Sunday, 3 December 2017

ఎన్‌ఐఏబీలో ఉద్యోగాలు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, సీడబ్ల్యూసీలో ఉద్యోగాలు, ఈసీఐఎల్‌లో ఇంజినీర్ ట్రెయినీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, సమ్మర్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్, ఇండో జర్మన్ టూల్‌రూంలో ఉద్యోగాలు.

ఎన్‌ఐఏబీలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: ఎన్‌ఐఏబీ బయోటెక్నాలజీ శాఖ పరిధిలోస్వతంత్రంగా పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ. 
-సూపరింటెండింగ్ ఇంజినీర్ - 1, సెక్యూరిటీ ఆఫీసర్ -1, అసిస్టెంట్ మేనేజర్ ఆఫీస్ అండ్ ఎస్టేట్ -1, లైబ్రేరియన్ -1, ఫామ్‌మేనేజర్ - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2018, జనవరి 1
-హార్డ్‌కాపీలను దాఖలు చేయడానికి చివరితేదీ: 2018, జనవరి 5

-వెబ్‌సైట్: www.niab.org.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఒక స్వతంత్ర సంస్థ. ఇది కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లాసికల్ ఇండియన్ డ్రామా) - 1
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (మ్యూజిక్) - 1
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (లైట్) - 1
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (మూవ్‌మెంట్) -1
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (యాక్టింగ్) - 1
-జీతం: రూ. 15,600 - 39, 100 + గ్రేడ్ పే రూ. 5,400/-
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఏ డిగ్రీ, ఎన్‌ఎస్‌డీ డిప్లొమా ఇన్ డ్రమెటిక్/ సంబంధిత అంశంలో మాస్టర్ డిగ్రీలో సెకండ్ క్లాస్ ఉత్తీర్ణత. మంచి అకడమిక్ రికార్డు ఉండాలి.
-రెండేండ్ల రిసెర్చ్ లేదా ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి. ఇంగ్లిష్/హిందీ రాయడం, మాట్లాడటంలో ప్రావీణ్యత ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 14

-వెబ్‌సైట్: http://nsd.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడబ్ల్యూసీలో ఉద్యోగాలు,

కేంద్ర జల వనరుల శాఖ పరిధిలోని సెంట్రల్ వాటర్ కమిషన్ ( సీడబ్ల్యూసీ) స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
కేంద్ర జలవనరుల శాఖ నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
-మొత్తం పోస్టుల సంఖ్య: 33
-పోస్టు పేరు: స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-32 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా ఐటీఐలో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: డ్రైవర్-1 ఖాళీ
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మోటార్ బోట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ.1800/- (డ్రైవర్ పోస్టుకు రూ. గ్రేడ్ పే 1900/-)
-ఎంపిక : రాత పరీక్ష/స్కిల్ టెస్ట్
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరి తేదీ : ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు డిసెంబర్ 2-8న వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.

-వెబ్‌సైట్: www.cwc.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో ఇంజినీర్ ట్రెయినీ,
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) జోనల్/బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ట్రెయినీల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం
-శిక్షణ అనంతరం ఉద్యోగం, మంచి జీత భత్యాలు.
-ఆన్‌లైన్‌పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరి తేదీ: డిసెంబర్ 22


వివరాలు:
ఈసీఐఎల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. దీన్ని 1967 ఏప్రిల్ 11న ఏర్పాటుచేశారు.
-పనిచేసే ప్రదేశం: హెడ్ క్వార్టర్ (హైదరాబాద్)తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ ఆఫీస్‌లలో
-మొత్తం పోస్టుల సంఖ్య: 66 (జనరల్-33, ఓబీసీ-18, ఎస్సీ-10, ఎస్టీ-5)
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్-25, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-12, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్-3, కంప్యూటర్ సైన్స్-10, సివిల్-6, మెకానికల్-7, కెమికల్-3
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్/కంట్రోల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్, సివిల్, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 నవంబర్ 30 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: ట్రెయినింగ్ పీరియడ్‌లో రూ. 38,430/- (కన్సాలిడేటెడ్ పే). సంస్థ నిబంధనల ప్రకారం ప్రావిడెంట్ ఫండ్, లీవ్ తదితర సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ పూర్తయిన తర్వాత ఇంజినీర్ హోదాలో మొదటి ఏడాదికి రూ. 47,780/-, రెండో ఏడాదికి రూ. 49, 210/-, మూడో ఏడాదికి 50, 690/-టెక్నికల్ ఆఫీసర్‌కు రూ. 52, 210/- చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ONGC

-ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-రాతపరీక్షలో మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. హాల్‌టికెట్, ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గువాహటి, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నా, త్రివేండ్రం, విజయవాడ, వైజాగ్, తిరుపతి, నాగ్‌పూర్, తిరుచ్చి, కొచ్చిన్, జబల్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, జమ్ము, బెల్గావి.
-దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 22
-రాతపరీక్ష తేదీ: 2018 జనవరి 7
-వెబ్‌సైట్: www.ecil.co.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు,

కైగాలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)లో స్టయిఫండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
ఎన్‌పీసీఎల్ భారత ప్రభుత్వరంగ సంస్థ. ఇది అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ పరిధిలోనిది.
-స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్ (హెల్త్ ఫిజిక్స్) 
-ఖాళీల సంఖ్య - 3
-అర్హతలు: బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా, కెమిస్ట్రీ/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్/ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (మెకానికల్)
-ఖాళీల సంఖ్య - 1. ఇది హెచ్‌హెచ్ కేటగిరీలో ఉంది.
-అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
-వయస్సు: 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: నిర్ణీతనమూనాలో
-చివరితేదీ: డిసెంబర్ 21

-వెబ్‌సైట్: www.npcil.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సమ్మర్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్,
అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసెర్చ్ (ఏసీఎస్‌ఐఆర్) డా. ఏపీజే అబ్దుల్ కలాం సమ్మర్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ 2018 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయడానికి ఏఎస్‌ఐఆర్ ఈ అవకాశం కల్పిస్తుంది.
-అర్హతలు: బీఈ/బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నవారు లేదా తత్సమాన కోర్సు చేస్తున్నవారు. లేదా ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు చేసేవారు లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌లో మూడోఏడాది పూర్తయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-మొత్తం సీట్ల సంఖ్య - 20
-కాలవ్యవధి: 2 నెలలు2018, మే - ఆగస్టు మధ్య
-స్టయిఫండ్: ప్రోగ్రామ్ సమయంలో నెలకు రూ. 25,000/- ఇస్తారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2017, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.acsir.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేవల్ అకాడమీలో
ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో స్విమ్మింగ్ ట్రెయినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు: స్విమ్మింగ్ ట్రెయినర్
-ఖాళీల సంఖ్య - 8
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుషులు/మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
-జీతం: నెలకు రూ. 22, 500/ -
-ఎంపిక: ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 6
-వెబ్‌సైట్: http://ina.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండో జర్మన్ టూల్‌రూంలో ఉద్యోగాలు.
ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఇండో జర్మన్ టూల్‌రూంలో లాంగ్‌టర్మ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: 
ఔరంగాబాద్‌లోని ఇండో జర్మన్ టూల్‌రూం ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. కింది కోర్సులు జనవరి 2018 నుంచి ప్రారంభమవుతాయి. కోర్సులు ఔరంగాబాద్, నాగ్‌పూర్, పుణె, ముంబై సెంటర్లలో నిర్వహించనున్నారు.
INDO

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
-టూల్ డిజైన్ అండ్ క్యాడ్/క్యామ్
-మెకానికల్ ప్రొడక్ట్ డిజైన్, మెకట్రానిక్స్
-వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్

పోస్ట్ డిప్లొమా కోర్సులు
-టూల్ డిజైన్ అండ్ క్యాడ్/క్యామ్
-టూల్ అండ్ డై మ్యానుఫ్యాక్చరింగ్
-ప్రొడక్ట్ డిజైన్, మెకట్రానిక్స్
-సీఎన్‌సీ మెషిన్ మెయింటెనెన్స్
-ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్

అడ్వాన్స్ సర్టిఫికెట్ కోర్సులు
-టూల్ డిజైన్, క్యాడ్/క్యామ్/టూల్ అండ్ డై 
-మ్యానుఫ్యాక్చరింగ్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

-వెబ్‌సైట్: www.igtr.aur.gov.in

0 comments:

Post a Comment