Monday, 27 November 2017

ఐఐటీ ఢిల్లీలో 54 ఖాళీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో, ఇంటర్‌తో నేవీలో కొలువులు, ఆర్‌సీబీలో ప్రొఫెసర్లు, డీఐఏటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు.

ఐఐటీ ఢిల్లీలో 54 ఖాళీలు,

ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నాన్ అకడమిక్ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల (బ్యాక్‌లాగ్) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iit-delhi
వివరాలు:
ఈ పోస్టులను స్పెషల్ డ్రైవ్ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ)లో భాగంగా భర్తీ చేస్తారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 54
-జూనియర్ ఇంజినీర్-1
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మూడేండ్ల డిప్లొమాలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-5
-అర్హత: సైన్స్/కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్/
సూపరింటెండెంట్/పబ్లికేషన్-8
-అర్హత: మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ, ఎంకాం/బీకాంలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-సీనియర్ మెకానిక్/
సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్-13
-అర్హత: సైన్స్/కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జూనియర్ అసిస్టెంట్/
అసిస్టెంట్ మెస్ మేనేజర్-23
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, బీకాంలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్-4
-అర్హత: సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్/అప్లయిడ్ సైన్స్‌లో మూడేండ్ల డిప్లొమాలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/కంప్యూటర్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 11
-వెబ్‌సైట్: www. iitd.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో,
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్‌ఐఐ) 2018-19 గాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nii
వివరాలు:
ఎన్‌ఐఐ అనేది అటానమస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీ, జెనెటిక్స్ మాలిక్యులర్ అండ్ సెల్యూలర్ బయాలజీ, కెమికల్, స్ట్రక్చరల్ అండ్ కాంప్యుటేషనల్ బయాలజీ, రిప్రొడక్షన్ అండ్ డెవలప్‌మెంట్
-అర్హత: సైన్స్ బ్రాంచీలో మాస్టర్ డిగ్రీ/ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీబీఎస్, ఎంవీఎస్సీ, ఎంఫార్మా లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఎంపిక: ప్రవేశాలను రెండు రకాలుగా కల్పిస్తారు
-ఎన్‌ఐఐ నిర్వహించే ప్రవేశ పరీక్ష
-పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ, కోల్‌కతా, పుణె, హైదరాబాద్, గువాహటి
-పరీక్ష తేదీ: 2018 ఫిబ్రవరి 18
-జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ లైఫ్ సైన్సెస్ (JGEEBILS) -2018
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 28 సెంటర్లలో నిర్వహిస్తారు
-పరీక్ష తేదీ: 2018 ఫిబ్రవరి 18
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: 2018 జనవరి 10
-వెబ్‌సైట్:www.nii.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇంటర్‌తో నేవీలో కొలువులు,
ఇంటర్/10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత..
-శిక్షణ తర్వాత సెయిలర్ (అర్టిఫైసర్ అప్రెంటిస్) హోదాలో ఉద్యోగం
-ఉద్యోగ భద్రత, మంచి జీతాలు, పదోన్నతులకు అవకాశం
-రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా ఎంపిక
-దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: డిసెంబర్ 10


భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) సెయిలర్ పోస్టుల భర్తీకి ఆర్టిఫైసర్ అప్రెంటిస్ (ఏఏ) ఆగస్టు /2018 బ్యాచ్‌లో చేరటానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
INDIAN-NAVY-SAILERS-2017
వివరాలు:
-భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నావికాదళంలో సెయిలర్ (ఆర్టిఫైసర్ అప్రెంటిస్) పోస్టులు. దీనికి సంబంధించిన కోర్సు ఆగస్టు 2018లో ప్రారంభమవుతుంది.
-విద్యార్హత: ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్టును చదివి ఉండాలి.
-వయస్సు: 1998 ఆగస్టు 1 నుంచి 2001 జూలై 31 మధ్యన జన్మించి ఉండాలి
-పే అండ్ అలవెన్స్‌లు:
-శిక్షణా కాలంలో నెలకు రూ. 14,600/- ఇస్తారు.
-శిక్షణ అనంతరం పేస్కేల్ రూ. 21,700 69,100 + ఎంఎస్‌పీ రూ. 5,200/- +
ఎక్స్ గ్రూప్ పే రూ 6,200/-+ డీఏ ఇస్తారు.
-ఆర్టిఫైసర్ అప్రెంటిస్ పూర్తయిన తర్వాత మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ (సుబేదార్ హోదా)లో పే స్కేల్.. రూ. 21,700 1,51, 100 + గ్రేడ్ పే రూ. 5,200/- + ఎక్స్ గ్రూప్ పే రూ 6, 200/ + డీఏ ఇస్తారు.
-పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.
-శిక్షణాకాలంలో సెయిలర్స్‌కు పుస్తకాలు, యూని ఫాం, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. సెయిలర్స్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తారు. సెయిలర్స్ పిల్లల విద్య, హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌లు ఇస్తారు. వీటితోపాటు సంవత్సరాంత సెలవులు ఉంటాయి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా చేస్తారు.
రాతపరీక్ష విధానం:
-ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం
ఇంగ్లిష్ /హిందీలో మాత్రమే ఉంటుంది.
-పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్,
జనరల్‌నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు
-ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
-అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
-7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి
-20 ఉతక్, బైఠక్ (గుంజీలు), 10 పుష్ అప్స్
-గమనిక: క్రీడలు, స్విమ్మింగ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో నైపుణ్యం ఉన్నవారికి
ప్రాధాన్యమిస్తారు.
-శారీరక ప్రమాణాలు:
-కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి.
-వీటితోపాటు నేవీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మంచి కంటి చూపు
(6/12, 6/12 లేదా 6/9, 6/12) ఉండాలి.
శిక్షణ:
-శిక్షణ 2018 ఆగస్టులో ప్రారంభమవుతుంది. 9 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. దీనితోపాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను నేవల్ ట్రెయినింగ్ కేంద్రాల్లో ఇస్తారు. ట్రెయినింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకొన్న వారికి 20 ఏండ్లు కాలపరిమితికి నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలతోపాటు మొబైల్ నంబర్ , వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 10
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌సీబీలో ప్రొఫెసర్లు,
ఫరీదాబాద్‌లోని రీజినల్ సెంటర్ బయోటెక్నాలజీ (ఆర్‌సీబీ) వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RCB-RECRUITEMENT
వివరాలు
-మొత్తం పోస్టులు: 21
-పోస్టుల వారీగా
-ప్రొఫెసర్- 4
-అర్హతలు: లైఫ్‌సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసి, టీచింగ్‌లో 10 ఏండ్లు లేదా రిసెర్చ్ చేసిన అనుభవం ఉండాలి.
-అసోసియేట్ ప్రొఫెసర్- 6
-అర్హతలు: లైఫ్‌సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసి, టీచింగ్‌లో 6 ఏండ్లు లేదా రిసెర్చ్ చేసిన అనుభవం ఉండాలి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్- 11 (జనరల్ 5, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1)
-అర్హతలు: లైఫ్‌సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసి, పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేసిన అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.rcb.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఐఏటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్,
ఫుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ) 2018 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్త్తున్నది.
DIAT-DRDO
వివరాలు:
డీఐఏటీ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్.
ఈ కోర్సు జనవరి 2018లో ప్రారంభ మవుతుంది.
-విభాగాలు: మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, అప్లయిడ్ ఫిజిక్స్, అప్లయిడ్ కెమిస్ట్రీ.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ/మాస్టర్ ఇన్ సైన్స్ (ఎమ్మెస్సీ)లో ఉత్తీర్ణత. గేట్ లేదా సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్, గేట్/నెట్ (ఫెలోషిప్)లో అర్హత సాధించాలి.
నోట్: డీఆర్‌డీవో, ఆర్మ్‌డ్ ఫోర్సెస్,
డీపీఎస్‌యూ, ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవారికి కేటాయించారు. కొన్ని సీట్లను సివిలియన్లకు కేటాయించారు. వీరికి స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తారు.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు
-ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: Joint Registrar (Admin), Defence Institute of Advanced Technology, Girinagar, Pune-411025
-దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.diat.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్  ఉద్యోగాలు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను (కాంట్రాక్టు) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-ప్రాజెక్ట్ సైంటిస్ట్ - బీ: ఖాళీల సంఖ్య - 7
-అర్హతలు: పీజీ (ఎంటెక్/ఎమ్మెస్సీ (టెక్నాలజీ) లేదా ఎమ్మెస్సీ)లో జియోఫిజిక్స్/జియాలజీ లేదా సిస్మాలజీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. 
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 1 ఖాళీ
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ఐటీ/సీఎస్‌ఈలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు.
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ - సీ - 3 ఖాళీలు
-అర్హతలు: పీజీలో జియోఫిజిక్స్/జియాలజీ/సిస్మాలజీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ - సీ: 1 ఖాళీ
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ఈసీఈ/ఐటీ లేదా 
సీఎస్‌ఈలో కనీసం 60 శాతం మార్కులతో 
ఉత్తీర్ణులై ఉండాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ప్రకటన విడుదలైన 15 రోజుల్లో 

-వెబ్‌సైట్: http://www.moes.gov.in

0 comments:

Post a Comment