Wednesday, 22 November 2017

రిజర్వ్‌బ్యాంక్‌లో 526 ఉద్యోగాలు, ఐసీఏఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు, ఢిల్లీ జిల్లా కోర్ట్‌లో ఉద్యోగాలు, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డులో ఉద్యోగాలు, మనూలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు, ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ డీఐపీటీడీ కోర్సులో ప్రవేశాలు, ఐఐపీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (డ్రైవర్) ఉద్యోగాలు,

రిజర్వ్‌బ్యాంక్‌లో 526 ఉద్యోగాలు,

దేశ అపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగం
-పదోతరగతి అభ్యర్థులకు అవకాశం
-ఆన్‌లైన్ టెస్ట్ + భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా ఎంపిక

RBI 
ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: 
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలోని అపెక్స్ బ్యాంక్/ కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంక్‌ను 1935, ఏప్రిల్ 1న స్థాపించారు. 
-పోస్టు పేరు: ఆఫీస్ అటెండెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య - 526 (జనరల్-366, ఓబీసీ-100, ఎస్సీ-7, ఎస్టీ-53)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: హైదరాబాద్-27, అహ్మదాబాద్-39, బెంగళూరు-58, భోపాల్-45, చండీగఢ్, సిమ్లా-47, చెన్నై-10, గువాహటి-10, జమ్ము-19, లక్నో-13, కోల్‌కతా-10, ముంబై, నవీ ముంబై, పనాజీ-165, నాగ్‌పూర్-9, న్యూఢిల్లీ-27, తిరువనంతపురం-47
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతిలో ఉత్తీర్ణత. రాష్ర్టాల/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానిక భాషలో పట్టు ఉండాలి.
-వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1992, నవంబర్ 2 నుంచి 1999, నవంబర్ 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 10,490-23,700/-. ఎంపికైన అభ్యర్థులు వేతన రూపంలో ఆరంభంలోనే నెలకు రూ. 22,339/- వరకు వస్తుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 450/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 50/-)
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్
-ఎంపిక విధానం: రెండు దశల్లో జరుగుతుంది. రాతపరీక్ష+భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా
-రాతపరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
-పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్/హిందీ భాషలో ప్రశ్నపత్రం ఇస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు. 
-ఆన్‌లైన్‌టెస్ట్‌లో మెరిట్ పొందిన అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం లాంగ్వేజ్ ఫ్రొఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
-లాంగ్వేజ్ ఫ్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం స్థానిక భాషలో నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
-ఆన్‌లైన్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు: 
-చివరితేదీ: డిసెంబర్ 7
-పరీక్ష తేదీ: 2018 జనవరి/ఫిబ్రవరి నెలల్లో నిర్వహిస్తారు.

-వెబ్‌సైట్: www.rbi.org.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఏఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు,

సెంట్రల్ షీప్ అండ్ ఊల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌డబ్ల్యూఆర్‌ఐ) ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
cswri 
వివరాలు: 
సీఎస్‌డబ్ల్యూఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఎఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ 
-మొత్తం పోస్టుల సంఖ్య:6
-సీనియర్ రిసెర్చ్ ఫెలో-1 పోస్టు
-అర్హత: మాస్టర్ డిగ్రీ (యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్/యానిమల్ సైన్సెస్, వెటర్నరీ సైన్సెస్, అగ్రికల్చర్)లో ఉత్తీర్ణత లేదా డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
-పే స్కేల్: 25,000/-+హెచ్‌ఆర్‌ఏ
-యంగ్ ప్రొఫెషనల్-5 పోస్టులు
-అర్హత: అగ్రికల్చర్, ఐల్లెడ్ సైన్స్‌లో బీఎస్సీ, బీఈ/బీటెక్ (మెకానికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ), ఎంఈ/ఎంటెక్, ఎల్‌ఎల్‌బీ లేదా బీఏ/ఎంఏ (పొలిటికల్ సైన్స్)లో 
ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 15,000/-(కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత అధికారి వద్ద ఇంటర్వ్యూ తేదీన హాజరుకావాలి
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.cswri.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఢిల్లీ జిల్లా కోర్ట్‌లో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ (హెడ్‌క్వార్టర్) ఖాళీగా ఉన్న జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ (జేజేఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
coart-building 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 288 (జనరల్-145,ఓబీసీ-78, ఎస్సీ-43, ఎస్టీ-22)
-పోస్టు పేరు: జూనియర్ జ్యుడీషియల్ 
అసిస్టెంట్ (జేజేఏ)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200+రూ.2,800/- 
-వయస్సు: 2017 డిసెంబర్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/- 
-ఎంపిక: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ + ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: డిసెంబర్ 1

-వెబ్‌సైట్:www.delhidistrictcourts.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పొల్యూషన్ కంట్రోల్‌బోర్డులో ఉద్యోగాలు,
ఢిల్లీలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది 
cpcb 
వివరాలు: 
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ పరిధిలో సీపీసీబీ పనిచేస్తుంది.
-సైంటిస్ట్ - బీ - 13 ఖాళీలు. (జనరల్ - 7, పీహెచ్‌సీ హెచ్‌హెచ్ - 1, ఓబీసీ -4, ఎస్సీ-1) 
-పేస్కేల్: రూ. 56,000 - 1,77, 500/-
-అసిస్టెంట్ లా ఆఫీసర్ - 1 (ఓబీసీ)
-పేస్కేల్: రూ. 44,900 - 1,42,400/-
-సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 3 ఖాళీలు
-పేస్కేల్: రూ. 35,400 - 12, 400/-
-లోయర్ డివిజన్ క్లర్క్ - 3 ఖాళీలు
-పేస్కేల్: రూ. 19,900 - 63,200/-
-ఫీల్డ్ అటెండెంట్ - 1
-పేస్కేల్: రూ. 18,000 - 56,900/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లోప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి. ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 18 -24)లో ప్రచురితమైంది.

-వెబ్‌సైట్: www.cpcb.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు,
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో టీచింగ్, నాన్ టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
manu
వివరాలు: మనూ ఒక సెంట్రల్ యూనివర్సిటీ. ఇది గచ్చిబౌలిలో ఉంది.
-టీచింగ్ పోస్టులు: ప్రొఫెసర్ కమ్ డైరెక్టర్ - 1
-అకడమిక్ పోస్టులు: లైబ్రేరియన్ - 1
-నాన్ టీచింగ్ పోస్టు: అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 1, మెడికల్ ఆఫీసర్ - 1, ప్రొడ్యూసర్, మీడియా సెంటర్ - 1, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 1, పర్సనల్ సెక్రటరీ - 1, సెక్షన్ ఆఫీసర్ - 1, అసిస్టెంట్ - 1, లోయర్ డివిజన్ క్లర్క్ - 2 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.nanuu.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ డీఐపీటీడీ కోర్సులో ప్రవేశాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ డీఐపీటీడీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందినది.
-కోర్సు: డిప్లొమా ఇన్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఐపీటీడీ)
-కోర్సు ప్రారంభం: 2018, జనవరి
-కాలవ్యవధి: 18 నెలులు (8 థియరీ పేపర్లు, ఇంటర్న్‌షిప్ రిపోర్టు)
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు కనీసం రెండేండ్లు ఏదైనా సంస్థలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2017, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.istd.co.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐపీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (డ్రైవర్) ఉద్యోగాలు,

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
csir-iip 
వివరాలు: 
ఐఐపీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుత ఖాళీలను ఎంసీవో ప్రాజెక్ట్ కోసం తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
-పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (డ్రైవర్)
-మొత్తం ఖాళీలు - 32
-వయస్సు: 2017, నవంబర్ 23 నాటికి 28 ఏండ్ల లోపు వారై ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-విద్యార్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. మూడేండ్ల నుంచి వ్యాలిడిటీ కలిగిన ఎల్‌ఎంవీ ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్
-స్కిల్‌టెస్ట్: నవంబర్ 23
-స్కిల్‌టెస్ట్ నిర్వహించే ప్రదేశం: ఐఐపీ, డెహ్రాడూన్.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో

-వెబ్‌సైట్: http://www.iip.res.in

0 comments:

Post a Comment