Thursday, 2 November 2017

ఇండియన్ ఆయిల్‌లో 221 ఉద్యోగాలు, జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో సమ్మర్ రిసెర్చ్ ఫెలోషిప్, లైఫ్‌సైన్సెస్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు, ఐఐఎస్‌ఈలో నాన్‌టీచింగ్ పోస్టులు, రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్స్ ఉద్యోగాలు.

ఇండియన్ ఆయిల్‌లో 221 ఉద్యోగాలు,

బీఈ/బీటెక్, పీజీ,ఎంబీబీఎస్ అభ్యర్థులకు అవకాశం
-దేశంలో ఎక్కడైనా చేరవచ్చు
-ఆయిల్ కంపెనీలో ఉద్యోగం
-రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరితేదీ:నవంబర్ 18

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) వివిధ రీజియన్/డివిజన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, హెచ్‌ఆర్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IOCL
వివరాలు: 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇండియా ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 221
-బాయిలర్ ఆపరేషన్స్ ఇంజినీర్ -33 పోస్టులు
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) మార్కులతో నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఉత్తీర్ణత. బాయిలర్ ఇంజినీర్స్ సర్టిఫికెట్ ఉండాలి. థర్మల్ పవర్‌లో ఏడాదిపాటు అనుభవం ఉండాలి. 32 ఏండ్లకు మించరాదు.
-క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ -44 పోస్టులు
-అర్హత: కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలోని కెమిస్ట్రీ సబ్జెక్టులో 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిసెర్చ్ అండ్ ల్యాబొరేటరీలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 32 ఏండ్లకు మించరాదు.
-ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్-50 పోస్టులు
-అర్హత: ఫైర్ లేదా సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) మార్కులతో నాలుగేండ్ల బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్‌లో ఏడాదిపాటు అనుభవం ఉండాలి. 32 ఏండ్లకు మించరాదు.
-మెడికల్ ఆఫీసర్ -19 పోస్టులు (జనరల్ సర్జన్-4, అనెస్థిటిస్ట్స్, గైనకాలజిస్ట్-2, జనరల్ ఫిజీషియన్స్/ఓహెచ్ స్పెషలిస్ట్-8, కార్డియాలజిస్ట్-1, ఆర్థోపెడిక్ సర్జన్-1)
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు పీజీ (డిగ్రీ/డిప్లొమా) లేదా ఎండీ, ఎంఎస్ ఉండాలి. జనరల్ మెడిసిన్ రంగంలో నాలుగేండ్ల అనుభవం ఉండాలి. 32 ఏండ్లకు మించరాదు.
-హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ -50 పోస్టులు
-అర్హత: రెండేండ్ల మాస్టర్ డిగ్రీ/పీజీ లేదా ఎంబీఏ లేదా హెచ్‌ఆర్‌ఎం, ఐఆర్, లేబర్ వెల్ఫేర్‌లో పీజీ డిప్లొమాలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్లపాటు అనుభవం ఉండాలి. 28 ఏండ్లకు మించరాదు.
-అసిస్టెంట్ హిందీ ఆఫీసర్ -19 పోస్టులు
-అర్హత: ఎంఏ (హిందీ/ఇంగ్లిష్)లో ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌లో లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ట్రాన్స్‌లేషన్ స్థాయిలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 30 ఏండ్లకు మించరాదు.
-గ్రేడ్ సీ మేనేజర్ (అడ్వాన్స్‌డ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్ Optimization)-6 పోస్టులు
-అర్హత: కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత రంగలో అనుభవం ఉండాలి. 36 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: గ్రేడ్ సీ పోస్టులకు 1000/- (జనరల్ , ఓబీసీ), మిగతా పోస్టులకు రూ. 300/- (జనరల్ , ఓబీసీ). ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-పే స్కేల్ : గ్రేడ్ సీ పోస్టులకు రూ. 32,900-58,000/-, మిగతా పోస్టులకు రూ. 24,900 -50,500/-
గమనిక: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
-ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-రాత పరీక్షను న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో నిర్వహిస్తారు. వివిధ రీజియన్ /డివిజన్‌లో వచ్చిన అప్లికేషన్ సంఖ్యను బట్టి ఎగ్జామినేషన్ సెంటర్ల సంఖ్య పెరగవచ్చు/తగ్గవచ్చు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చిరునామా: The Advertiser, Post Box No. 3098, Lodhi Road, Head Post Office, New Delhi 110 003
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 18
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: నవంబర్ 25
-రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 10
-గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తేదీ: 2018 జనవరిలో

-వెబ్‌సైట్: www.iocl.com and www.iocrefrecruit.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో సమ్మర్ రిసెర్చ్ ఫెలోషిప్,
బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైటిఫిక్ రిసెర్చ్ (జేఎన్‌సీఏఎస్‌ఆర్) సమ్మర్ రిసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్-2018కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
jncsarok
రిసెర్చ్ అంశాలు
-లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్, మ్యాథమెటిక్స్
-అర్హతలు:
-లైఫ్ సైన్సెస్: బీఎస్సీ, బీఎస్, బీఈ, బీటెక్ చదువుతున్నవారు, ఎంఎస్సీ మొదటి ఏడాదిలో ఉన్నవారు అప్లయ్ చేయవచ్చు.
-కెమికల్ సైన్సెస్: బీఎస్-ఎమ్మెస్ నాలుగో ఏడాది, ఎమ్మెస్సీ ఫస్టియర్ చదువుతున్నవారు.
-ఫిజికల్, ఇంజినీరింగ్ సైన్సెస్, మ్యాథమెటిక్స్: బీఎస్సీ, బీఎస్, బీఈ లేదా బీటెక్ ఫస్టియర్ చేస్తున్నవారు మినహా, ఎమ్మెస్సీ ఫస్టియర్, ఇంటిగ్రే టెడ్ ఎమ్మెసీ చదువుతున్నవారు.
-కోర్సు కాలపరిమితి: 2 నెలలు. ఈ సమయంలో నెలకు రూ. 6000లు స్టయిఫండ్‌గా చెల్లిస్తారు.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఈ-మెయిల్ ఐడీ- Srfp@jncasr.ac.in ద్వారా పంపాలి.
-దరఖాస్తుల డౌన్‌లోడ్‌కు చివరితేదీ: నవంబర్ 30
-దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.jncasr.ac.in/fe/srfp.php

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లైఫ్‌సైన్సెస్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ (ఐఎల్‌ఎస్) 2018-19 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iols
వివరాలు:
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం
-విభాగాలు: ఇన్‌ఫెక్టియస్ డిసీజ్ బయాలజీ, క్యాన్సర్ బయాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, జెనెటిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ప్లాంట్ మైక్రోబయాల్ బయోటెక్నాలజీ
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమెస్సీ, ఎంటెక్, ఎంవీఎస్సీలో ఉత్తీర్ణత. గేట్ లేదా సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్/లెక్చర్‌షిప్, ఐసీఎంఆర్/డీబీటీ-జేఆర్‌ఎఫ్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్‌ను కలిగి ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ : నవంబర్ 30
-ఇంటర్వ్యూ తేదీ: 2018 జనవరి 10 నుంచి
12 వరకు
-వెబ్‌సైట్: www.ils.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు,
ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ సైంటిస్ట్, జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIH-ROORKEE 
వివరాలు
-మొత్తం ఖాళీల సంఖ్య-9
-రిసెర్చ్ సైంటిస్ట్-5 పోస్టులు
-రిసోర్స్ పర్సన్ (జూనియర్)-1 పోస్టు
-జూనియర్ రిసెర్చ్ ఫెలో-2 పోస్టులు
-రిసెర్చ్ అసోసియేట్-1 పోస్టు
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఎంఈ/ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ. నెట్/గేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 లేదా 40 ఏండ్లు మించరాదు. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులతోపాటు పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
-వెబ్‌సైట్: www.nihroorkee.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈలో నాన్‌టీచింగ్ పోస్టులు,
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
iiser 
-మొత్తం పోస్టులు: 28
పోస్టుల వారీగా వివరాలు
-సూపరింటెండింగ్ ఇంజినీర్- 1, డిప్యూటీ రిజిస్ట్రార్- 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్- 1 
-టెక్నికల్ అసిస్టెంట్- 9 
-అర్హత:ఎమ్మెసీ (ఫిజిక్స్,కెమిస్ట్రీ) 
-జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 1 
-జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- 4 
అర్హతలు: బీఎస్సీ లేదా బీటెక్ 
ఆఫీస్ అసిస్టెంట్- 6 
అర్హతలు: డిగ్రీ లేదా సెక్రటేరియల్ లేదా కమర్షియల్ ప్రాక్టీస్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. 
జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్)- 2
అర్హతలు: ఎలక్ట్రికల్, సివిల్ లో బీఈ లేదా బీటెక్
అటెండెంట్- 2 , డిప్యూటీ లైబ్రేరియన్- 1
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరితేదీ: నవంబర్ 24
వెబ్‌సైట్: www.iisertvm.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్స్ ఉద్యోగాలు.

మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) సివిల్ విభాగంల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ (వర్కింగ్ ప్రొఫెషనల్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RITES 
వివరాలు
-మొత్తం పోస్టుల సంఖ్య: 23
-జాయింట్ జనరల్ మేనేజర్-3 పోస్టులు
-డిప్యూటీ జనరల్ మేనేజర్-5 పోస్టులు
-ఇంజినీర్ (సివిల్)-15 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: నవంబర్ 14
-వెబ్‌సైట్: www.rites.com

0 comments:

Post a Comment