Tuesday, 7 November 2017

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు, హెచ్‌సీయూలో ఎంబీఏ ప్రవేశాలు,ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్, డీఎన్‌బీ పోస్టు డిప్లొమా సెట్ రామానందతీర్థలో ప్రవేశాలు, రక్షణశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మెన్ మేట్, కుక్, చౌకీదార్ ఉద్యోగాలు, జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో పీజీ ప్రవేశాలు.

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు,
ముంబైలోని పవన్ హాన్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

pawanhans 
వివరాలు: 
పవన్ హాన్స్ లిమిటెడ్ అనేది మినీరత్న హోదా కలిగిన కంపెనీ.
-జూనియర్ ఇన్‌స్ట్రక్టర్
-వర్క్‌షాప్ డెమాన్‌స్ట్రేటర్
-అర్హత: ఏరోనాటికల్/మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏదాదిపాటు అనుభవం ఉండాలి.
-ఫ్లైట్ డిస్పాచర్
-అర్హత: సీపీఎల్/సీహెచ్‌పీఎల్‌లో హోల్డర్స్ అర్హులు. 
-పెయింటర్
-అర్హత: ఎన్సీవీటీ నుంచి పెయింటర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఐందేండ్ల అనుభవం.
-పే స్కేల్: రూ. 16,500/-, మిగతా పోస్టులకు రూ. 23,500/-
-వయస్సు: 2017నవంబర్ 1 నాటికి 30 ఏండ్లు, మిగతా పోస్టులకు 25 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 24

-వెబ్‌సైట్: www. pawanhans.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీయూలో ఎంబీఏ ప్రవేశాలు,

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Hyderabad-University
వివరాలు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ను 1974లో ప్రారంభించారు. 46 డిపార్ట్‌మెంట్లు, 400 మంది ఫ్యాకల్టీ, 5000 మంది విద్యార్థులు ఉన్నారు.
ఎంబీఏ ప్రోగ్రామ్:
-మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
-2018-19 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు
-స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది
-ఇది రెండేండ్ల ఫుల్‌టైం ప్రోగ్రామ్
-స్పెషలైజేషన్స్: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హెచ్‌ఆర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్.
-మొత్తం సీట్ల సంఖ్య - 60
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాంచీలో మూడేండ్ల డిగ్రీ లేదా తత్సమాన కోర్సు. 2018, జూన్‌లోపు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాట్ - 2017 (నవంబర్ 26న జరిగే) పరీక్షకు దరఖాస్తు చేసి, పరీక్షకు హాజరుకావాలి).
-ఎంపిక విధానం: క్యాట్ - 2017 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు 2018, ఫిబ్రవరి/మార్చిలో నిర్వహిస్తారు.
-ప్రవేశాలు మార్చి 2018లో పూర్తిచేస్తారు. తరగతులు 2018 జూలైలో ప్రారంభమవుతాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 350/-, ఓబీసీలకు రూ. 250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.150/-.
-వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఎన్‌బీ పోస్టు డిప్లొమా సెట్
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ), డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ టెస్ ్ట (డీఎన్‌బీ పీడీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) డిసెంబర్ 2017 ద్వారా పోస్టు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
medical-students 
వివరాలు: 
దేశవ్యాప్తంగా వివిధ మెడికల్ కళాశాల్లో పీజీ మెడికల్ (పోస్టు డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ కోర్సు జనవరి 2018లో ప్రారంభం 
అవుతుంది.
-పరీక్ష పేరు: డీఎన్‌బీ పీడీ డిప్లొమా సెట్
-విభాగాలు: అనెస్థీషియాలజీ, డెర్మటాలజీ వినిరియాలజీ అండ్ లెప్రసీ, న్యూక్లియర్ మెడిసిన్, అబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ఒటో రినో లారింజాలజీ, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో డయాగ్నసిస్, రేడియోథెరపీ, ట్యూబర్‌క్యులోసిస్, రెస్పిరేటరీ డిసీజెస్/పల్మనరీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్, పాథాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్.
-కోర్సు వ్యవధి: మూడేండ్లు 
(2018 జనవరి నుంచి ప్రారంభం)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 2017 డిసెంబర్ 31 నాటికి పీజీ డిప్లొమా ట్రెయినింగ్ పూర్తిచేసి ఉండాలి. ఇండియా/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 4500/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గువాహటి, జైపూర్, జమ్ము, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, నోయిడా, పాట్నా, పుణె, తిరువనంతపురంతో సహా మొత్తం 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
-ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు.
-ఈ పరీక్షలో మొత్తం 300 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. 
-ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 27
-ప్రవేశ పరీక్ష తేదీ: డిసెంబర్ 21
-ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు: 2018 జనవరి 21
-వెబ్‌సైట్ :www.nbe.edu.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ), ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) డిసెంబర్ 2017 ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ కోసం )కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన మెడికల్ అభ్యర్థులకు ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎన్‌బీఈ నిర్వహిస్తుంది. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు (జూన్/డిసెంబర్) నిర్వహిస్తారు. 
-పరీక్ష పేరు: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ - డిసెంబర్ 2017 
-అర్హత: ఎంసీఐ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి. 
-అప్లికేషన్ పీజు: రూ. 5500/-
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
-రాతపరీక్షలో 300 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు అరమార్కు చొప్పున 150 మార్కులకు ఉంటుంది.
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. 
-దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా మొత్తం 19 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 27
-ఎగ్జామినేషన్ తేదీ: డిసెంబర్ 21
-ఫలితాలు విడుదల: 2018 జనవరి 21
-వెబ్‌సైట్ :https://nbe.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రామానందతీర్థలో ప్రవేశాలు,

స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్, బెంగళూరులోని మైక్రోమేటిక్ మెషిన్ టూల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ట్రెయినింగ్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
వివరాలు: 
-కోర్సు: సీఎస్‌సీ ఆపరేటర్ ట్రెయినింగ్
-కాలవ్యవధి: 30 రోజులు
-అర్హత: ఇంటర్ / ఐటీఐ/ డిప్లొమా మెకానికల్
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-శిక్షణ అనంతరం ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రారంభవేతనం నెలకు రూ. 8,000/-
-ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి కల్పిస్తారు.
-ఆసక్తిగల అభ్యర్థులు అర్హత సర్టిఫికెట్స్‌తో నవంబర్ 13న సంస్థ కార్యాలయానికి రావాలి. వివరాలకు 9951181416లో సంప్రదించవచ్చు.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రక్షణశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మెన్ మేట్, కుక్, చౌకీదార్ ఉద్యోగాలు,
రక్షణశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మెన్ మేట్, కుక్, చౌకీదార్ తదితర గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

davp 
వివరాలు:
ప్రస్తుత ఖాళీలు 629 Tpt Coy ASC, c/o 56, APOలో ఉన్నాయి.
-పోస్టులు - అర్హతలు:
-మజ్దూర్ - 8
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-చెఫ్ - 2 
-అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు, భారతీయ వంటకాల్లో ప్రావీణ్యత, ట్రేడ్‌లో 
సర్టిఫికెట్ ఉండాలి.
-చౌకీదార్ - 4
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఫైర్‌మ్యాన్ - 2
-అర్హత: పదోతరగతి, అన్నిరకాల అగ్నినివారణ యంత్రాల నిర్వహణ, ఫైర్ ఫైటింగ్ మెథడ్స్‌తోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-ఫైర్ సూపర్‌వైజర్ - 1
-అర్హత: ఇంటర్‌తోపాటు నిర్దేశిత అర్హతలు ఉండాలి. వివరాలు సైట్‌లో చూడవచ్చు.
-టిన్‌స్మిత్ - 1
-అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ప్రావీణ్యత.
-వయస్సు: ఫైర్ సూపర్‌వైజర్ పోస్టులకు 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: పరుగు పందెం, సంబంధిత ట్రేడ్‌లో స్కిల్‌టెస్ట్‌తోపాటు రాతపరీక్ష ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: కనీసం 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 81.5 సెం.మీ. వ్యాకోచించినప్పుడు 85 సెం.మీ., బరువు కనీసం 50 కేజీలు ఉండాలి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ప్రకటన విడుదలైన 21 రోజుల్లో పంపాలి.
-వెబ్‌సైట్: http://www.davp.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో పీజీ  ప్రవేశాలు.
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) 2017-18 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

students 
వివరాలు: 
-పరీక్ష పేరు: మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) 
-ఎంఎఫ్‌ఏ (అప్లయిడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్)-25 సీట్లు
-ఎంఎఫ్‌ఏ (పెయింటింగ్ అండ్ విజువల్ కమ్యూనికేషన్)-15 సీట్లు
-ఎంఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్)-20 సీట్లు
-ఎంఎఫ్‌ఏ (స్కల్‌ప్చర్)-10 సీట్లు
-కోర్సువ్యవధి: రెండేండ్లు
-కోర్సు ఫీజు: రూ. 57,000/-
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎఫ్‌ఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా
-అప్లికేషన్ ఫీజు: The Registrar, JNAFAU, Hyderabad పేరు మీద రూ.1000/-(ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/-) డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా:The Director of Admissions, JNAFAU, Mahaveer Marg, Masab Tank, Hyderabad- 500 028
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 13
-వెబ్‌సైట్: http://jnafau.ac.in


0 comments:

Post a Comment