ. 14,600, శిక్షణ పూర్తయిన తర్వాత గ్రూప్ ఎక్స్ పోస్టులకు నెలకు రూ. 33,100/-, గ్రూప్ వై పోస్టులకు రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి.
-పదోన్నతులు: ఎయిర్‌మెన్ నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ వరకు పదోన్నతి పొందవచ్చు. ఇదేకాకుండా నిర్ణీత పరీక్షలు రాసి కమిషన్డ్ ఆఫీసర్ వరకు పదోన్నతి పొందవచ్చు.
నోట్: ఎయిర్‌మెన్ ట్రేడ్ శిక్షణ అనంతరం ఉన్నత చదువులు చదవడానికి అనుమతినిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 15 నుంచి ప్రారంభం.
-ఫీజు: రూ. 250/-
-చివరితేదీ: 2018, జనవరి 12
-వెబ్‌సైట్: www.airmenselection.cdac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
న్యూక్లియర్ ఫిజిక్స్‌లోఉద్యోగాలు,

కోల్‌కతాలోని సాహ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-ఇంజినీర్ సీ - 3 పోస్టులు
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత. 
-సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 6 ఖాళీలు.
-అర్హత: సివిల్/ఎలక్ట్రికల్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-టెక్నీషియన్ బీ - 6 ఖాళీలు.
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, సైన్స్‌తో హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ ఉండాలి.
-లోయర్ డివిజన్ క్లర్క్- 4 ఖాళీలు.
-అర్హత: డిగ్రీ/ఇంటర్‌లో ఇంగ్లిష్, మ్యాథ్స్‌తో ఉత్తీర్ణత. మూడేండ్ల అనుభవం ఉండాలి. టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేయాలి. 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (ఎల్‌డీసీలకు ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 29
-వెబ్‌సైట్: 

http://www.saha.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్ - యూఆర్‌డీఐపీ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు,
సీఎస్‌ఐఆర్‌కు చెందిన యూనిట్ ఫర్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ (సీఎస్‌ఐఆర్ - యూఆర్‌డీఐపీ)లో ప్రాజెక్ట్
అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
laboratory-workers
వివరాలు:
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (కెమికల్ సైన్సెస్)-
గ్రేడ్-II: 5 ఖాళీలు
-అర్హత: ఎమ్మెస్సీ ఆర్గానిక్/బయోకెమిస్ట్రీ లేదా నేచురల్ ప్రొడక్ట్ లేదా తత్సమాన కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ప్రాజెక్ట్ అసిస్టెంట్- గ్రేడ్-III: 3 ఖాళీలు
-అర్హత: ఎంఫార్మా ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/ మెడిసినల్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్/బయోకెమిస్ట్రీ, కెమికల్ సైన్సెస్ లేదా తత్సమాన కోర్సు
-ప్రాజెక్ట్ అసిస్టెంట్- గ్రేడ్-II: 1 ఖాళీ
-అర్హత: పీజీ/బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ)లో ఉత్తీర్ణత.
-కోఆర్డినేటర్ (పుణె సెంటర్)- 1 పోస్టు
-అర్హత: ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత లేదా
పీహెచ్‌డీ ఇన్ సైన్స్/ఇంజినీరింగ్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 4
-వెబ్‌సైట్: www.urdip.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఏఆర్-డీవోజీఆర్ ఉద్యోగాలు,
మహారాష్ట్ర (పుణె)లోని డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రిసెర్చ్ (డీవోజీఆర్)లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ICAR-DOGR 
వివరాలు:
డీవోజీఆర్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఎఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ 
-పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ (గ్రేడ్ 1)
-మొత్తం ఖాళీల సంఖ్య-8 
-అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయాలజీ, అగ్రికల్చర్), బీఎస్సీ (ఎంపీసీ)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు. 
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
చిరునామా:Director,ICAR-DOGR, Rajg urunagar, Pune, Maharashtra-410505
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 14

-వెబ్‌సైట్: www.dogr.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇంజినీర్స్ ఇండియాలో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 
ఆహ్వానిస్తున్నది. 
eil-india-limited 
వివరాలు:
-మేనేజర్- 4 పోస్టులు
-విభాగాలు: కంపెనీ సెక్రటరీ, టౌన్ ప్లానర్, 
నేవల్ ఆర్కిటెక్ట్, మైనింగ్
-సీనియర్ ఇంజినీర్ (స్ట్రక్చరల్)-1 పోస్టు
-సీనియర్ ఆఫీసర్-3 పోస్టులు
-జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-5 పోస్టులు
-హిందీ టైపిస్ట్- 3 పోస్టులు
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-చివరి తేదీ: డిసెంబర్ 18

-వెబ్‌సైట్: www.engineersindia.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డిఫెన్స్ అకౌంట్స్‌లో ఉద్యోగాలు,
సికింద్రాబాద్‌లోని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌లో ఖాళీగా ఉన్న క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cgda 
వివరాలు:
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: క్యాంటీన్ అటెండెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య:8 
(జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
-అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 
పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే 
రూ. 1800/-
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The Controller of Defence Accounts, No. 1, Staff Road, Secunderabad-500009
-దరఖాస్తుకు చివరితేదీ: 2018 జనవరి 1

-వెబ్‌సైట్: http://cdasecbad.ap.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రో-ఎల్‌పీఎస్సీలో ఉద్యోగాలు,
కేరళ (తిరువనంతపురం)లోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
isro 
వివరాలు:

-మొత్తం పోస్టుల సంఖ్య: 17
-పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్-7 ఖాళీలు 
(మెకానికల్-4, ఫొటోగ్రఫీ-1, ఎలక్ట్రికల్-1)
-అర్హత: మెకానికల్, ఫొటొగ్రఫీ/సినిమాటోగ్రఫీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
-హిందీ టైపిస్ట్-1 ఖాళీ
-అర్హత: డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్)లో ఉత్తీర్ణత.
-టెక్నీషియన్- 7 ఖాళీలు
-అర్హత: పదో తరగతిపాటు ఐటీఐ (ఫిట్టర్/ఎలక్ట్రానిక్ మెకానిక్)లో ఉత్తీర్ణత.
-ఫైర్‌మెన్/క్యాటరింగ్ అటెండెంట్-2 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 
పదో తరగతిలో ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: డిసెంబర్ 18

-వెబ్‌సైట్: www.lpsc.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎంహెచ్‌ఆర్‌సీ రెసిడెంట్ డాక్టర్లు.

భోపాల్‌లోని భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ (బీఎంహెచ్‌ఆర్‌సీ)లో సీనియర్/జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
బీఎంహెచ్‌ఆర్‌సీ కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ పరిధిలోనిది.
-పోస్టులు: సీనియర్ రెసిడెంట్లు
-విభాగాల వారీగా ఖాళీలు: అనెస్థీషియా- 6, మెడిసిన్ గ్రూప్- 4, మైక్రోబయాలజీ- 1, పాథాలజీ- 1, రేడియాలజీ-1, సర్జరీ గ్రూప్- 4, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్- 1 ఖాళీ ఉన్నాయి.
-పోస్టు: జూనియర్ రెసిడెంట్లు
-విభాగాలు: అన్ని డిపార్ట్‌మెంట్లలో
-ఎంపిక: ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూ తేదీలు: సీనియర్ రెసిడెంట్స్- డిసెంబర్ 18న, జూనియర్ రెసిడెంట్స్- డిసెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.
-దరఖాస్తు, అర్హతలు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.bmhrc.org

0 comments:

Post a Comment