Sunday, 3 December 2017

నిట్‌లో 92 ఫ్యాకల్టీ పోస్టులు, బార్క్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు, వ్యాప్కోస్‌లో ఉద్యోగాలు, బిట్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, వైల్డ్‌లైఫ్‌లో బయాలజిస్టులు ఉద్యోగాలు, ఎన్‌ఐఈఎల్‌ఐటీ డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు.

నిట్‌లో 92 ఫ్యాకల్టీ పోస్టులు,

జాతీయ సంస్థలో కొలువులు
-ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ప్రత్యేక సౌకర్యాలు

వివరాలు: కర్ణాటక సూరత్‌కల్‌లోని నిట్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. దీన్ని 1960లో ప్రారంభించారు.
national-institute
సూరత్‌కల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం ఖాళీల సంఖ్య - 92
-ప్రొఫెసర్ - 5
-అసోసియేట్ ప్రొఫెసర్ - 87
ఖాళీలు ఉన్న విభాగాలు..
-అప్లయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్, మ్యాథమెటికల్ అండ్ కంప్యుటేషనల్ సైన్సెస్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
అర్హతలు:
-అసోసియేట్ ప్రొఫెసర్ - సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టులో పీహెచ్‌డీ. వీటితోపాటు పీహెచ్‌డీ తర్వాత కనీసం ఆరేండ్లు బోధన రంగంలో అనుభవం ఉండాలి. దీనిలో కనీసం మూడేండ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా తొమ్మిదేండ్ల టీచింగ్ అనుభవం ఉండాలి. దీనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మూడేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
-ప్రొఫెసర్ - సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో పీహెచ్‌డీ. పీహెచ్‌డీ తర్వాత కనీసం పదేండ్లపాటు టీచింగ్ రంగంలో అనుభవం ఉండాలి. కనీసం మూడేండ్లపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా తత్సమాన అనుభవం ఉండాలి.
నోట్: ఆయా సబ్జెక్టులకు సంబంధించిన స్పెషలైజేషన్స్ వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-పేస్కేల్: అసోసియేట్ ప్రొఫెసర్ - పేబ్యాండ్-4, గ్రేడ్ పే రూ.9,500. కనీసవేతనం రూ.42,800/-
-ప్రొఫెసర్ - పేబ్యాండ్-4, గ్రేడ్ పే రూ.10,500/- కనీస వేతనం రూ. 48,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 500/-
-ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-హార్డ్‌కాపీ ప్రింట్ అవుట్‌లకు సంబంధిత సర్టిఫికెట్స్ జతచేసి కింది చిరునామాకు పంపాలి.
చిరునామా: The Registrar,
National Institute of Technology Karnataka, Surathkal,
MANGALURU575 025,
KARNATAKA, INDIA.
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేసుకోవడానికి చివరితేదీ: 2017, డిసెంబర్ 11
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: https://facultyrecruitment.l1.nitk.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు,

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఇ)కి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BARC 
వివరాలు: భారత ప్రభుత్వం 1954 జనవరి 3న అణుపరిశోధన కోసం అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్, ట్రాంబే అనే సంస్థను స్థాపించింది.1966లో భారతదేశ అణుశక్తి పితామహుడుగా పేరుగాంచిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా జ్ఞాపకార్థంగా ట్రాంబేను బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌గా పేరు మార్చారు.
-పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్-2 ఖాళీలు
-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీతోపాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (న్యూక్లియర్ మెడిసిన్) లేదా బీఎన్‌ఎంటీ లేదా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ/సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 19,502+ డీఏ
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-పర్సనల్ ఇంటర్వ్యూ: డిసెంబర్ 7.

-వెబ్‌సైట్: http://www.barc.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వ్యాప్కోస్‌లో ఉద్యోగాలు,
వ్యాప్కోస్ లిమిటెడ్ ఇంజినీర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్లు తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: వ్యాప్కోస్ లిమిటెడ్ పశ్చిమబెంగాల్‌లోని హల్దియాలో చేపడుతున్న ప్రాజెక్ట్ కోసం ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-ఇంజనీర్ (సివిల్) - 4
-అర్హత: బీఈ/బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్‌తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఇంజినీర్ (సీఎస్‌ఈ) - 1
-అర్హత: బీఈ/బీటెక్ సీఎస్‌ఈలో ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం.
-జీఐఎస్ ఎక్స్‌పర్ట్ - 1
-అర్హత: ఎంఏలో జాగ్రఫీ (రిమోట్ సెన్సింగ్, జీఐఎస్), రెండేండ్ల అనుభవం.
-అకౌంటెంట్ అసిస్టెంట్ - 1
-అర్హత: బీకాం ఉత్తీర్ణత.
-ఆఫీస్ అసిస్టెంట్ -1, ఫీల్డ్ అసిస్టెంట్ -1, కంప్యూటర్ ఆపరేటర్ - 1 ఖాళీ ఉన్నాయి. 
-అర్హత: పై మూడు పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేటర్‌కు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
-మెసెంజర్ - 2 
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
-కుక్ - 2, స్వీపర్ - 1, నైట్ వాచ్‌మెన్ - 1 
-అర్హతలు: పనిచేసిన అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: అభ్యర్థులు బయోడేటాను 15 రోజుల్లో పంపాలి.

-వెబ్‌సైట్: www.wapcos.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,
మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
BITS-MESRA
వివరాలు: మెస్రా (రాంచీ)లోని బిట్స్‌లో 2018 స్ప్రింగ్ సెషన్ కోసం ఈ ప్రవేశాలు.
-కోర్సు: పీహెచ్‌డీ (ఫుల్‌టైం/పార్ట్‌టైం)
-విభాగాలు: బయో ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, మేనేజ్‌మెంట్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ స్పేస్ ఇంజినీరింగ్ అండ్ రాకెట్రీ.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంటెక్/ఎంఈ లేదా ఎమ్మెస్సీ (ఇంజినీరింగ్) లేదా ఎంఆర్క్ /ఎంఫార్మా లేదా ఎంసీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. వీటితోపాటు బీఈ/బీటెక్ లేదా బీఎస్సీలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గేట్ స్కోర్ (80 పర్సంటైల్) లేదా 10 ఏండ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్, అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్ రూ. 2,500/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 1,500/-
-చివరితేదీ: డిసెంబర్ 8
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: డిసెంబర్ 13
-వెబ్‌సైట్: http://www.bitmesra.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వైల్డ్‌లైఫ్‌లో బయాలజిస్టులు ఉద్యోగాలు,

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)లో ప్రాజెక్ట్ పర్సనల్/బయాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
WII 
వివరాలు: వెల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ పరిధిలో పనిచేసే స్వతంత్ర సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య - 59. 
విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు..
-టైగర్ ప్రాజెక్ట్‌లో... 
-ప్రాజెక్ట్ అసోసియేట్ - 2 
-అర్హత: బయాలజికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ లేదా ఎమ్మెస్సీ వైల్డ్‌లైఫ్ సైన్సెస్ లేదా జువాలజీ/బాటనీ/లైఫ్ సైన్సెస్ లేదా ఫారెస్ట్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 40 ఏండ్లు మించరాదు. 
-సీనియర్ బయాలజిస్ట్ - 4 ఖాళీలు
-అర్హతలు: ఎమ్మెస్సీ వైల్డ్‌లైఫ్ సైన్సెస్/బాటనీ లేదా జువాలజీ/ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-రిసెర్చ్ బయాలజిస్ట్ - 45 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్/బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ వైల్డ్‌లైఫ్ సైన్సెస్ లేదా బాటనీ, జువాలజీ, ఫారెస్ట్రీ లేదా లైఫ్ సైన్సెస్ లేదా అగ్రికల్చరల్ సైన్సెస్ లేదా తత్సమాన కోర్సు. 
-వయస్సు: బీఈ/బీటెక్ అభ్యర్థులు అయితే 35 ఏండ్లు మించరాదు. బీఎస్సీ అభ్యర్థులు అయితే 28 ఏండ్లు మించరాదు.
-జీతం: బీఈ/బీటెక్/ఎంటెక్, ఎమ్మెస్సీ అభ్యర్థులకు నెలకు రూ. 25,000/- 
-బీఎస్సీ అభ్యర్థులకు నెలకు రూ. 20,000/-
-రిసెర్చ్ బయాలజిస్ట్ - 2 ఖాళీలు
-అర్హత: ఎమ్మెస్సీ వైల్డ్‌లైఫ్ సైన్సెస్ లేదా తత్సమాన కోర్సు
-జీతం: నెలకు రూ. 25,000/-
-రిసెర్చ్ బయాలజిస్ట్ (జెనెటిక్స్ కాంపోనెంట్) - 3 పోస్టులు
-వీటితోపాటు కింది వేర్వేరు ప్రాజెక్టుల్లో కింది ఖాళీలు ఉన్నాయి. 
-ప్రాజెక్ట్ బయాలజిస్ట్ - 2, సీనియర్ బయాలజిస్ట్ - 1 ఖాళీ ఉన్నాయి.
-ఎంపిక: ఆన్‌లైన్ క్వాలిఫయింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ 
-ఆన్‌లైన్ టెస్ట్ సెంటర్లు: హైదరాబాద్, డెహ్రాడూన్, జైపూర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ/ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, నాగపూర్, చండీగఢ్, కోయంబత్తూరు, తిరువనంతపురం, రాంచీ తదితర కేంద్రాలు ఉన్నాయి.
-ఆన్‌లైన్ టెస్ట్‌ను 50 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: డిసెంబర్ 23
-ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15

-వెబ్‌సైట్: http://www.wii.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈఎల్‌ఐటీ డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డీపీఎం తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: న్యూఢిల్లీలోని ఎన్‌ఐఈఎల్‌టీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య - 29. వీటిలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ - 2, అప్లికేషన్ మేనేజర్ - 1, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 1, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్ - 1, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 15, అడ్డా ఫీ కలెక్టర్ - 9 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 35 ఏండ్లు. కొన్ని పోస్టులకు 37/58 ఏండ్ల వరకు ఉంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష / టైపింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 3

-వెబ్‌సైట్: www.nielit.gov.in

0 comments:

Post a Comment