Sunday, 12 November 2017

రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు, వర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో పీహెచ్‌డీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌లో ఉద్యోగాలు, సీడీఎస్‌ఈ -2018, ఎంవోఐఎల్‌లో జూనియర్ స్టెనోలు, వ్యాప్కోస్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు,

బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
wheel-RAIL
వివరాలు:
1961 అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.
-అప్రెంటిస్- 192
విభాగాలవారీగా ఖాళీలు:
-ఫిట్టర్- 85 (జనరల్-43, ఓబీసీ-23, ఎస్సీ-13, ఎస్టీ-6)
-ఎలక్ట్రీషియన్- 18 (జనరల్-9, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1)
-ఎలక్ట్రానిక్ మెకానిక్- 22 (జనరల్-11, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-2)
-మెషినిస్ట్- 31 (జనరల్-16, ఓబీసీ-8, ఎస్సీ-5, ఎస్టీ-2)
-మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8 (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-టర్నర్- 5 (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
-సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్- 23 (జనరల్-12, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 నవంబర్ 29 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: 1961 అప్రెంటిస్ యాక్ట్, 1992 యాక్ట్ ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు కలిగి ఉండాలి.
-ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
చిరునామా: Office of the Chief Personnel Officer, Rail Wheel Factory, Yelahanka, Bangalore- 560 064.
-చివరితేదీ: నవంబర్ 29
-వెబ్‌సైట్: www.rwf.indianrailways.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో పీహెచ్‌డీ,


యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా 2018-19 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
calcutta-university
వివరాలు:
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం
-విభాగాలు: బయోఫిజిక్స్, మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/యూజీసీ జేఆర్‌ఎఫ్/నెట్ లేదా నెట్/స్లెట్‌లో అర్హత సాధించాలి. ఎంఫిల్ అభ్యర్థులకు రాతపరీక్ష ఉండదు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 13
-రాతపరీక్ష తేదీ:
నవంబర్ 15
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 6 నుంచి
-వెబ్‌సైట్: http://www.caluniv.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెనస్ కౌన్సిల్ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
-ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్- 1 
-అర్హత: బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేండ్ల అనుభవం ఉండాలి.
-అడ్మిన్ ఆఫీసర్- 1 
-అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేండ్ల అనుభవం ఉండాలి.
-మేనేజర్ (టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అండ్ కమర్షియలైజేషన్)- 1 పోస్టు
-అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్, సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: నవంబర్ 27.

-వెబ్‌సైట్: http://www.birac.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడీఎస్‌ఈ -2018,
త్రివిధ దళాలైన మిలిటరీ, నేవీ, ఎయిర్‌పోర్స్‌లలో ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) (I)-2018 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
Air-Force
వివరాలు:త్రివిధ దళాల్లో ఉన్నత హోదా ఉద్యోగాలు. చాలెంజింగ్ కెరీర్ కావాలనుకొనే వారికి ఇదొక సువర్ణావకాశం. ఏటా రెండుసార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వాటి వివరాలు సంక్షిప్తంగా...
-మొత్తం ఖాళీల సంఖ్య - 414. వీటిలో..
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)- 32
ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్)- 100
-వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 13.
ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల)- 45
-వీటిలో ఎన్‌సీసీ- సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 6.
ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై)- 225
-ఇవి పురుష అభ్యర్థులకు మాత్రమే. వీటిలో
ఎన్‌సీసీ- సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 50.
ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై)- 12
-ఇవి నాన్ టెక్నికల్, మహిళా అభ్యర్థులకు మాత్రమే.
విద్యార్హతలు
-ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) అండ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఇండియన్ నేవల్ అకాడమీ: ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లో ఉత్తీర్ణత.
-ఎయిర్‌ఫోర్స్ అకాడమీ: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
Air-Force1
-వయస్సు: 2019, జనవరి 1 నాటికి 20 - 24 ఏండ్ల మధ్య (1995, జనవరి 2 నుంచి 1999, జనవరి 1 మధ్య జన్మించాలి) ఉండాలి.
నోట్: అభ్యర్థులు అవివాహితులై ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ. ఎత్తు (ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ., నేవీకి 157 సెం.మీ.), ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-ఫిజికల్ కండీషనింగ్: రన్నింగ్ - 15 నిమిషాల్లో 2 - 4 కి.మీ. పరుగెత్తాలి.
-ఫుషప్స్-సిటప్స్- కనీసం 20, చిన్‌అప్స్- కనీసం 8, రోప్ ైక్లెంబింగ్- 3 నుంచి 4 మీటర్లు.
-ఫీజు: రూ. 200/-, ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపికవిధానం:
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండే ప్రశ్నపత్రంలో మ్యాథ్స్ పదోతరగతి స్థాయిలో ఉంటుంది.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్
-ఇవి రెండు దశల్లో ఉంటాయి. స్టేజ్- 1లో అర్హత సాధించిన వారికి స్టేజ్- 2లోకి అనుమతిస్తారు.
-స్టేజ్- 1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి.
-స్టేజ్- 2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్‌లు ఉంటాయి.
-అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, సైకాలజిస్ట్‌లు పరీక్షిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు తదితర పట్టణాల్లో
శిక్షణ వివరాలు:
-వైద్యపరీక్షల అనంతరం శిక్షణకు ఎంపికచేస్తారు.
-అభ్యర్థులు ఎంచుకున్న విభాగాల (పోస్టులు)ను బట్టి ఆయా అకాడమీల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో రూ. 21,000 స్టయిఫండ్ ఇస్తారు.
-ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)- డెహ్రాడూన్‌లో 18 నెలలపాటు, ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)- ఎజిమల నేవల్ ఓరియంటేషన్‌లో 44 వారాలు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ- హైదరాబాద్ (దుండిగల్) 74 వారాలు ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ- చెన్నైలో 49 వారాలు శిక్షణ ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 4
-పరీక్ష తేదీ: 2018 ఫిబ్రవరి 4
-వెబ్‌సైట్: www.upsconline.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంవోఐఎల్‌లో జూనియర్ స్టెనోలు,

నాగ్‌పూర్‌లోని ఎంవోఐఎల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ స్టెనో, నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
moil-limited
వివరాలు: మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ పరిధిలో పనిచేస్తున్న ఎంవోఐఎల్ లిమిటెడ్‌ను గతంలో మాంగనీస్ ఓర్ (ఇండియా) అని పిలిచేవారు. ఇది ఒక మినీరత్న కంపెనీ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 16
-చీఫ్ (సర్వే)- 1
-అసిస్టెంట్ మేనేజర్ (సర్వే)- 1
-అర్హత: డిగ్రీతోపాటు సర్వేయర్ సర్టిఫికెట్ లేదా మైనింగ్/మైనింగ్ సర్వేయింగ్‌లో డిప్లొమా /సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: మేనేజర్‌కు 44 ఏండ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 28 ఏండ్లకు మించరాదు.
-జూనియర్ స్టెనో- 5
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల టైపింగ్ సామర్థ్యం, మూడేండ్ల అనుభవం ఉండాలి.
-నర్స్ మిడ్‌వైఫ్ (గ్రేడ్-2)- 9
-అర్హత: పదోతరగతితోపాటు నర్స్ మిడ్‌వైఫరీ సర్టిఫికెట్, సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా. జూనియర్ స్టెనో పోస్టులకు స్కిల్‌టెస్ట్ ఉంటుంది.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్
-చివరితేదీ: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.moil.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వ్యాప్కోస్‌లో ఇంజినీర్లు  ఉద్యోగాలు.

జార్ఖండ్ (రాంచి)లోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (వ్యాప్కోస్)లో వివిధ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Wapcos 
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 14
-ఇంజినీర్-4 
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సివిల్ విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జూనియర్ సర్వేయర్-7 
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్/సర్వేయింగ్‌లో 60 శాతం మార్కులతో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత, రెండేండ్ల అనుభవం ఉండాలి. 
-డ్రాప్ట్స్‌మెన్-3 
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఇంటర్/10+2 తోపాటు సివిల్ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌లో ఐటీఐ (60 శాతం మార్కులతో) ఉత్తీర్ణత, మూడేండ్ల అనుభవం ఉండాలి. 
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Project Manager WAPCOS Limited , H. No.-147, Old A. G. Colony, Kadru, P.O.-Doranda, Ranchi-834002, Jharkhand 
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 13

-వెబ్‌సైట్: www.wapcos.gov.in

0 comments:

Post a Comment