Monday, 27 November 2017

ఈస్టర్న్ రైల్వేలో 863 ఉద్యోగాలు, బీహెచ్‌ఈఎల్‌లో 229 అప్రెంటిస్‌లు, ఐడబ్ల్యూఏఐ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్‌లో ఉద్యోగాలు, బిమ్‌టెక్‌లో ప్రవేశాలు, ఎఐఎంఏ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉద్యోగాలు, ఎన్‌సీడీఐఆర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు.

ఈస్టర్న్ రైల్వేలో 863 ఉద్యోగాలు,

పదోతరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత
-అకడమిక్ మార్కుల ద్వారా ఎంపిక
-రైల్వే నిబంధనల ప్రకారం స్టయిఫండ్

వెస్ట్‌బెంగాల్ (కోల్‌కతా)లోని ఈస్టర్న్ రైల్వే డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
KolkataLocalTrain 
వివరాలు: ఈస్టర్న్ రైల్వే 1961 అండ్ 1962 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని హౌరా /లిలువా వర్క్‌షాప్‌లలో శిక్షణ ఇస్తారు. 
-మొత్తం ఖాళీల సంఖ్య - 863
-లిలువా వర్క్ షాప్-204 ఖాళీలు
-ట్రేడ్‌ల వారీగా ఖాళీలు.. ఫిట్టర్-80, మెషినిస్ట్-23, టర్నర్-11, వెల్డర్ (జీ అండ్ ఈ)-50, పెయింటర్ జనరల్-5, ఎలక్ట్రీషియన్-15, వైర్‌మెన్-15, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్-5
-హౌరా - 659 ఖాళీలు 
-ట్రేడ్‌ల వారీగా ఖాళీలు.. ఫిట్టర్-281, మెకానికల్ (ఎంవీ)-9, మెకానికల్ (డీజిల్)-17, బ్లాక్ స్మిత్-9, మెషినిస్ట్-23, వెల్డర్-61, పెయింటర్ జనరల్-9, కార్పెంటర్-9, లైన్‌మెన్ జనరల్-9, వైర్‌మెన్-9, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్-8, ఎలక్ట్రీషియన్-220, మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటెనెన్స్-9
-వయస్సు: 2017, జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
-ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50) ఎంపికచేస్తారు.
-శారీరక ప్రమాణాలు: 1961 అప్రెంటిస్ యాక్ట్, 1962 యాక్ట్ ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు కలిగి ఉండాలి.
-స్టయిఫండ్: ఈస్టర్న్ రైల్వే అప్రెంటిషిప్ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా స్టయిఫండ్ చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలి.
-చిరునామా: Workshop Personal Officer, Eastern Railway, 
Liluah, Howrah-711204
-చివరితేదీ: డిసెంబర్ 7

-వెబ్‌సైట్: www.er.indianrailways.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో 229 అప్రెంటిస్‌లు,
భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BHEL
వివరాలు: దేశంలో అతిపెద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ను 1964లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మహారత్న హోదా కలిగి ఉంది.
-వివరాలు: అప్రెంటిస్ 1973 అండ్ 1986 యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 229 (గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-138, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్-91)
-విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-138 ఖాళీలు
-అర్హత: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ 70 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 60 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
-టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్-91 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-గమనిక: డిస్టెన్స్, కరస్పాండెన్స్ విధానంలో డిగ్రీ/డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ చేయడానికి అర్హులు కారు.
-వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి కనిష్ఠంగా 14 ఏండ్లు, గరిష్ఠంగా 25 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ. 6000/-, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్ రూ.4000/- శిక్షణలో భాగంగా ప్రతి నెల
చెల్లిస్తారు.
-ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
-ఎంపిక: అకడమిక్ మార్కులు ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: డిసెంబర్ 10
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి
చివరితేదీ: డిసెంబర్ 17
-వెబ్‌సైట్: www.bhelbpl.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐడబ్ల్యూఏఐ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్‌లో ఉద్యోగాలు,

నోయిడాలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
iwai 
వివరాలు: ఐడబ్ల్యూఏఐ అనేది మినీస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పరిధిలో పనిచేస్తున్న శాసనబద్ద సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 42
-ఇన్‌ల్యాండ్ డ్రెడ్జ్ మాస్టర్-4 పోస్టులు
-లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్-2 పోస్టులు
-డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్-6 పోస్టులు, 
-మాస్టర్ సెకండ్ క్లాస్-9 పోస్టులు, 
-డ్రైవర్ ఫస్ట్ క్లాస్-18 పోస్టులు,
-డ్రైవర్ సెకండ్ క్లాస్-3 పోస్టులు 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి డ్రెడ్జ్ మాస్టర్, లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, మాస్టర్ సెకండ్ క్లాస్, డ్రైవర్ ఫస్ట్ క్లాస్, డ్రైవర్ సెకండ్ క్లాస్‌లో అర్హత లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. స్విమ్మింగ్‌లో నైఫుణ్యం ఉండాలి.
-వయస్సు 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ట్రేడ్ టెస్ట్, స్విమ్మింగ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి సంబంధిత అధికారికి పంపాలి.
-చిరునామా: Assistant Secretary (SRC), Inland Waterways Authority of India, A-13, Sector-1, Noida - 201301 (U.P.)
-చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.iwai.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిమ్‌టెక్‌లో ప్రవేశాలు,

నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (బిమ్‌టెక్) 2018-20 అకడమిక్ ఇయర్‌కు వివిధ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం), డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
birla
వివరాలు: బిమ్‌టెక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెచ్‌ఆర్‌డీ పరిధిలో నడుస్తున్న సంస్థ.
-కోర్స్ పేరు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
విభాగాలు:
-పీజీడీఎం (ఎంబీఏకు సమానం)-240 సీట్లు
-పీజీడీఎం-ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్-60 సీట్లు
-పీజీడీఎం-ఇంటర్నేషనల్ బిజినెస్-60 సీట్లు
-పీజీడీఎం-రిటైల్ మేనేజ్‌మెంట్-60 సీట్లు
-ప్రతి విభాగంలో 60 సీట్లు ఉంటాయి.
-కోర్స్ పేరు: డాక్టోరల్ ప్రోగ్రామ్
-విభాగాలు: ఎఫ్‌పీఎం, ఈఎఫ్‌పీఎం
-అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (10+2+3 విధానంలో) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2018 ఇయర్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: క్యాట్, జీమ్యాట్/మ్యాట్, గ్జాట్, సీమ్యాట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్ : www.bimtech.ac.in/admissions


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎఐఎంఏ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉద్యోగాలు,
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఎఐఎంఏ) దేశవ్యాప్తంగా 200 పైగా బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం అండ్ ఐల్లెడ్ ప్రోగ్రామ్స్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
mat 
వివరాలు: 
-కోర్స్ పేరు: ఎంబీఏ, పీజీడీఎం అండ్ ఐల్లెడ్ ప్రోగ్రామ్స్. 
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 1500/- 
-ఎంపిక: పేపర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 1
-రాత పరీక్ష: పేపర్ బేస్డ్ టెస్ట్-డిసెంబర్ 10 
(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-డిసెంబర్ 16)

-వెబ్‌సైట్: https://www.aima.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీడీఐఆర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు.

బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిసెర్చ్ (ఎన్‌సీడీఐఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 13
-డాటా ఎంట్రీ ఆపరేటర్-8, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్-2, సైంటిస్ట్ మెడికల్-3
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ, ఎంఎస్/డీఎన్‌బీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (మెడికల్), బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ, మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్‌లో ఉత్తీర్ణత. 
-ఎంపిక: స్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-రాతపరీక్ష/ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 14,15

-వెబ్‌సైట్: www.ncdirindia.org

1 comment:

  1. hai srikanth
    im vamshi from http://www.telanganajob.com
    im also posting the telangana jobs information.

    but i have a doubt in your articles have low ads where you get the money

    ReplyDelete