Thursday, 2 November 2017

అన్నా మలై దూరవిద్య కోర్సులు, షిప్పింగ్ కార్పొరేషన్‌లో 50 పోస్టులు, సదరన్‌లోఅప్రెంటిస్, దుర్గాపూర్ నిట్‌లో ఫ్రొఫెసర్లు, వెటర్నరీ సైన్స్‌లో పీజీ, పీహెచ్‌డీ, ఈహెచ్‌ఎస్ మెడికల్ ట్రెయినీలు, ఇన్ఫోసిస్‌లో టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్.

అన్నా మలై దూరవిద్య కోర్సులు,
అన్నామలై యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
annamali
వివరాలు:
అన్నామలై యూనివర్సిటీ ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటి. ఇది తమిళనాడులో ఉంది. దేశవ్యాప్తంగా స్టడీసెంటర్లను కలిగి ఉంది.
కోర్సులు:
- యూజీ: బీఏ, బీఎస్సీ, బీకాం (మూడేండ్లు)
- పీజీ: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం (రెండేండ్లు)
- పీజీ డిప్లొమా కోర్సులు: టూరిజం మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, అగ్రికల్చరల్ అనుబంధ ప్రోగ్రామ్స్, ఇంజినీరింగ్ అనుబంధ ప్రోగ్రామ్స్.
- సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
- ఐటీ ప్రోగ్రామ్స్: బీసీఏ, బీఎస్సీ, బీబీఏ, ఎంసీఏ తదితరాలు.
- లైబ్రేరీ సైన్స్: ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, సీఎల్‌ఐఎస్సీ
- ఎంబీఏ ప్రోగ్రామ్: ఈ బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం.
- యోగా అనుబంధ కోర్సులు: పీజీ డిప్లొమా, డిప్లొమా
- దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- వెబ్‌సైట్: www.audde.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
షిప్పింగ్ కార్పొరేషన్‌లో 50 పోస్టులు,

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐ) ఇంజిన్ రూం పెట్టి ఆఫీసర్స్, ట్రెయినీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
shipping-corporation
వివరాలు:
షిప్పింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను కాంట్రాక్టు
ప్రాతిపదికన భర్తీ చేస్తుంది.
- మొత్తం ఖాళీలు - 50
- పోస్టు: ఇంజిన్ రూం పెట్టి ఆఫీసర్స్ (ఈఆర్‌పీవో)
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) లేదా ఫిట్టర్ లేదా డీజిల్/మోటార్ మెకానిక్ లేదా వెల్డర్ ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ లేదా ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన షిప్‌యార్డ్‌లో రెండేండ్ల ట్రేడ్ అప్రెంటిస్ చేసి ఉండాలి. (ఫిట్టర్, డీజిల్, మోటార్ మెకానిక్). సంబంధిత రంగంలో ప్రావీణ్యత ఉండాలి.
- జీతభత్యాలు: నెలకు రూ. 55, 743/- (సుమారుగా) వస్తుంది. అంటే రోజుకు సుమారుగా రూ. 1,833/-
- ఎంపిక: అర్హత సర్టిఫికెట్స్ పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.
- పోస్టు: ట్రెయినీ ఈఆర్‌పీవో:
- అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఫిట్టర్/డీజిల్ లేదా మోటార్ మెకానిక్/ వెల్డర్ ట్రేడుల్లో ఎన్‌టీసీ లేదా ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా షిప్‌యార్డ్‌లో రెండేండ్ల అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి.
- జీతం: నెలకు రూ. 10,000/- కన్సాలిడేటెడ్ స్టయిఫండ్ ఇస్తారు. (శిక్షణా కాలంలో ఎటువంటి స్టయిఫండ్ ఇవ్వరు. శిక్షణ అనంతరం వీరికి జీతం ఇస్తారు)
- ఎంపిక: ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ద్వారా
- ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 30
ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం:
Shipping House
The Shipping Corporation of India Ltd. 245, Madame Cama Road
Mumbai - 400021
- వెబ్‌సైట్: http://www.shipindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సదరన్‌లోఅప్రెంటిస్,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సదరన్ రీజియన్‌లో అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది.
iocl
వివరాలు:
తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఐవోసీఎల్ మార్కెటింగ్ డివిజన్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
- మొత్తం సదరన్ రీజియన్‌లో ఖాళీలు - 354.
- తెలంగాణలో - 42 ఖాళీలు. వీటిలో జనరల్ - 22, ఎస్సీ - 6, ఎస్టీ - 2, ఓబీసీ (ఎన్‌సీఎల్) - 11 ఖాళీలు ఉన్నాయి.
- ఖాళీగా ఉన్న ట్రేడులు - ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్.
- తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఖాళీల సంఖ్య - 153
- కర్ణాటక - 69
- కేరళ - 46
- ఆంధ్రప్రదేశ్ - 44
- ట్రేడుల వారీగా అర్హతలు:
- ఫిట్టర్: పదోతరగతితోపాటు రెండేండ్ల ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
- ఎలక్ట్రీషియన్: మెట్రిక్ లేదా పదోతరగతితోపాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత.
- ఎలక్ట్రానిక్ మెకానిక్: పదోతరగతితో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత.
- ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: పదోతరగతితో పాటు ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత.
- ల్యాబొరేటరీ అసిస్టెంట్ (క్వాలిటీ కంట్రోల్): మూడేండ్ల ఫుల్‌టైం బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
నోట్: పై కోర్సులన్నీ రెగ్యులర్ విధానంలో చదివి ఉండాలి. అదేవిధంగా సంబంధిత విభాగాల్లో జనరల్/ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- రాతపరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఇస్తారు. రాతపరీక్షకు 85 మార్కులు. ఇంటర్వ్యూకు 15 మార్కులు.
- రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో క్వాలిఫయింగ్ మార్కులు 40 శాతం. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 35 శాతం మార్కులు రావాలి.
నోట్: అభ్యర్థులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ విభాగాలకు
(ట్రేడులకు) దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తారు.
- స్టయిఫండ్: అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం కన్సాలిడేటెడ్ స్టయిఫండ్‌ను చెల్లిస్తారు. దీనికి అదనంగా రూ. 2,500/- ఇస్తారు.
- శిక్షణా కాలం: అన్ని ట్రేడులకు 12 నెలలు
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 1 నుంచి ప్రారంభం
- చివరితేదీ: నవంబర్ 15
- రాతపరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, విజయవాడ, కొచ్చిన్, బెంగళూరు
- రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 3
- వెబ్‌సైట్: https://www.iocl.com/PeopleCareers,
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
దుర్గాపూర్ నిట్‌లో ఫ్రొఫెసర్లు,
వెస్ట్‌బెంగాల్ (దుర్గాపూర్)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ (కాంట్రాక్ట్/రెగ్యులర్ పద్ధతిలో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nit-durgapur
వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 104
- విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
- పే స్కేల్: కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.15,600 - 39,100 +అకడమిక్ గ్రేడ్ పే రూ. 6000/7000/- ఇస్తారు.
- రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.15,600 - 39,100 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 8000/- ఇస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్/ప్రొఫెసర్ పోస్టులకు రూ. 37,400 - 67,000 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 9500/10,500 ఇస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ,
పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
- దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 17.
- వెబ్‌సైట్: www. nitdgp.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వెటర్నరీ సైన్స్‌లో పీజీ, పీహెచ్‌డీ,
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ 2017 -18 విద్యా సంవత్సరంలో ్ల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
-కోర్సులు: ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ
ఎంవీఎస్సీ:
- అర్హతలు: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఉత్తీర్ణత.
అభ్యర్థుల వయస్సు 40 ఏండ్లు మించరాదు.
పీహెచ్‌డీ:
- అర్హత: వెటర్నరీ సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణత. అభ్యర్థుల వయస్సు 50 ఏండ్లు మించరాదు.
- పై రెండుకోర్సులకు యూజీసీ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణతా శాతం ఉండాలి.
- ఎంపిక: అకడమిక్ మార్కులు, ప్రవేశపరీక్ష
- దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
- పీజీ కోర్సులకు చివరితేదీ: నవంబర్ 15
- పీహెచ్‌డీ కోర్సులకు చివరితేదీ: నవంబర్ 27
- వెబ్‌సైట్: www.svvu.edu.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈహెచ్‌ఎస్ మెడికల్ ట్రెయినీలు,
ఈఎల్‌ఐసీవో హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్ (ఈహెచ్‌ఎస్)లో మెడికల్ స్ర్కైబ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
- పోస్టు: మెడికల్ స్ర్కైబ్ ట్రెయినీ
- అర్హతలు: 2018లో బీకాం, బీఎస్సీ 
(ఏ బ్రాంచీ అయినా) పూర్తిచేయనున్నవారు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి.
- సీటీసీ: రూ. 1,80,000/- (ఏడాదికి)
- ఎంపిక: రాతపరీక్ష, ఆడియో టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: రెజ్యూమేను అప్‌లోడ్ చేయాలి.
- చివరితేదీ: నవంబర్ 3 (2 PM)
- వెబ్‌సైట్: www.task.telangana.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్ఫోసిస్‌లో టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
infosys 
- పోస్టు: ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్/టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్
- డొమైన్: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, టెస్టింగ్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్.
- అర్హతలు: బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్/ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్ లేదా ఐటీ) డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయబోతున్నవారు.
నోట్: బాండ్ పీరియడ్ లేదు.
- అభ్యర్థులు ఇన్ఫోసిస్ లిమిటెడ్/ఇన్ఫోసిస్ గ్రూప్ కంపెనీల సెలక్షన్‌లలో 9 నెలలోపు హాజరు అయి ఉండకూడదు. 
- అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టీం సభ్యులతో కలసి, వ్యక్తిగతంగా పనిచేయడం రావాలి. 
- జీతం: ఏడాదికి (సీటీసీ) రూ. 2,19,000/-
- ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ (టెక్నికల్), హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 2
- వెబ్‌సైట్: www.task.telangana.gov.in


0 comments:

Post a Comment