Monday, 27 November 2017

నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో శిక్షణ, సీఐఎస్‌ఎఫ్‌లో 487 ఉద్యోగాలు, సీసీఆర్‌యూఎంలో రిసెర్చ్ పోస్టులు, సీడీఎఫ్‌డీలో రిసెర్చ్ స్కాలర్ పోగ్రామ్, భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సైంటిఫిక్ అసిస్టెంట్లు, బీఎంఆర్‌సీఎల్‌లో సివిల్ ఇంజినీర్లు.

నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో శిక్షణ,
హైదరాబాద్ (విద్యానగర్)లోని ఏటీఐ క్యాంపస్‌లోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCS
వివరాలు: కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలను నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తుంది. గతంలో దీన్ని వికలాంగుల వొకేషనల్ రిహాబిలిటేషన్ సెంటర్ (వీఆర్‌సీ)గా పిలిచేవారు.
కోర్సులు/ట్రెయినింగ్ వివరాలు:
-మల్టీ కుసైన్ కుక్
-అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. చలన వైకల్యం ఉన్నవారికి 700 గంటలపాటు శిక్షణ ఇస్తారు.
-ఫుడ్ అండ్ బేవరేజెస్- స్టీవార్డ్
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. వినికిడి వైకల్యం ఉన్నవారికి 500 గంటలపాటు శిక్షణ ఇస్తారు.
-రూమ్ అటెండెంట్
-అర్హత: ఐదో తరగతి ఉత్తీర్ణత. వినికిడి, మైల్డ్ మెంటల్లీ వైకల్యం ఉన్నవారికి 500 గంటలపాటు శిక్షణ ఇస్తారు.
-ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్
-అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత. చలన వైకల్యం ఉన్నవారికి 540 గంటలపాటు శిక్షణ ఇస్తారు.
-క్రాఫ్ట్ బేకర్
-అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. చలన వైకల్యం ఉన్నవారికి 440 గంటలపాటు శిక్షణ ఇస్తారు.
-వయస్సు: 18-28 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్: ట్రెయినింగ్‌లో భాగంగా కుక్‌కు
రూ. 2000, ఇతర కోర్సులకు రూ. 1500 నెలకు చెల్లిస్తారు.
-ట్రెయినింగ్ పూర్తయిన వెంటనే గవర్నమెంట్
సర్టిఫికెట్ ఇస్తుంది.
-శిక్షణ సమయంలో ఉచిత యూనిఫామ్, భోజన వసతి కల్పిస్తారు.
-ప్రతి బ్యాచ్‌లో 35 సీట్లు మాత్రమే ఉంటాయి.
-జాబ్ ట్రెయినింగ్ 100 శాతం ఇస్తారు.
-డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులు చేయడానికి అర్హులు కారు.
గమనిక: అంధులు, తీవ్రమైన మానసిక వైకల్యం, కుష్ఠు, తీవ్రవైకల్యం ఉన్నవారికి ఈ కోర్సులు చేయడానికి అవకాశం లేదు.
-దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్, 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డ్‌తో పాటు రిజిస్ట్రేషన్ కోసం 2017 నవంబర్ 30న సంస్థలో ఉదయం 10 గం. హాజరుకావాలి.
చిరునామా: డిప్యూటీ డైరెక్టర్ (రిహాబిలిటేషన్), నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఏటీఐ క్యాంపస్, విద్యానగర్, హైదరాబాద్
-వివరాలకు ఫోన్ నంబర్: 040-27427381


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎస్‌ఎఫ్‌లో 487 ఉద్యోగాలు,

కేంద్ర బలగాల్లో కొలువులు
-ఇంటర్ ఉత్తీర్ణులకు అవకాశం
-ఆకర్షణీయమైన జీతభత్యాలు
- పీఎస్‌టీ/పీఈటీ,రాతపరీక్ష ద్వారా ఎంపిక

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) దేశవ్యాప్తంగా రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్/ఫైర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CISF
-పోస్టు పేరు: కానిస్టేబుల్/ఫైర్
-మొత్తం ఖాళీల సంఖ్య- 487. వీటిలో రాష్ర్టాలు/యూటీ ప్రాంతాల్లో 332 పోస్టులు (జనరల్-169, ఓబీసీ-87, ఎస్సీ-47, ఎస్టీ-29). నక్సల్స్/తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 155 పోస్టులు (జనరల్-77, ఓబీసీ-41, ఎస్సీ-28, ఎస్టీ-9) ఖాళీలు ఉన్నాయి.
రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారీగా ఖాళీలు:
-తెలంగాణ- 28, ఆంధ్రప్రదేశ్- 34, అరుణాచల్ ప్రదేశ్-4, అసోం-28, బీహార్-69, ఛత్తీస్‌గఢ్-16, ఢిల్లీ-4, గుజరాత్-15, హర్యానా- 6, హిమాచల్‌ప్రదేశ్-2, జమ్ముకశ్మీర్- 12, జార్ఖండ్- 28, కర్ణాటక- 16, కేరళ- 8, మధ్యప్రదేశ్- 19, మహారాష్ట్ర-29, మణిపూర్-3, మేఘాలయా- 3, మిజోరం-1, నాగాలాండ్-1, ఒడిశా-29, పంజాబ్-7, రాజస్థాన్-17, తమిళనాడు-17, త్రిపుర-4, ఉత్తరప్రదేశ్-53, ఉత్తరాఖండ్-2, పశ్చిమ బెంగాల్-33
-పే స్కేల్: రూ. 21,700-69,100/- ఇతర డీఏ, హెచ్‌ఆర్‌ఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్ తదితరాలు ఉంటాయి.
-అర్హతలు: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018, జనవరి 11 నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి (1995, జనవరి 12 నుంచి 2000 జనవరి 11 మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు:
-ఎత్తు: 170 సెం.మీ., ఛాతీ: 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి (80 సెం.మీ.-85 సెం.మీ.)
-ఎస్టీ అభ్యర్థులైతే ఎత్తు-162.5 సెం.మీ.., ఛాతీ: 76 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి (77 సెం.మీ.-82 సెం.మీ.).
-బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయస్సుకు దామాషాగా ఉండాలి.
-దరఖాస్తు ఫీజు: రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు.
-అప్లికేషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్, ఎస్‌బీఐ చలానా ద్వారా
చెల్లించవచ్చు.
-ఎంపిక: పీఈటీ, పీఎస్‌టీ, రాతపరీక్ష ద్వారా.
-ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లో 24 నిమిషాల్లో 5 కి.మీ. పరుగు పందెం పూర్తిచేయాలి. ఇది కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే.
-పీఈటీలో అర్హత పొందిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని రాతపరీక్షకు
అనుమతిస్తారు.
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
-ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ, హిందీ/ఇంగ్లిష్‌లపై ప్రాథమిక పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషలో మాత్రమే ఉంటుంది. రెండు గంటల సమయంలో పరీక్షను పూర్తిచేయాలి.
-ఈ పరీక్షలో జనరల్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు-35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 33 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చిరునామా: DIG, CISF (South Zone), HQrs, Chennai.
-దరఖాస్తులకు చివరితేదీ: 2018 జనవరి 11
-వెబ్‌సైట్: https://cisfrectt.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఆర్‌యూఎంలో రిసెర్చ్ పోస్టులు,

న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ (సీసీఆర్‌యూఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు
ఆహ్వానిస్తున్నది.
CCRUM
వివరాలు
-మొత్తం పోస్టులు: 13
-రిసెర్చ్ అసోసియేట్ (యునానీ)- 9
-అర్హతలు: యునానీలో ఎండీ. సీసీఐఎం లేదా రాష్ట్ర ఆయుష్‌లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
-సీనియర్ రిసెర్చ్ ఫెలో (యునానీ)- 4
-అర్హతలు: యునానీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా బీయూఎంఎస్ చేసి ఉండాలి. నెట్ అర్హత సాధించినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు: 35 ఏండ్లలోపువారై ఉండాలి (రిసెర్చ్ అసోసియేట్‌కు 40 ఏండ్లు).
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రాతపరీక్ష.
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. అవసరమైన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ తేదీన సంబంధిత పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: రిసెర్చ్ అసోసియేట్‌కు నవంబర్ 25, సీనియర్ రిసెర్చ్ ఫెలోకి 29.
-వెబ్‌సైట్: http://ccrum.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడీఎఫ్‌డీలో రిసెర్చ్ స్కాలర్ పోగ్రామ్,
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) వివిధ శాస్ర్తాల్లో పరిశోధన చేయడానికి రిసెర్చ్ స్కాలర్ ప్రోగ్రామ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CDFD
వివరాలు: మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న సీడీఎఫ్‌డీ 1990లో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థ.
-కోర్సు పేరు: రిసెర్చ్ స్కాలర్ ప్రోగ్రామ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ లేదా సైన్స్, టెక్నాలజీ/అగ్రికల్చర్‌లో పీజీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/యూజీసీ లేదా డీబీటీ, ఐసీఎంఆర్, ఇన్‌స్పైర్ నెట్, జేఆర్‌ఎఫ్, యూజీసీ ఆర్‌జీఎన్‌ఎఫ్, జెస్ట్‌లో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు-రూ. 500, ఓబీసీ అభ్యర్థులు-రూ. 250, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు రూ. 125
-ఎంపిక విధానం: రాతపరీక్ష/సీడీఎఫ్‌డీ ల్యాన్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 8
-రాతపరీక్ష/సీడీఎఫ్‌డీ ల్యాన్ బేస్డ్ ఎగ్జామ్: 2018 జనవరి 21
-ఇంటర్వ్యూతేదీ: 2018 జనవరి 22
-వెబ్‌సైట్:www.cdfd.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సైంటిఫిక్ అసిస్టెంట్లు,

కాంచీపురంలోని భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Bhavini
వివరాలు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య: 14
(జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-4)
-విభాగాలవారీగా ఖాళీలు: హెల్త్‌ఫిజిక్స్-4, కెమిస్ట్రీ-2, ఎలక్ట్రికల్-3, మెకానికల్-4, ఇన్‌స్ట్రుమెంటేషన్-1
-అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ), పదోతరగతితోపాటు మూడేండ్ల డిప్లొమా (ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 నవంబర్ 24 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 35,400/-.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తులు: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.bhavini.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బీఎంఆర్‌సీఎల్‌లో సివిల్ ఇంజినీర్లు.

బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివరాలు
బీఎంఆర్‌సీ కేంద్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ.
bangalore-metro
-మొత్తం పోస్టులు: 80
-పోస్టు పేరు- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ (సివిల్)
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లలోపు ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.bmrc.co.in

0 comments:

Post a Comment