Thursday, 16 November 2017

ఎయిమ్స్‌లో 927 స్టాఫ్ నర్సులు, బీఎస్‌ఎఫ్‌లో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఎల్‌ఎస్‌టీసీలో ఉద్యోగాలు, సీపీసీఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు , సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, సీపీసీఆర్‌ఐలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇండియన్ ఆర్మీలో ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ ఉద్యోగాలు.

ఎయిమ్స్‌లో 927 స్టాఫ్ నర్సులు,
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో నర్సింగ్ స్టాఫ్ (గ్రూప్ బీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
AIIMS
వివరాలు:
ఎయిమ్స్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక స్వంతంత్ర సంస్థ. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది.
హాస్పిటల్ (నర్స్) విభాగంలో..
-సీనియర్ నర్సింగ్ ఆఫీసర్/ గ్రేడ్ - 1 స్టాఫ్ నర్స్
-మొత్తం ఖాళీల సంఖ్య - 127. (జనరల్-65, ఓబీసీ-34, ఎస్సీ-19, ఎస్టీ-9)
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,800/-
-వయస్సు: 21 -35 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు : నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్) లేదా తత్సమాన కోర్సు అంటే బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) ఉత్తీర్ణత. రాష్ట్ర/దేశ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
-అనుభవం: బీఎస్సీ నర్సింగ్ తర్వాత 200 పడకల హాస్పిటల్/హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రేడ్-2 స్టాఫ్ నర్స్‌గా రెండేండ్ల అనుభవం ఉండాలి.
-గ్రేడ్ - 2 నర్సింగ్ ఆఫీసర్/ స్టాఫ్ నర్స్
-మొత్తం ఖాళీల సంఖ్య - 800. (జనరల్-404, ఓబీసీ-216, ఎస్సీ-120, ఎస్టీ-60)
-వయస్సు: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
-అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత. నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ, నర్సింగ్ కౌన్సిల్‌లో రిజస్టర్ అయి ఉండాలి. కనీసం 50 పడకల హాస్పిటల్‌లో కనీసం రెండేండ్లకు తగ్గకుండా అనుభవం ఉండాలి.
నోట్: మే 5న ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకొన్నవారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్) మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)/ ఆఫ్‌లైన్ ఎగ్జామ్ ద్వారా
-సీబీటీలో అర్హత సాధించినవారికి స్కిల్‌టెస్ట్/ప్రొఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, లక్నో, జైపూర్, న్యూఢిల్లీ, గువాహటి, కటక్, కోల్‌కతా.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2017, డిసెంబర్ 25
-వెబ్‌సైట్: http://www.aiimbhubaneswar.edu.in.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------బీఎస్‌ఎఫ్‌లో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు,

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్‌ఎఫ్ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ పద్ధతిలో) అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BSF
వివరాలు:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశ ఐదు సాయుధ పోలీస్ దళాల్లో ఒకటి. దీన్ని 1965, డిసెంబర్ 1న ఏర్పాటు చేశారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 109
-స్పెషలిస్ట్ డాక్టర్-27 ఖాళీలు
-విభాగాలు: పాథాలజీ, మెడిసిన్, సర్జరీ, ఓ అండ్ జీ, ఆర్థోపెడిక్, రేడియాలజిస్ట్, సైకియాట్రీ, పీడియాట్రిక్, అనెస్థీషియాలజీ, ఆప్తాల్మాలజీ
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా. డిగ్రీ అభ్యర్థులు 18 నెలలు, పీజీ డిప్లొమా అభ్యర్థులు 30 నెలలపాటు ఏదైనా హాస్పిటల్‌లో స్పెషలిస్ట్ డాక్టర్‌గా పనిచేసి ఉండాలి.
-జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్-82 ఖాళీలు
-అర్హత: ఎంబీబీఎస్. ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు
-వెబ్‌సైట్: http://bsf.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఎల్‌ఎస్‌టీసీలో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఎల్‌ఎస్‌టీసీ) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DRDO-LESTC
వివరాలు: ఎల్‌ఎస్‌టీసీ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్
డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో
పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీల సంఖ్య: 9
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్ (ఫిజిక్స్-6, ఎలక్ట్రానిక్స్-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత. నెట్/గేట్‌లో అర్హతను సాధించాలి.
-వయస్సు: 2017 నవంబర్ 28 నాటికి 28 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌లు ఉంటాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 22, 23
-వెబ్‌సైట్: www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------సీపీసీఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు ,
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CPCL
వివరాలు:
సీపీసీఎల్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య - 108
విభాగాల వారీగా ఖాళీలు..
-ఎలక్ట్రీషియన్-10, ఫిట్టర్-16, మెకానిక్ మోటార్ వెహికిల్ (ఎంఎంవీ)-10, మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం)-8, వెల్డర్-8, మెషినిస్ట్-5, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-5, టర్నర్-4, ఆటో ఎలక్ట్రీషియన్-2, మెకానిక్ (రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికిల్స్)-2, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్-2, మెకానిక్-2), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)-5, పాసా-2, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (సీపీ)-5, అటెండెంట్ ఆపరేటర్ (సీపీ)-2, అడ్వాన్స్‌డ్ అటెండెంట్ ఆపరేటర్ (ప్రాసెస్)-15
-అర్హత: పదోతరగతిపాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కోపా ట్రేడ్‌కు సైన్స్/కామర్స్‌తో ఇంటర్ లేదా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. అసిస్టెంట్/అటెండర్ ట్రేడ్‌కు బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత. మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టులు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి 18 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-శిక్షణా కాలం: 12 నెలలు, అడ్వాన్స్‌డ్ అటెండెంట్ ఆపరేటర్ ట్రేడ్‌కు 18 నెలలు
-స్టయిఫండ్: శిక్షణ పీరియడ్‌లో
రూ. 8625/- కన్సాలిడేటెడ్ పే చెల్లిస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.cpcl.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు,

చైన్నైలోని సదరన్ రైల్వే పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వివిధ విభాగాల్లో ( స్పోర్ట్స్ కోటా) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
SOUTHERN-RAIILWAY 
వివరాలు:స్పోర్ట్స్ కోటా పోస్టులు: 5
-విభాగాలు: అథ్లెటిక్స్ (పురుషులు)-1, అథ్లెటిక్స్ (మహిళలు)-1, చెస్ (పురుషులు)-1, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ (పురుషులు)-1, టేబుల్ టెన్నిస్ (పురుషులు)-1. 
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
-దరఖాస్తు ఫీజు: రూ. 500 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ, మహిళలకు ఫీజు లేదు)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: The Assistant Personnel Officer/Recruitment,
Railway Recruitment Cell, Southern Railway
3rd Floor, No.5, Dr. P.V. CHERIAN CRESENT Road,
Egmore, Chennai - 600 008
-చివరితేదీ: డిసెంబర్ 11

-వెబ్‌సైట్: www.rrcmas.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------సీపీసీఆర్‌ఐలో ఫీల్డ్ అసిస్టెంట్లు,
కేరళ (కాసర్‌గఢ్)లోని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CPCRI
వివరాలు:
సీపీసీఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఎఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 3
-రిసెర్చ్ ఫెలో-1
-పే స్కేల్: రూ. 15,000/-
-ఫీల్డ్ అసిస్టెంట్-2
-పే స్కేల్: రూ. 12,000/-
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో సంబంధిత అధికారి వద్ద ఇంటర్వ్యూ తేదీన హాజరు కావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 27,28
-వెబ్‌సైట్:www.cpcri.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఇండియన్ ఆర్మీలో ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ ఉద్యోగాలు.

ఇండియన్ ఆర్మీ (ఐఆర్) ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Army 
వివరాలు: 
ఈ పోస్టులను సివోక్ సిలిగురిలో భర్తీచేస్తారు. 
-పోస్టు పేరు: ట్రేడ్స్‌మ్యాన్‌మేట్
-మొత్తం పోస్టుల సంఖ్య: 25 (జనరల్-13, ఓబీసీ-5, ఎస్సీ-7)
-అర్హత: మెట్రిక్యులేషన్‌తోపాటు ఆర్మీ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-పే స్కేల్: రూ. 18,000/-
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. వివరాలకు నవంబర్ 11-17న వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడగలరు.

-వెబ్‌సైట్: www.indianarmy.nic.in

0 comments:

Post a Comment