Wednesday, 22 November 2017

కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌లు ఉద్యోగాలు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ఉద్యోగాలు, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డులో కన్సల్టెంట్లు ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో సైంటిస్టులు, ఎస్సీఆర్‌ఐలో ఉద్యోగాలు, వెటర్నరీ డైరెక్టరేట్‌లో ఉద్యోగాలు.

కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌లు ఉద్యోగాలు,

డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులకు అవకాశం
-గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు
-చాలెంజింగ్ కెరీర్, మంచి జీతభత్యాలు

ఇండియన్ కోస్ట్‌గార్డ్ జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (పైలట్), సీపీల్ (ఎస్‌ఎస్‌ఏ) విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indian-coast-guard-ship
వివరాలు:
భారత తీర ప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్ పాత్ర కీలకమైంది. కోస్ట్‌గార్డ్‌లో గ్రూప్ ఏ కేటగిరీలో గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. వీటిని జీడీ, జీడీ (పైలట్) అండ్ సీపీఎల్ (ఎస్‌ఎస్‌ఏ)-2/2018 బ్యాచ్ కింద వీటిని భర్తీచేస్తారు. దీనిలో పనిచేసే ఉద్యోగులకు మంచి వేతనాలు, ప్రత్యేక అలవెన్స్‌లతోపాటు ఇతర సౌకర్యాలు ఉంటాయి.
-పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
బ్రాంచీల వారీగా అర్హతలు:
-జనరల్ డ్యూటీ/జనరల్ డ్యూటీ (పైలట్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (సాధారణ డిగ్రీ లేదా బీఈ/బీటెక్). ఇంటర్ స్థాయిలో లేదా 10+2+3 స్కీంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: జనరల్ డ్యూటీ అభ్యర్థులు-
1993, జూలై 1 నుంచి 1997, జూన్ 30 మధ్యలో జన్మించి ఉండాలి. జనరల్ డ్యూటీ పైలట్ అభ్యర్థులు- 1993, జూలై 1 నుంచి 1999, జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-పైలట్ (సీపీఎల్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగి ఉండాలి.
-వయస్సు: 1993, జూలై 1 నుంచి 1999, జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక:
-దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రెండు దశల్లో (స్టేజ్1, స్టేజ్2) ఎంపిక ఉంటుంది.
స్టేజ్ - 1:
-ప్రిలిమినరీ సెలక్షన్ ఎగ్జామినేషన్:
-మెంటల్ ఎబిలిటీ టెస్ట్/ కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రిక్చర్ ప్రిస్క్రిప్షన్, డిస్కషన్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
స్టేజ్- 2:
-ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారిని స్టేజ్- 2 (ఫైనల్ సెలక్షన్)కు ఎంపిక చేస్తారు.
-దీనిలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్,
ఇంటర్వ్యూలు ఉంటాయి.
-ఈ దశలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-జీడీ పైలట్ పోస్టులకు సీపీఎస్‌ఎస్ టెస్ట్‌ను డెహ్రాడూన్/మైసూర్‌లో నిర్వహిస్తారు.
శారీరక ప్రమాణాలు:
-జనరల్ డ్యూటీ: 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-అసిస్టెంట్ కమాండెంట్ పైలట్/సీపీఎల్ - కనీసం ఎత్తు 162.5 సెం.మీ., కాలి పొడవు కనీసం 99 సెం.మీ. ఉండాలి.
జీతభత్యాలు:
-ప్రారంభంలో నెలకు రూ. 56,100/- వరకు జీతం వస్తుంది.
-అసిస్టెంట్ కమాండెంట్ నుంచి డైరెక్టర్ జనరల్ స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ-ఎజిమల (కేరళ)లో జూన్ 2018 నుంచి ట్రెయినింగ్ ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
పరీక్ష తేదీ, సమయం, ప్రదేశం తదితర విషలయాలన్నింటిని ఈ-మెయిల్ ఐడీ ద్వారానే
తెలియజేస్తారు.
-చివరితేదీ: డిసెంబర్ 2
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు,

డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డీఐపీ/జీఐఎస్, ఎంఐఎస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసోసియేట్ (కాంట్రాక్టు పద్ధతిన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Technical-Professionals
వివరాలు:
ఈ పోస్టులు డెహ్రాడూన్‌తోపాటు జోనల్/రీజినల్ ఆఫీస్ కార్యాలయంలో భర్తీచేస్తారు.
-పోస్టు పేరు: టెక్నికల్ అసోసియేట్
-మొత్తం పోస్టులు: 19
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ (సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, అప్లయిడ్ సైన్స్), ఎంఏ (జాగ్రఫీ), ఈర్‌ఎస్ అండ్ జీఐఎస్‌లో డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణత. డీఐపీ/జీఐఎస్‌లో
పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు : 2017 డిసెంబర్ 8 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000+హెచ్‌ఆర్‌ఏ
-ఎంపిక : రాతపరీక్ష
-దరఖాస్తు : ఆఫ్‌లైన్. దరఖాస్తులను పూర్తిగా నింపి సంబంధిత అటెస్టెడ్ సర్టిఫికెట్లను జతపరిచి,రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
-దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.fsi.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ఉద్యోగాలు,

షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
neigrihms-mbbs
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 29
-ఎస్టేట్ మేనేజర్-1, జూనియర్ పర్‌ఫ్యూషనిస్ట్ -2, హెల్త్ ఇన్‌స్పెక్టర్- 3, హెల్త్ ఎడ్యుకేటర్-2, వార్డెన్/లేడీవార్డెన్- 1, శానిటరీ ఇన్‌స్పెక్టర్- 4, హౌస్ కీపర్- 7, లోయర్ డివిజన్ క్లర్క్- 9
-అర్హత : సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. వివరాలకు నవంబర్ 11-17 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.
-వెబ్‌సైట్ : www.neigrihms.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డులో కన్సల్టెంట్లు ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు(టీడీబీ) ఖాళీగా ఉన్న కన్సల్టెంట్, అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TDB
వివరాలు:
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో
పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థ.
-అసిస్టెంట్ లా ఆఫీసర్-2 ఖాళీలు
-అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీలో ఉత్తీర్ణత.కార్పొరేట్/కంపెనీ లా, లిటిగేషన్‌లో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 70,000/-
-కన్సల్టెంట్-3 ఖాళీలు
-అర్హత: రిటైర్డ్ బ్యాంకర్స్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ అండ్ రికవరీ రంగంలో 15 ఏండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 60,000 నుంచి
రూ. 70,000/- వరకు
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.tdb.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో సైంటిస్టులు,
ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) రిక్రూట్‌మెంట్ అండ్ అస్సెస్‌మెంట్ (ఆర్‌ఏసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
rac-drdo
వివరాలు
-పోస్టు పేరు: సైంటిస్ట్
-మెరైన్/మెకానికల్ ఇంజినీరింగ్- 3
-అర్హత: ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో మెరైన్ లేదా మెకానికల్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 2
-అర్హత: ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్‌లో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్: https://rac.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్సీఆర్‌ఐలో ఉద్యోగాలు,
చెన్నైలోని సిద్ధ సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్సీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Central-Counc-for-Research
వివరాలు:
-రిసెర్చ్ అసోసియేట్ (సిద్ధ)- 1, సీనియర్ రిసెర్చ్‌ఫెలో- 1, తమిళ్ స్కాలర్- 1, డీఈఓ- 1, సిద్ధ ఫార్మసిస్ట్- 2, ఫీల్డ్ అసిస్టెంట్- 1
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ,
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 7.
-సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
-వెబ్‌సైట్: http://crisiddha.tn.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వెటర్నరీ డైరెక్టరేట్‌లో ఉద్యోగాలు.

హైదారాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (కాంట్రాక్ట్ పద్ధతిలో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
vetenery-assistanat
వివరాలు:
-పోస్టు పేరు: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
-ఈ ఖాళీలను జిల్లాలవారీగా భర్తీ చేయనున్నారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 73
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కేంద్ర/స్టేట్ వెటర్నరీ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
-ఈ పోస్టులను 12 నెలలకు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తారు.
-వయస్సు: 2016 జూలై 1 నాటికి 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 35,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా: Director of Veterinary and Animal Husbandary,
-Shanthingar, Telangana,
-Hyderabad-500028
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 23
-వెబ్‌సైట్: http://tgahd.nic.in

0 comments:

Post a Comment