Wednesday, 22 November 2017

బామర్ లారీలో జూనియర్ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఐఐఎం కోజికోడ్‌లో ఫెలో ప్రోగ్రామ్ , పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు, ఇండియన్ ఫార్మాకోపియాలో ఉద్యోగాలు, సీఎస్‌ఎస్‌ఐ సాఫ్ట్‌వేర్ ట్రెయినీ ఉద్యోగాలు, ఇర్కాన్ ఇంటర్నేషనల్‌లో ఉద్యోగాలు, ఐకేఎస్ హెల్త్‌కేర్ సర్వీసెస్ కంపెనీలో ట్రెయినీ అసోసియేట్ ఉద్యోగాలు, బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు.

బామర్ లారీలో జూనియర్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
బామర్ లారీ అండ్ కో లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: మినీరత్న కంపెనీ హోదా కలిగిన బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ పెట్రోలియం, సహజవాయువుల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 50
-పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్
-విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సైట్ ఆపరేషన్స్, ప్లాంట్ ఆపరేషన్, ప్రొడక్షన్, హెచ్‌ఆర్, ఐటీ.
-అర్హత: డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్/రిఫ్రిజిరేషన్), ఏదైనా డిగ్రీ, డిగ్రీతోపాటు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్/అప్లికేషన్స్ లేదా హార్డ్‌వేర్‌లో డిప్లొమా, బీకాం, మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్)లో ఉత్తీర్ణత. 
-వయస్సు : 2017 డిసెంబర్ 9 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-చివరి తేదీ : డిసెంబర్ 9

-వెబ్‌సైట్: http://balmerlawrie.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం కోజికోడ్‌లో ఫెలో ప్రోగ్రామ్ ,

కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (డాక్టోరల్ లెవల్ ప్రొగ్రామ్)లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIM
-కోర్సు పేరు: ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
-విభాగాలు: ఎకనామిక్స్, ఫైనాన్స్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
-అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంబీబీఎస్, ఎల్‌ఎల్‌బీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్), బీఈ/బీటెక్ (60 శాతం మార్కులతో), సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌లో 50 శాతం మార్కులతోఉత్తీర్ణత. మార్కెటింగ్ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి. క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ, యూజీసీ నెట్/జేఆర్‌ఎఫ్, గేట్‌లో అర్హత సాధించాలి.
-ఎంపిక: క్యాట్, జీమ్యాట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: 2018 జనవరి 22
-వెబ్‌సైట్: www.iimk.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు,
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీఐసీఎల్) అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: 
పవర్‌గ్రిడ్ ప్రభుత్వరంగ సంస్థ. ఇది ఒక నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ.
-మొత్తం ఖాళీల సంఖ్య 45. 
-పోస్టు: ఐటీఐ అప్రెంటిస్
-ఖాళీల సంఖ్య - 3
-అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. 
-పోస్టు: టెక్నీషియన్ అప్రెంటిస్
-ఖాళీల సంఖ్య - 42
-అర్హత: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: https://careers.powergrid.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఫార్మాకోపియాలో ఉద్యోగాలు,
ఘజియాబాద్‌లోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) ఖాళీగా ఉన్న ఫార్మాకో విజిలెన్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:ఐపీసీ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ , ఫ్యామిలీ వెల్ఫేర్ అనుబంధగా పనిచేస్తుంది.
-పోస్టు పేరు: ఫార్మాకో విజిలెన్స్ అసోసియేట్ 
-మొత్తం పోస్టుల సంఖ్య: 14
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి డీఫార్మసీ/ఎంఫార్మసీ, బీడీఎస్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పీజీతోపాటు ఫార్మాకోవిజిలెన్స్‌లోఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-పే స్కేల్ : రూ. 25,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ: నవంబర్ 28

-వెబ్‌సైట్:www.ipc.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఎస్‌ఐ సాఫ్ట్‌వేర్ ట్రెయినీ ఉద్యోగాలు,

కంప్యూటర్ సొల్యూషన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంటర్నేషనల్ (సీఎస్‌ఎస్‌ఐ)లో సాఫ్ట్‌వేర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
-సీఎస్‌ఎస్‌ఐ యూఎస్ బేస్డ్ ఎంఎన్‌సీ. ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీస్‌లను అందిస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ.
-డొమైన్: ఇన్సూరెన్స్/హెల్త్‌కేర్
-పోస్టు: సాఫ్ట్‌వేర్ ట్రెయినీ
-అర్హతలు: 2018లో బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ) ఉత్తీర్ణులకు అంటే ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, బీఈ/బీటెక్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-ఎంపికైన అభ్యర్థులకు మూడునెలల పాటు డాట్‌నెట్, ఎస్‌క్యూఎల్, టెస్టింగ్, బీఏ ప్లాట్‌ఫామ్‌లపై శిక్షణ ఇస్తారు.
-సీటీసీ: శిక్షణ సమయంలో ఏడాదికి రూ. 1,80,000/-, అనంతరం ఏడాదికి రూ. 2,40,000/ వరకు ఇస్తారు.
-ఎంపిక: ఆప్టిట్యూడ్, టెక్నికల్‌పై ఆన్‌లైన్ టెస్ట్, ఐక్యూ, ప్రోగ్రామింగ్‌లపై రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.
-డ్రైవ్‌తేదీ: 2017, డిసెంబర్ 9
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 24 (1pm వరకు)

-వెబ్‌సైట్: https://www.task.telangana. gov.in / Placements/CSSI_2018


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇర్కాన్ ఇంటర్నేషనల్‌లో ఉద్యోగాలు,
రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫైనాన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు: 
-మొత్తం పోస్టుల సంఖ్య: 20
-పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్-2, మేనేజర్-4, డిప్యూటీ మేనేజర్-4, అసిస్టెంట్ మేనేజర్-5, అసిస్టెంట్ ఆఫీసర్-5
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సీఏ/ఐసీడబ్ల్యూఏ పూర్తిచేసి ఉండాలి.
-వయస్సు: పోస్టును బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు రూ. 250/-, పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్ 7

-వెబ్‌సైట్: www.ircon.org----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐకేఎస్ హెల్త్‌కేర్ సర్వీసెస్ కంపెనీలో ట్రెయినీ అసోసియేట్ ఉద్యోగాలు,
ఐకేఎస్ హెల్త్‌కేర్ సర్వీసెస్ కంపెనీలో ట్రెయినీ అసోసియేట్ కోసం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదవుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-డొమైన్: హెల్త్ కేర్
-పోస్టు: ట్రెయినీ అసోసియేట్
-అర్హతలు: బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ ఫైనల్ ఇయర్ చదవుతున్నవారు. 2018 Passout. అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
-అభ్యర్థులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాస్తవ్యులై ఉండాలి. 
-సీటీసీ: ఏడాదికి రూ. 1,90,000 + రూ. 18,000 (రాత్రి షిఫ్ట్ అలవెన్స్) + రూ. 38,000 (ప్రతిభ ఆధారంగా ప్రతి మూడునెలలకు చెల్లిస్తారు)
-ఎంపిక: హెచ్‌ఆర్ స్క్రీనింగ్, వాయిస్, యాక్సెంట్ టెస్ట్, రాతపరీక్ష, మేనేజర్ ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 27 (1pm వరకు)
-వెబ్‌సైట్: https://www.task.telangana.gov.in/Placements/ IKSHealth

టెక్నికల్ అసిస్టెంట్లు
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు - 10
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: సివిల్/మెకానికల్ లేదా మెరైన్ ఇంజినీరింగ్ లేదా తత్సమానకోర్సులో డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 25

-వెబ్‌సైట్: www.iwai.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు.
పదోతరగతి+ డిప్లొమాలో ఉత్తీర్ణత
-ఇంటర్వూ ద్వారా ఎంపిక
- శిక్షణకాలంలో స్టయిఫండ్


బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఎలక్ట్రానిక్స్ డివిజన్ విభాగంలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా హోల్డర్స్) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
దేశంలో అతిపెద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ను 1964లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మహారత్న హోదా కలిగి ఉంది.
-మొత్తం అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య: 310
-టెక్నీషియన్ అప్రెంటిస్(డిప్లొమా హోల్డర్స్)
-1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం ఈ కింది ట్రేడుల్లో శిక్షణ ఇస్తారు.
-బీహెచ్‌ఈఎల్‌లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటైన బెంగళూరులో శిక్షణ ఇస్తారు.
-విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్
-అర్హత: పదోతరగతితోపాటు మూడేండ్ల డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. 2015/2016/2017లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎసీ ్ట అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-స్టయిఫండ్: నెలకు రూ. 4000/-చెల్లిస్తారు..
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా .
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో పర్సనల్ అధికారివద్ద హాజరు కావాలి.
-టెక్నీషియన్ అప్రెంటిస్‌కు ఎంపికైన అభ్యర్థులు బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ సదరన్ రీజియన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
-చిరునామా: Bharat Heavy Electricals Limited, Electronics Division, Mysuru Road, Bengaluru 560026
-ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 16 వరకు
-వెబ్‌సైట్: www.bheledn.com

0 comments:

Post a Comment