Thursday, 2 November 2017

నాబార్డ్ కన్సల్టెన్సీలో 82 ఉద్యోగాలు, నిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఐఐఎస్‌ఈఆర్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్, ఐఐఎంలో నాన్ టీచింగ్ స్టాఫ్, శాతవాహన యూనివర్సిటీలో ఫ్యాకల్టీ, ఐఐఐటీడీఎంలో ఉద్యోగాలు, బెల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

నాబార్డ్ కన్సల్టెన్సీలో 82 ఉద్యోగాలు,

డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులకు అవకాశం 
- ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

నాబార్డ్ అనుబంధ సంస్థ నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఏబీసీవోఎన్‌ఎస్) కో- ఆర్డినేటర్, ఎన్యుమరేటర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nabard 
వివరాలు: ఎన్‌ఏబీసీవోఎన్‌ఎస్ ఒక ఐఎస్‌వో 9001:2008 కంపెనీ. ఈ కంపెనీ దేశంలోని 23 రాష్ర్టాలలో నాబార్డ్‌కు సంబంధించిన ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల మానిటరింగ్, ఎవల్యూషన్, డాక్యుమెంటేషన్‌లను నిర్వహిస్తుంది.
-పోస్టులు - అర్హతలు:
-నేషనల్ కోఆర్డినేటర్ - 1 ఖాళీ
-పనిచేయాల్సిన ప్రదేశం: ముంబై
-పేస్కేల్: నెలకు రూ. 70,000/- దీనికి అదనంగా వసతి, ప్రయాణం, స్థానిక అలవెన్స్‌లు తదితరాలను ఇస్తారు. 
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో అగ్రికల్చర్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ లేదా ఆగ్రానమీ/ హార్టికల్చర్ లేదా క్రాప్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్ లేదా అనుబంధ బ్రాంచీలలో పీజీ ఉత్తీర్ణత.
-పీహెచ్‌డీ చేసినవారు లేదా పీహెచ్‌డీలో పేపర్స్ సమర్పించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
-స్టేట్ కో-ఆర్డినేటర్ - 20 ఖాళీలు
-పేస్కేల్: డిగ్రీ అభ్యర్థులకు నెలకు రూ. 50,000/-
-పీజీ/పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ. 60,000/- 
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో కింది ఏదైనా ఒక అంశంలో డిగ్రీ ఉత్తీర్ణత. అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఆగ్రానమీ, హార్టికల్చర్, క్రాప్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సోషియాలజీ, సోషల్‌వర్క్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. లేదా ఏదైనా డిగ్రీ చేసి పైన పేర్కొన్న బ్రాంచీలలో ఏదైనా ఒక సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ/పీహెచ్‌డీ (అవార్డు అయినవారు) అర్హులు.
-డిగ్రీ అభ్యర్థులయితే రూరల్/సోషల్ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో కనీసం ఐదేండ్ల అనుభవం. పీజీ/పీహెచ్‌డీ అభ్యర్థులకు అయితే మూడేండ్ల అనుభవం ఉండాలి.
-ఎన్యుమరేటర్స్ - 61 ఖాళీలు (తెలంగాణకు 2 పోస్టులు కేటాయించారు)
-పేస్కేల్: డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ. 25,000/-
-గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు రూ.25వేలు/30 వేలు 
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో అగ్రికల్చర్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ లేదా ఆగ్రానమీ/ హార్టికల్చర్ లేదా క్రాప్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్ లేదా అనుబంధ బ్రాంచీలలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులు. డిగ్రీ అభ్యర్థులకు ఏడాది, డిప్లొమా అభ్యర్థులకు మూడేండ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ భాష రాయడం, చదవటం, మాట్లాడటం వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
-వయస్సు: నేషనల్ కో-ఆర్డినేటర్‌కు 40 నుంచి 64 ఏండ్ల మధ్య ఉండాలి. స్టేట్ కో-ఆర్డినేటర్ పోస్టుకు 25 - 63 ఏండ్లు, ఎన్యుమరేటర్‌కు 21 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-నోట్: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తున్నారు. మొదట ఏడాది కాలానికి తీసుకొంటారు. పనితనాన్ని బట్టి మరో ఏడాది పొడిగిస్తారు. మొదటి మూడు నెలలు ప్రొబేషనరీ పీరియడ్. 
-ఎంపిక: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని బట్టి షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 10

-వెబ్‌సైట్: http://www.nabcons.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,

హైదరాబాద్ పంజాగుట్టలోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
nims
వివరాలు: తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ప్రోగ్రామ్: పీహెచ్‌డీ
-స్పెషలైజేషన్స్: బయోకెమిస్ట్రీ - 1, కార్డియాలజీ - 1, ఎమర్జెన్సీ మెడిసిన్ -1, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ - 1, మెడికల్ ఆంకాలజీ - 1, మైక్రోబయాలజీ - 3, నెఫ్రాలజీ - 4, న్యూరాలజీ - 1, న్యూరోసర్జరీ - 1, పల్మనరీ మెడిసిన్ - 1 సీట్లు ఉన్నాయి.
-అర్హతలు: కింది వాటిలో ఏదైనా ఒక అర్హత ఉండాలి.
-లైఫ్ సైన్సెస్ ఇన్ మెడికల్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మసీ, జెనిటిక్స్, ఫిజియాలజీ, హ్యూమన్ అనాటమీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, న్యూట్రిషన్ తదితర సబ్జెక్టుల్లో పీజీ ఉండాలి.
-ఎండీ ఆయుర్వేదిక్ మెడిసిన్ (ఫార్మకాలజీలో పీహెచ్‌డీకి మాత్రమే అర్హులు)
-మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరఫీ
-పైన పేర్కొన్న అర్హత పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్ లేదా డీఎన్‌బీ/ఎండీ (ఆయుర్వేద) ఉత్తీర్ణులకు నిర్ణీతశాతం మార్కుల నిబంధన లేదు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: నవంబర్ 8
-వెబ్‌సైట్: https://nims.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఐఎస్‌ఈఆర్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్,

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ విడుదలైంది.
iiser 
వివరాలు: ఐఐఎస్‌ఈఆర్ కోల్‌కతా (మోహన్‌పూర్)లో 2006లో ప్రారంభించారు. ఇది కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్స్
-విభాగాలు: బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజికల్ సైన్సెస్
-అర్హతలు: పీహెచ్‌డీతోపాటు పీజీ/తత్సమాన కోర్సులో ఫస్ట్‌క్లాస్ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టీచింగ్/రిసెర్చ్‌లో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-పేస్కేల్: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ పే రూ. 8,000/ రూ. 9,000.
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు ప్రాతిపదిక పోస్టులకు) గ్రేడ్ పే రూ. 6,000/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 30
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Dean of Faculty Affairs Indian Institute of Science Education and Research Kolkata Mohanpur-741246 West Bengal, INDIA
-E-mail: dofa_fa@iiserkol.ac.in
-వెబ్‌సైట్: http://apply.iiserkol.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంలో నాన్ టీచింగ్ స్టాఫ్,
సంబల్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIM 
వివరాలు: ఈ సంస్థ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ప్రస్తుత ఖాళీలకు దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేయనున్నారు.
-పోస్టులు: సెక్రటరీ టూ డైరెక్టర్, స్టోర్ అండ్ పర్చేస్ ఆఫీసర్, సీనియర్ లైబ్రేరియన్ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (డాక్యుమెంటేషన్ వర్క్), అకౌంటెంట్, జూనియర్ ఇంజినీర్, పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: http://www.iimsambalpur.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
శాతవాహన యూనివర్సిటీలో ఫ్యాకల్టీ,
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ కింది సబ్జెక్టులు బోధించడానికి పదవీవిరమణ చేసిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టులు: ప్రొఫెసర్లు
-అర్హతలు: పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు
-పనిచేయాల్సిన ప్రదేశం: శాతవాహన యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో.
-సబ్జెక్టులు: బొటనీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, ఫిజిక్స్, ఫార్మసీ.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 16
-వెబ్‌సైట్: www.satavhana.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఐటీడీఎంలో ఉద్యోగాలు,
కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో జనవరి - 2018 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
IIIT 
వివరాలు: ఐఐఐటీడీఎం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-ప్రోగ్రామ్: పీహెచ్‌డీ (జనవరి 2018)
-విభాగాలు: కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజినీరింగ్
-ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
-మెకానికల్ ఇంజినీరింగ్
-మ్యాథమెటిక్స్ & ఫిజిక్స్
-ఫెలోషిప్: ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫెలోషిప్స్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 21
-వెబ్‌సైట్: www.iiitdm.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
BEL 
వివరాలు: బెల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఒక నవరత్న కంపెనీ. ప్రస్తుత ఖాళీలు ఘజియాబాద్ యూనిట్‌లో ఉన్నాయి. ఈ ఖాళీలను ఐదేండ్ల కాలానికి కాంట్రాక్టుప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మరో ఐదేండ్లు పొడిగించడానికి అవకాశం ఉంది.
-పోస్టు: డిప్యూటీ ఇంజినీర్
-విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ - 18, కంప్యూటర్‌సైన్స్ - 6. వీటిలో జనరల్ - 12, ఓబీసీ -6, ఎస్సీ - 4, ఎస్టీ - 2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ 
-అనుభవం: ఇంజినీరింగ్ తర్వాత కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 27 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 25
-వెబ్‌సైట్: www.bel-india.com


0 comments:

Post a Comment