Sunday, 3 December 2017

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 313 అప్రెంటిస్‌లు, ఎన్‌టీపీసీలో ఐటీఐ ట్రెయినీలు ఉద్యోగాలు, సీఎంఈఆర్‌ఐ ప్రాజెక్ట్ అసిస్టెం ట్లు ఉద్యోగాలు, ఎల్& టీ స్కాలర్‌షిప్స్, సిడ్బికంటెంట్ రైటర్ ఉద్యోగాలు, ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగాలు, అహ్మదాబాద్ ఐఐఎంలో ఉద్యోగాలు.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 313 అప్రెంటిస్‌లు,

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు ట్రేడ్‌లలో అప్రెంటిస్ కోసం ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Railway
వివరాలు: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని నాగ్‌పూర్ డివిజన్, మోతీబాగ్ వర్క్‌షాప్‌లో కింది ఖాళీలు ఉన్నాయి.
-మొత్తం ఖాళీలు - 313.
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..
-నాగ్‌పూర్ డివిజన్‌లో: ఫిట్టర్ - 36, కార్పెంటర్ - 19, వెల్డర్ - 32, పాసా 18, ఎలక్ట్రీషియన్ - 48, సెక్రటేరియల్ ప్రాక్టీస్ - 10, పైప్ ఫిట్టర్ - 20, వైర్‌మ్యాన్ - 11, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 19, పవర్ మెకానిక్స్ - 4, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటేనెన్స్ - 4, డీజిల్ మెకానిక్ - 46, ట్రిమ్మర్ - 4, బేరియర్ - 1 ఖాళీ ఉన్నాయి.
-మోతీబాగ్ వర్క్‌షాప్‌లో: ఫిట్టర్ - 6, వెల్డర్ - 9 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: 2017, నవంబర్ 25 నాటికి 15 ఏండ్లు మించరాదు. గరిష్ఠ వయస్సు 24 ఏండ్లు.
-విద్యార్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. పైఅర్హతలన్నీ 2017, నవంబర్ 25లోగా సాధించి ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
-స్టయిఫండ్: సెంట్రల్ అప్రెంటిస్‌షిప్ కౌన్సిల్ నిర్ణయించిన మేరకు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 27
-వెబ్‌సైట్: www.secr.indianrailways.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీపీసీలో ఐటీఐ ట్రెయినీలు ఉద్యోగాలు,
పదోతరగతి, ఐటీఐ, బీఎస్సీ కెమిస్ట్రీ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీత భత్యాలు
-రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక
-ఎన్‌టీపీసీ యూనిట్లలో ఎక్కడైనా పనిచేయవచ్చు
-చివరి తేదీ: డిసెంబర్ 31

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్ట్ యూనిట్లలో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన ఐటీఐ ట్రేడ్, బీఎస్సీ (కెమిస్ట్రీ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 
ఆహ్వానిస్తున్నది.
young-group
వివరాలు: మహారత్న హోదా కలిగిన ఎన్‌టీపీసీని 1975 నవంబర్ 7న స్థాపించారు. ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తి, సహజ వాయువు అన్వేషణ, ఉత్పత్తి, రవాణా, పంపిణీ చేస్తుంది.
-ఐటీఐ ట్రెయినీ, అసిస్టెంట్ ట్రెయినీ
-పనిచేసే ప్రదేశం: ఛత్తీస్‌గఢ్ (ఎన్‌టీపీసీ లారా) ప్రాజెక్ట్ యూనిట్లలో
-మొత్తం ఖాళీలు: 69 పోస్టులు
-ఐటీఐ ట్రెయినీ (ఫిట్టర్)-30 పోస్టులు 
(జనరల్-17, ఓబీసీ-1, ఎస్సీ-3, ఎస్టీ-9)
-ఐటీఐ ట్రెయినీ (ఎలక్ట్రీషియన్)-16 పోస్టులు 
(జనరల్-10, ఎస్సీ-1, ఎస్టీ-5)
-ఐటీఐ ట్రెయినీ (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్)-12 పోస్టులు (జనరల్-8, ఎస్సీ-1, ఎస్టీ-3)
-అసిస్టెంట్ (మెటీరియల్స్/స్టోర్ కీపర్) ట్రెయినీ-5 పోస్టులు (జనరల్-4, ఎస్టీ-1)
-ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) ట్రెయినీ-6 పోస్టులు (జనరల్-5, ఎస్టీ-1)
అర్హతలు:
-ఐటీఐ ట్రెయినీ : ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ బోర్డుతో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) ట్రేడ్‌లో ఉత్తీర్ణత. 
-అసిస్టెంట్ (మెటీరియల్స్/స్టోర్ కీపర్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి, ఎన్‌సీవీటీ నుంచి స్టోర్ కీపింగ్‌తోపాటు ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి
-ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణత
-ప్రొబేషనరీ పీరియడ్ : ఏడాదిపాటు ఉంటుంది. ట్రెయినింగ్ పీరియడ్‌లో కన్సాలిడేటెడ్ స్టయిఫండ్ గా నెలకు రూ. 11,500/- చెల్లిస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత కంపెనీ నిబంధనల ప్రకారం పే స్కేల్ ఉంటుంది. ఈ ట్రెయినింగ్ పీరియడ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎన్‌టీపీసీ యూనిట్లలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
-పేస్కేల్ : 11,500-26,000/- +
ఇతర అలవెన్స్‌లుంటాయి.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-. ఎస్సీ, ఎస్టీ, 
పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి
చిరునామా: DGM (HR-Rectt), 
NTPC Limited, Western Region-II, Headquarters, 4th Floor, 
Magneto Office, Labhandi,GE Road, N.H-6, Raipur(C.G)-492001
-దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్ 31
-ఆబ్జెక్టివ్ రాతపరీక్ష తేదీ : 2018 మార్చిలో

-వెబ్‌సైట్: www.ntpccareers.net----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎంఈఆర్‌ఐ ప్రాజెక్ట్ అసిస్టెం ట్లు ఉద్యోగాలు,
సీఎస్‌ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ)లో రిసెర్చ్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
cmeri 
వివరాలు: సీఎంఈఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ పరిధిలోనిది. దీన్ని 1958లో దుర్గాపూర్‌లో ప్రారంభించారు. 
-ప్రాజెక్ట్ అసిస్టెంట్లు - 27 పోస్టులు
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్/ పీజీ చేసి ఉండాలి. వేర్వేరు ప్రాజెక్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
-రిసెర్చ్ అసోసియేట్ - 1, ప్రాజెక్ట్ జేఆర్‌ఎఫ్ - 2 
-ఎంపిక: ఇంటర్వ్యూ 
-ఇంటర్వ్యూతేదీలు: డిసెంబర్ 5, 6

-వెబ్‌సైట్: http://www.cmeri.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎల్& టీ స్కాలర్‌షిప్స్,
ముంబైలోని ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మేనేజ్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీలో ఎంటెక్ చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక చేయూత కోసం ఈ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, కోర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-స్కాలర్ షిప్ విలువ: ఎంపికైన ప్రతి అభ్యర్థికి రెండేండ్ల వ్యవధికి రూ. 3,21,600/- అంటే ప్రతి నెలకు రూ. 13,400/- చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు స్కాలర్‌షిప్‌ను ఇస్తారు.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష (సబ్జెక్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్), ఇంటర్వ్యూ
-ఈ ఎగ్జామ్ ఐఐటీ ఢిల్లీ/మద్రాస్ నిర్వహిస్తాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 27
-హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: 2018 జనవరి 22 నుంచి
-ఆన్‌లైన్ ఎగ్జామ్: 2018 ఫిబ్రవరి 18
-ఇంటర్వ్యూ తేదీ: 2018 మార్చి చివరివారంలో
-వెబ్‌సైట్: www.lntech.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సిడ్బికంటెంట్ రైటర్ ఉద్యోగాలు,
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)లో కంటెంట్ రైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
sidbi 
వివరాలు: సిడ్బి ప్రభుత్వ రంగ సంస్థ. ప్రస్తుత ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-పోస్టు: కంటెంట్ రైటర్
-పనిచేయాల్సిన ప్రదేశం: లక్నో
-వయస్సు: 25 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు: డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత.
-అనుభవం: సంబంధిత రంగంలో అనుభంతోపాటు ఇంగ్లిష్ రాయడంలో ప్రావీణ్యత ఉండాలి.
-జీతం: నెలకు రూ. 35,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15

-వెబ్‌సైట్: https://sidbi.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,
హిమాచల్‌ప్రదేశ్ (పాలంపూర్)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్సెస్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఎస్‌ఆర్‌ఆఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
IHBT 
వివరాలు:ఐహెచ్‌బీటీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
-సీనియర్ రిసెర్చ్ ఫెలో-1 పోస్టు
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్ 3)-3 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎమ్మెస్సీ (ప్లాంట్ పాథాలజీ, బాటనీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, మైక్రోబయాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, లైప్ సైన్సెస్), ఎంబీఏలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 27 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: 25,000+ హెచ్‌ఆర్‌ఏ. పోస్టులనుబట్టి వేర్వేరుగా పే స్కేల్ ఉన్నాయి.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలను నింపి, సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి. 
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 14

-వెబ్‌సైట్: www.ihbt.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టులు: హెచ్ క్లర్క్, కాన్సులర్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్
-అర్హతలు, వయస్సు తదితర వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: డిసెంబర్ 13

-వెబ్‌సైట్: https://in.usembassy.gov/embassy-consulates/hyderabad----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అహ్మదాబాద్ ఐఐఎంలో ఉద్యోగాలు.

అహ్మ దాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) క్యాంపస్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 
ఆహ్వానిస్తున్నది.
IIM 
వివరాలు:
-టెక్నికల్ ఆఫీసర్ (ఏవీ/ సీసీటీవీ/ ఐపీ టెలిఫోని)
-ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, స్టూండెంట్ ఎక్స్ఛేంజ్
-ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, కేస్ సెంటర్
-ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కంప్యూటర్ సెంటర్
-ప్రాజెక్ట్ ఫెసిలిటేటర్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ/బీటెక్, మేనేజ్‌మెంట్‌లో పీజీ, ఎంబీఏ, బ్యాచిలర్ డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14

-వెబ్‌సైట్: www.iima.ac.in

0 comments:

Post a Comment