Monday, 27 November 2017

ఎయిమ్స్‌లో 927 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐటీ మేనే జర్లు, ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్లు, ఎన్‌ఈఈఆర్‌ఐలో ఉద్యోగాలు, చీనాబ్‌వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్‌లో ఇంజినీర్లు, దక్షిణ మధ్య రైల్వేలో 21 ఖాళీలు, సీఐఆర్‌బీలో యంగ్ ప్రొఫెషనల్స్, కృషి విజ్ఞాన్ కేంద్రలో కొలువులు.

ఎయిమ్స్‌లో 927 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు,
నర్సింగ్‌లో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు
-ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక
-డిసెంబర్ 25 గడువు

nicl 
భువనేశ్వర్‌లోని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ &ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) గ్రూప్ బీ స్థాయిలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్/
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఎయిమ్స్ భువనేశ్వర్ అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి. ఎయిమ్స్ భువనేశ్వర్‌ను ప్రాంతీయ అసమానతలను సరిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకంలో భాగంగా 2012లో స్థాపించారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 927 పోస్టులు
-పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్/స్టాఫ్ నర్స్ (గ్రేడ్ 1)
-ఖాళీల సంఖ్య-127 పోస్టులు (జనరల్-65, ఓబీసీ-34, ఎస్సీ-19, ఎస్టీ-9)
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్), బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్)లో ఉత్తీర్ణత. నర్స్ అండ్ మిడ్‌వైఫరీలో సెంట్రల్/స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. 200 పడకల హాస్పిటల్/హెల్త్‌కేర్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా మూడేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4800/-
-పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్/స్టాఫ్ నర్స్ (గ్రేడ్ 2)
-ఖాళీల సంఖ్య-800 పోస్టులు (జనరల్-404, ఓబీసీ-216, ఎస్సీ-120, ఎస్టీ-60)
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్)/పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమాలో ఉత్తీర్ణత. నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ స్టేట్/సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. 50 పడకల హాస్పిటల్/హెల్త్‌కేర్ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా మూడేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,600/- 
-వయస్సు: 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి ( గ్రేడ్ 1 నర్స్ పోస్టులకు 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/రాతపరీక్ష
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 1000/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతోపాటు, వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. నిర్ణీత ఫార్మాట్‌లోనే ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-పరీక్ష కేంద్రాలు: భువనేశ్వర్, కటక్, కోల్‌కతా, గువాహటి, న్యూఢిల్లీ, జైపూర్, లక్నో, చెన్నై, బెంగళూరు
-అర్హతగల అభ్యర్థులకు రాతపరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయానికి సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు. 
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 25
-వెబ్‌సైట్: www.aiimsbhubaneshwar.edu.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐటీ మేనే జర్లు,
న్యూఢిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐటీ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల (కాంట్రాక్ట్ పద్ధతిలో) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
FSSAI
వివరాలు:
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్యర్యంలో
పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీల సంఖ్య: 14
-డిప్యూటీ/అసిస్టెంట్ మేనేజర్ (డాటాబేస్)-2
-అర్హత: మాస్టర్ డిగ్రీ/బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో లేదా డాటా ప్రోగ్రామింగ్/ఇన్ఫర్మేషన్ సైన్స్ అనుభవం ఉండాలి.
-డిప్యూటీ/అసిస్టెంట్ మేనేజర్ (జావా/జే2ఈఈ)-12
-అర్హత: మాస్టర్ డిగ్రీ/బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగం (జావా/జే2ఈఈ, జేఎస్‌పీ)లో లేదా డిజైన్, డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.fssai.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్లు,

జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AIIMS
-సీనియర్ రెసిడెంట్స్-124 ఖాళీలు
-పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 6,600/-
-అర్హతలు: ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ లేదా హ్యూమన్ అనాటమీ)/ఎంఎస్ లేదా ఎండీ/ఎండీఎస్, డీఎన్‌బీ/డీఎం. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: 2017, డిసెంబర్ 22 నాటికి 33-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పనిచేయాల్సిన ప్రదేశం: జోధ్‌పూర్
-ఎంపిక: రాతపరీక్ష, అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ
-అప్లికేషన్ ఫీజు: రూ. 1,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 22
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఈఈఆర్‌ఐలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Csir-Neeri
-మొత్తం పోస్టుల సంఖ్య: 3
-అర్హత:బీఎస్సీ (కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బయాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ)లో ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.15,000+హెచ్‌ఆర్‌ఏ
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 29
-వెబ్‌సైట్ : www.neeri.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
చీనాబ్‌వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్‌లో ఇంజినీర్లు,

చీనాబ్‌వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (సీవీపీపీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ/జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cvpp
వివరాలు:
సీవీపీపీ ఎన్‌హెచ్‌పీసీ, జేకేఎస్‌పీడీసీల జాయింట్ వెంచర్ సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 91
-ట్రెయినీ ఇంజినీర్-47 పోస్టులు
-అర్హత: సంబంధిత బ్రాంచిలో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో లేదా ప్రథమ శ్రేణిలో ఎంసీఏ ఉత్తీర్ణత.
-ట్రెయినీ ఆఫీసర్- 11 పోస్టులు
-అర్హత: డిగ్రీతోపాటు సీఏ, హెచ్‌ఆర్‌ఎం, పర్సనల్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్‌ఎం అండ్ లేబర్ రిలేషన్స్/ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో పీజీ/పీజీ డిప్లొమా లేదా ఎంబీఏ (హెచ్‌ఆర్), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంటెక్/ఎమ్మెస్సీ (జియాలజీ), బ్యాచిలర్ ఆఫ్ లా లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-జూనియర్ ఇంజినీర్-33 పోస్టులు
-అర్హత: సంబంధిత బ్రాంచిలో బీఈ/బీటెక్, డిప్లొమా (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ )లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేది: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.cvppindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
దక్షిణ మధ్య రైల్వేలో 21 ఖాళీలు,
సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
scr-train
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 21
విభాగాల వారీగా ఖాళీలు:
-అథ్లెటిక్స్-7, బ్యాడ్మింటన్ -1, బాస్కెట్‌బాల్ -2, బాక్సింగ్-1, హ్యాండ్‌బాల్ -2, ఖోఖో -1, టెన్నిస్-1, వాలీబాల్ -3, వెయిట్‌లిఫ్టింగ్ -2, హాకీ -1
-అర్హత: పదోతరగతి/ఇంటర్ లేదా ఐటీఐలో ఉత్తీర్ణత. వరల్డ్‌కప్ (జూనియర్/సీనియర్), వరల్డ్ చాంపియన్స్ (జూనియర్/సీనియర్), ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, వరల్డ్ రైల్వేలు, నేషనల్ గేమ్స్‌లలో పాల్గొని ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2000/1900/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఈబీసీ, మహిళాలకు రూ. 250/-
-ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 27
-వెబ్‌సైట్: www.scr.indianrailways.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఆర్‌బీలో యంగ్ ప్రొఫెషనల్స్,
హర్యానా (హిస్సార్)లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ బఫెలోస్ (సీఐఆర్‌బీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ (గ్రేడ్1, గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
CIRB
-మొత్తం ఖాళీలు: 8 పోస్టులు
-పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంవీఎస్సీ/ఎమ్మెస్సీ, బీఎస్సీ (సైన్స్,అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్, వెటర్నరీ సైన్స్, లైఫ్ సైన్సెస్)లో ఉత్తీర్ణత.
-వయస్సు: 21 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 28
-వెబ్‌సైట్: www.cirb.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కృషి విజ్ఞాన్ కేంద్రలో కొలువులు.
మెదక్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రలో కింది ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
కృషి విజ్ఞాన్ కేంద్ర అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్
అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఎఆర్) పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 11
-సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్-1, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ (ఆగ్రానమీ-1, అగ్రికల్చర్ ఇంజినీరింగ్-1, ప్లాంట్ ప్రొటెక్షన్-1, వెటర్నరీ సైన్స్-1), ప్రోగ్రామ్ అసిస్టెంట్ (హోమ్ సైన్స్-1, ఫామ్ మేనేజర్-1, కంప్యూటర్-1), అసిస్టెంట్ (ఆఫీస్)-1
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ, ఎమ్మెస్సీ (హోమ్ సైన్స్), బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-పే స్కేల్: 9300-34800 + గ్రేడ్ పే రూ. 4200/- (పోస్టులను బట్టి వేర్వేరుగా పేస్కేలు ఉన్నాయి)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 10
-వెబ్‌సైట్: www.kvkmedak.org

0 comments:

Post a Comment