Tuesday, 7 November 2017

ఎన్‌ఐఈలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రవేశాలు, ఇండియన్ నేవల్ అకాడమీ ఉద్యోగాలు, సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్టులు, ఆర్మీలో టెక్ని కల్ గ్రాడ్యుయేట్స్ కోర్సు, ఎన్‌సీఆర్‌ఐ ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, జోధ్‌పూర్ ఐఐటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

ఎన్‌ఐఈలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రవేశాలు,

తమిళనాడు (చెన్నై)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ) 2018-19 అకడమిక్ ఇయర్‌కు ఫుల్‌టైమ్ రెండేండ్ల మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIE
వివరాలు:
ఈ కోర్సును ఐసీఎంఆర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
- కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
- కోర్సు వ్యవధి: రెండేండ్లు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత. రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ ప్రజా ఆరోగ్య శాఖలో మూడేండ్లపాటు పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- వయస్సు: 2018 జూలై 1 నాటికి 45 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: రూ. 600/-
(డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)
- కోర్సు ఫీజు: రూ. 1,00,000/-
- ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
- ఈ కోర్సులో ప్రవేశం పొందిన అభ్యర్థులు రెండేండ్లపాటు ప్రైవేట్‌గా/కాంట్రాక్ట్ విధానంలో ఎక్కడా పనిచేయరాదు. ఒకవేళ పనిచేస్తే అడ్మిషన్‌ను రద్దుచేస్తారు.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
- చివరితేదీ: డిసెంబర్ 31
- వెబ్‌సైట్: www.nie.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ నేవల్ అకాడమీ ఉద్యోగాలు,
ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
INDIAN-NAVAL-ACADEMY 
వివరాలు:
ఇండియన్ నేవీ పరిధిలోని ప్రభుత్వ సంస్థ నేవల్ అకాడమీ. ఇక్కడ నావికాదళానికి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణనిస్తారు.
- పోస్టులు: ఫ్యాకల్టీ
- విభాగాలు: మ్యాథమెటిక్స్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఇంగ్లిష్, హిస్టరీ (మారిటైం అండ్ మిలిటరీ), ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్, అరబిక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కంట్రోల్ ఇంజినీరింగ్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్.
- దరఖాస్తు: 04985-224169 నంబర్‌కు ఫ్యాక్స్ చేయాలి లేదా depregistrarcoord @gmail.comకు ఈ మెయిల్ చేయాలి. దీంతోపాటు కింది చిరునామాకు దరఖాస్తులను 10 రోజుల్లోగా చేరేలా పంపాలి. 
The Principal,Indian Naval Academy,
Ezhimala, Naval Academy PO,

Kannur Dt,Pincode: 670310----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్టులు,
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CENTRAL-UNIVERSITY
వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 23
- విభాగాలవారీగా ఖాళీలు: లైబ్రేరియన్-1, డిప్యూటీ రిజిస్ట్రార్-1, డిప్యూటీ లైబ్రేరియన్-1, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్-1, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్-1, అసిస్టెంట్ ఇంజినీర్-1, నర్స్-1, అసిస్టెంట్-4, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-1, జూనియర్/సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్-1, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్-1, లోయర్ డివిజన్ క్లర్క్-5, హిందీ టైపిస్ట్-1, ల్యాబొరేటరీ అటెండెంట్-1, లైబ్రెరి అటెండెంట్-1, ఎంటీఎస్-1
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష, బీఈ/బీటెక్, బీఎస్సీ నర్సింగ్/డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ, బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రెరీ సైన్స్‌లో డిగ్రీ, మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి.
వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ,
పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
- ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 16
- వెబ్‌సైట్: www.cusb.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో టెక్ని కల్ గ్రాడ్యుయేట్స్ కోర్సు,

ఇండియన్ ఆర్మీ 127వ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సు ద్వారా పర్మినెంట్ కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IndianArmy
- బీఈ/బీటెక్ విద్యార్థులకు అవకాశం
- రెండు దశల్లో ఎంపిక
- మంచి జీతభత్యాలు, ప్రత్యేక అలవెన్స్‌లు
వివరాలు:
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో 2018, జూలై నుంచి ప్రారంభమయ్యే 127వ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- పోస్టు: పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్
- మొత్తం ఖాళీల సంఖ్య - 40.
విభాగాల వారీగా ఖాళీలు..
- సివిల్ - 10, ఆర్కిటెక్చర్ - 1, మెకానికల్ - 4, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ - 5, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ - 6, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా శాటిలైట్ కమ్యూనికేషన్ - 7, ఎలక్ట్రానిక్స్ - 2, మెటలర్జికల్ - 2, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ - 2, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ - 1 ఖాళీ ఉన్నాయి.
- పేస్కేల్: రూ. 56,100 -1,77,500/-
- వయస్సు: 2018, జూలై 1 నాటికి 20 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1991, జూలై 2 నుంచి 1998, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ పూర్తిచేసినవారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫైనల్ ఇయర్ పాసైన పత్రాలను 2018, జూలై 1 నాటికి సమర్పించాల్సి ఉంటుంది.
- కమిషన్ రకాలు: గ్రాంట్ కమిషన్, పర్మినెంట్ కమిషన్, యాంటీ డేట్ సీనియారిటీ.
- శిక్షణ: ఐఎంఏలో ఏడాదిపాటు శిక్షణనిస్తారు. శిక్షణ ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఏదైనా కారణాలతో అభ్యర్థులు శిక్షణ నుంచి విరమించుకొంటే నెలకు రూ. 9,488/- చొప్పున ఐఎంఏకు చెల్లించాల్సి ఉంటుంది.
- పదోన్నతులు : లెఫ్టినెంట్ (లెవల్ 10) నుంచి కెప్టెన్ - మేజర్ -లెఫ్టినెంట్ కల్నల్ - కల్నల్ (టీఎస్) - బ్రిగేడియర్ - మేజర్ జనరల్ -లెఫ్టినెంట్ జనరల్ - వాకోస్ - వీసీవోఏఎస్ - సీవోఏఎస్ (లెవల్ 18) స్థాయి వరకు పదోన్నతి పొందవచ్చు.
ఎంపిక విధానం:
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రక్షణ మంత్రిత్వశాఖ ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్‌లో షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంజినీరింగ్ విభాగాల ప్రకారం అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు అలహాబాద్, బెంగళూరు. కపుర్తులాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనిలో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఆఫీసర్లు పాల్గొంటారు. రెండు దశల్లో ఎంపిక జరుగుతుంది. స్టేజ్ -1లో క్వాలిఫై అయినవారిని స్టేజ్ - 2కు ఎంపికచేస్తారు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఐదురోజులపాటు నిర్వహిస్తారు.
శారీరక ప్రమాణాలు:
- కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
- 15 నిమిషాల్లో 2.4 కి.మీ. దూరం పరుగెత్తాలి. 13 పుష్‌అప్‌లు, 25 సిటప్‌లు, 6 చిన్‌అప్‌లు, 3-4 రోప్ ైక్లెంబింగ్ చేయాలి.
- పై అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 22
- వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఆర్‌ఐ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎన్‌సీఆర్‌ఐ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ncri 
వివరాలు:
ఎన్‌సీఆర్‌ఐ అనేది కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ.
- పోస్టులు: న్యూస్‌లెటర్ ఎడిటింగ్ అండ్ వెబ్ కంటెంట్ రైటింగ్, రూరల్ కోర్సెస్ అండ్ రూరల్ కంటెంట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్, ట్రాన్స్‌లేషన్ (హిందీ టూ ఇంగ్లిష్ వైస్ వర్సా), రూరల్ ఓరియంటెడ్ కరికులం డిజైన్ తదితర పోస్టులు ఉన్నాయి.
- అర్హతలు, వయస్సు, జీతభత్యాలు, ఎంపిక కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- చివరితేదీ: నవంబర్ 10

- వెబ్‌సైట్: www.ncri.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో-సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (సీఏఎస్)లో ఖాళీగా ఉన జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
drdo 
వివరాలు:
సీఏఎస్ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది. 
- పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్-2 పోస్టులు 
- అర్హత: మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్, గేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు
- పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 24

- వెబ్‌సైట్: www.drdo.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జోధ్‌పూర్ ఐఐటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
IIT_Jodhpur
వివరాలు:
- 2017- 18 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు.
- ప్రోగ్రామ్: పీహెచ్‌డీ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 8
- విభాగాలు: బయోసైన్స్ అండ్ బయో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మెకానికల్, మెటీరియల్ ఇంజినీరింగ్.
- వెబ్‌సైట్: www.iitj.ac.in

0 comments:

Post a Comment