Monday, 27 November 2017

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 337 ఉద్యోగాలు, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్లు, ఇండియన్ ఆయిల్‌లో 470 అప్రెంటిస్‌లు, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు, జిప్‌మర్‌లో ఉద్యోగాలు, ఎన్‌జీఆర్‌ఐలో సైంటిస్టులు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 337 ఉద్యోగాలు,


ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో ఖాళీగా ఉన్న వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ అభ్యర్థులకు సదవకాశం.
-రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వూ ద్వారా ఎంపిక
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 12

BANK
వివరాలు: 1908లో మహారాజా హెచ్‌హెచ్ సర్ సాయాజీరావ్ గైక్వాడ్ స్థాపించారు. ప్రస్తుతం వడదోర ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 5451 బ్రాంచీ నెట్‌వర్క్‌ను, 24 ఓవర్సీస్‌లలో 106 విదేశీ శాఖలను కూడా కలిగి ఉన్నది.
-పోస్టు పేరు: వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్
-మొత్తం పోస్టుల సంఖ్య: 337
విభాగాల వారీగా ఖాళీలు
-గ్రూప్ హెడ్-4 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-1), ఆపరేషన్స్ హెడ్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి రెండేండ్ల ఎంబీఏలో ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో 10 ఏండ్ల అనుభవం ఉండాలి.
-టెర్రిటోరీ హెడ్-25 పోస్టులు
(జనరల్-13, ఓబీసీ-6, ఎస్సీ-4, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా రెండేండ్ల ఎంబీఏలో ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా ఆరేండ్లు/టీమ్ లీడ్‌గా రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్ల నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
-సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్-223 పోస్టులు (జనరల్-113, ఓబీసీ-60, ఎస్సీ-33, ఎస్టీ-17)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా రెండేండ్ల ఎంబీఏలో ఉత్తీర్ణత. పబ్లిక్/ప్రైవేట్, ఫారేన్ బ్యాంక్స్, బ్రోకింగ్, సెక్యూరిటీ ఫామ్స్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ (వెల్త్ మేనేజ్‌మెంట్) మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 23 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-యాక్సిసిషన్ మేనేజర్ (అఫ్లూఎంట్)-41 పోస్టులు (జనరల్-21, ఓబీసీ-11, ఎస్సీ-6, ఎస్టీ-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్ (పబ్లిక్/ప్రైవేట్, ఫారేన్ బ్యాంక్స్, బ్రోకింగ్, సెక్యూరిటీ ఫామ్స్, ఫైనాన్షియల్ సంస్థలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-క్లయింట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-43 పోస్టులు (జనరల్-23, ఓబీసీ-11, ఎస్సీ-6, ఎస్టీ-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. డాక్యుమెంటేషన్ అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
-వయస్సు: 20 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పైన పేర్కొన్న అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపికైన అభ్యర్థులు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, ముంబై, పుణె, కోల్‌కతా, కాన్పూర్, జైపూర్, బరోడా, సూరత్, లక్నో ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
గమనిక: ఫుల్‌టైమ్ రెండేండ్ల ఎంబీఏ ఉండాలి. డిస్టెన్స్, కరస్పాండెన్స్/పార్ట్ టైమ్‌లో ఎంబీఏ చేసిన అభ్యర్థులు అర్హులు కారు.
-ఆర్‌డీఏ సర్టిఫికేషన్/ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.100/- చెల్లించాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తప్పసరిగా ఎంటర్ చేయాలి.
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: డిసెంబర్ 12
-వెబ్‌సైట్: http://www.bankofbaroda.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు,
ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఖాళీగా ఉన్న పీహెచ్‌డీ రిసెర్చ్ (గ్రేడ్ బీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RBI
-పోస్టు పేరు: పీహెచ్‌డీ రిసెర్చ్ (గ్రేడ్ బీ)
-మొత్తం పోస్టుల సంఖ్య - 6 (జనరల్-3, ఓబీసీ-2, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ.
-వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 34 ఏండ్లకు మించరాదు..
-పే స్కేల్: రూ. 35,150-62,400/-. ఎంపికైన అభ్యర్థులు ప్రారంభ వేతనం నెలకు రూ. 82,745/- వరకు పొందవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.rbi.org.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్లు,

రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
raipur-aiims
వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య: 100 పోస్టులు (జనరల్-51, ఓబీసీ-27, ఎస్సీ-15, ఎస్టీ-7)
-పోస్టు పేరు: జూనియర్ రెసిడెంట్
-అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
-పే స్కేల్: రూ.15,600-39,100
+ గ్రేడ్ పే రూ. 5400/-
-అప్లికేషన్ ఫీజు: రూ.1000/- , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 800/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-ఇంటర్వ్యూతేదీ: డిసింబర్ 1
-వెబ్‌సైట్: www.aiimsraipur.edu.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆయిల్‌లో 470 అప్రెంటిస్‌లు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) నార్తర్న్ రీజియన్ పరిధిలోని మార్కెటింగ్ డివిజన్‌లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IOCL
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది
దేశంలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-పోస్టు: టెక్నీషియన్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు - 470. వీటిలో ట్రేడ్ అప్రెంటిస్‌లు-376, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు-94
-రాష్ర్టాల వారీగా ఖాళీలు: ఢిల్లీ- 58, హర్యానా-75, హిమాచల్‌ప్రదేశ్-17, జమ్ము కశ్మీర్-13, పంజాబ్-42, రాజస్థాన్-54, ఉత్తరప్రదేశ్-185, ఉత్తరాఖండ్-26 .
-వయస్సు: 2017, అక్టోబర్ 31 నాటికి 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.iocl.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు,
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ (కాంట్రాక్ విధానంలో)కి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ddugky
వివరాలు
-మొత్తం పోస్టులు: 15
విభాగాల వారీగా
-పీఎంఏ హెడ్- 1, డిప్యూటీ పీఎంఏ హెడ్- 3
-థీమాటిక్ ఎక్స్‌పర్ట్- 14
-ఇందులో స్ట్రాటజీ డెవలప్‌మెంట్, ఎంఐఎస్, కెపాసిటీ బిల్డింగ్, స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్, సోషల్ బ్రాండ్ మేనేజ్‌మెంట్, డాటా అనాలసిస్, ఫైనాన్స్, అసెస్‌మెంట్ అండ్ సర్టిఫికేషన్, ఐఈసీ అండ్ ఐసీటీ, రిసెర్చ్ అండ్ పాలసీ, ప్రొక్యూర్‌మెంట్ విభాగాల్లో ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 7
-అర్హత, వయస్సు, అనుభవం, ఎంపిక విధానం వంటి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.ddugky.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో ఉద్యోగాలు,
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్)లో రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
jipmer
మొత్తం ఖాళీలు - 4. విభాగాల వారీగా...
-రిసెర్చ్ సైంటిస్ట్ - 2, ల్యాబ్ టెక్నీషియన్ - 1, మల్టీటాస్క్ వర్కర్ - 1 ఖాళీ ఉన్నాయి.
-వయస్సు: రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు 40 ఏండ్లు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 30 ఏండ్లు, మల్టీ టాస్క్ వర్కర్‌కు 25 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుకు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్ లేదా మెడికల్ సబ్జెక్టుల్లో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత లేదా బీడీఎస్/బీవీఎస్సీ. ల్యాబ్ టెక్నీషియన్‌కు బీఎస్సీ ఎంఎల్‌టీ. మల్టీటాస్క్ పోస్టుకు మెట్రిక్/తత్సమాన కోర్సుతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: స్కిల్/రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: డిసెంబర్ 9
-వెబ్‌సైట్: http://www.jipmer.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌జీఆర్‌ఐలో సైంటిస్టులు.

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
csir
వివరాలు: ఎన్‌జీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో
పనిచేస్తున్న సంస్థ. దేశంలో భూభౌతిక పరిశోధనల కోసం దీన్ని 1961లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 17
-పోస్టు పేరు: సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియోఫిజిక్స్/ జియాలజీ లేదా జియోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ. రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 67,700-2,08,700/- (సీనియర్ సైంటిస్ట్‌కు 78,800-2,09,200/-)
-వయస్సు: 2017 జూన్ 30 నాటికి 32 ఏండ్లకు (సీనియర్ సైంటిస్ట్‌కు 37 ఏండ్లు) మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చిరునామా: CSIR-National Geophysical Research Institute, Uppal Road, Hyderabad-500007.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.ngri.org.in

0 comments:

Post a Comment