Thursday, 2 November 2017

ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు, నైసర్‌లో పీహెచ్‌డీ ప్రో గ్రామ్, ఓయూలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ కన్సల్టెంట్లు ఉద్యోగాలు, టీ బోర్డులో ఇంటర్వ్యూలు, కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు, యూ సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలు, హెక్సాగన్‌లో సాఫ్ట్‌వేర్ అనలిస్ట్ ఉద్యోగాలు, నీట్ పీజీ,ఎండీఎస్-2018.

ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు,

రాజస్థాన్ (రావత్‌భట్)లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NPCILL
వివరాలు:
ఎన్‌పీసీఐఎల్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పని చేస్తున్న సంస్థ. దీన్ని 1987, సెప్టెంబర్ 17న స్థాపించారు.
- పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
- మొత్తం ట్రేడ్‌ల సంఖ్య: 60
(జనరల్-30, ఓబీసీ-12, ఎస్సీ-10, ఎస్టీ-8)
విభాగాలవారీగా ఖాళీలు:
- ఫిట్టర్-12, టర్నర్-9, మెషినిస్ట్-9, ఎలక్ట్రీషియన్-12, ఎలక్ట్రానిక్ మెకానిక్-12, వెల్డర్-3, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)-3
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత (వెల్డర్ పోస్టులకు ఎనిమిదో తరగతి)తోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐని పూర్తిచేసి ఉండాలి. 137 సెం.మీ ఎత్తు, 25.4 కేజీల బరువు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
- వయస్సు: 14 - 24 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: ఐటీఐ అకడమిక్ మార్కులు
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 10
- వెబ్‌సైట్: www.npcilcareers.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

నైసర్‌లో పీహెచ్‌డీ ప్రో గ్రామ్,

భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (2018 వింటర్ సెషన్)లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NISER-MHRD 
వివరాలు:
- కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం 
(2018 వింటర్ సెషన్)
- విభాగాలు: స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్, 
- స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో సంబంధిత మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. గేట్ స్కోర్, సీఎస్‌ఐఆర్-యూజీసీనెట్, జీప్యాట్, జెస్ట్, ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించాలి.
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
- స్టయిఫండ్: మొదటి రెండేండ్లు రూ. 25,000/- , ఆ తర్వాత మూడేండ్లు రూ. 28,000/- స్కాలర్‌షిప్ ఇస్తారు.
- ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 24, 27, 28, డిసెంబర్ 1,2,7,8,19,20
- క్లాస్‌లు ప్రారంభం: 2018 జనవరి నుంచి 
- దరఖాస్తులకు చివరితేదీ:నవంబర్ 6
- వెబ్‌సైట్:www.niser.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఓయూలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం జేఆర్‌ఎఫ్‌ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
OSMANIA 
- జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
- ఖాళీల సంఖ్య - 2
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (జువాలజీ లేదా యానిమల్ సైన్స్/వైల్డ్‌లైఫ్ బయాలజీ) ఉత్తీర్ణతతోపాటు నెట్ అర్హత ఉండాలి.
- జేఆర్‌ఎఫ్ కాలవ్యవధి - మూడేండ్లు
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: నవంబర్ 10
- ఫీజు: రూ. 200/- 
- వెబ్‌సైట్: www.osmania.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్  కన్సల్టెంట్లు ఉద్యోగాలు,

ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ జూనియర్, అసోసియేట్, నోడల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
EdCIL 
వివరాలు:
ఈడీసీఐఎల్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్. ఇది మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న మినీరత్న కంపెనీ.
- పోస్టులు: కన్సల్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) - 1, అసోసియేట్ కన్సల్టెంట్ (కంప్యూటర్ సిస్టం) - 1, అసోసియేట్ కన్సల్టెంట్ (ప్రొక్యూర్‌మెంట్) -1, నోడల్ ఆఫీసర్/కన్సల్టెంట్ (అకడమిక్/ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్) - 4, నోడల్ ఆఫీసర్/కన్సల్టెంట్ (ఫైనాన్స్) - 5 ఖాళీలు ఉన్నాయి.
- దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 30
- వెబ్‌సైట్: http://edcilindia.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీ బోర్డులో ఇంటర్వ్యూలు,

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని టీ బోర్డు ఆఫ్ ఇండియా కింది ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
tea-board-of-india 
- పోస్టులు : సైంటిస్ట్ (మైక్రోబయాలజిస్ట్) - 1, ఫీల్డ్ ఎక్స్‌పర్ట్ (కెపాసిటీ బిల్డింగ్ సెంటర్) - 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (మైక్రోబయాలజీ) - 1, అకౌంటెంట్ - 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
- ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూతేదీలు: నవంబర్ 14, 15
- వెబ్‌సైట్: http://www.teaboard.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు,
పోస్టు: ప్రోగ్రామర్ ట్రెయినీ
- డొమైన్: అప్లికేషన్ సర్వీసెస్
- అర్హతలు: బీఎస్సీ (కంప్యూటర్‌సైన్స్/ఐటీ), బీసీఏలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2016, 2017లో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
- ఎంపిక: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: రెజ్యూమేను పంపాలి.
- చివరితేదీ: నవంబర్ 3

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూ సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలు,
వొడాఫోన్ అనుబంధ సంస్థ యూ బ్రాడ్‌బ్యాండ్‌లో సేల్స్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
వివరాలు: 
యూ బ్రాడ్‌బ్యాండ్ టెలికం/ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డొమైన్‌లో పనిచేస్తుంది.
- పోస్టు: బ్రాడ్‌బ్యాండ్ స్పెషలిస్ట్ (సేల్స్ ఆఫీసర్)
- అర్హతలు: బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎం, బీఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులతో 2016/2017లో ఉత్తీర్ణత.
- ఎంపిక: రాతపరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెక్సాగన్‌లో సాఫ్ట్‌వేర్ అనలిస్ట్ ఉద్యోగాలు,
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ హెక్సాగన్‌లో సాఫ్ట్‌వేర్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
- పోస్టు: సాఫ్ట్‌వేర్ అనలిస్ట్
- అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో (సీఎస్‌ఈ, ఐటీ, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ) 2017లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు.
- సీటీసీ: రూ. 4.75 లక్షలు
- ఎంపిక: రాతపరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: రెజ్యూమే అప్‌లోడ్ చేయాలి
- వెబ్‌సైట్: https://www.task.telangana.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నీట్ పీజీ,ఎండీఎస్-2018.

న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష-2018 ద్వారా ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, పీజీ డిప్లొమా వైద్య కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NEET-ENTRANCE 
వివరాలు:
సింగిల్ విండో ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ -నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ద్వారా దేశంలోని వైద్య విద్యాలయాల్లోని వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. 
- నీట్ ఎండీఎస్-2018
- ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీలో ప్రవేశం కల్పిస్తారు.
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీడీఎస్ ఉత్తీర్ణత. బీడీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
- నీట్ పీజీ-2018 
- ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత. 2018 మార్చి చివరితేదీలోపు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
- ఈ ఎంట్రెన్ పరీక్ష ద్వారా దేశంలోని యూనివర్సిటీ/డీమ్డ్ యూనివర్సిటీ కళాశాల, ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో అడ్మిషన్‌ను కల్పిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ.3,750/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు-రూ. 2750/-
- ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ ) ఆధారంగా. 
- నీట్ పీజీ ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష . ఈ పరీక్షకు కేటాయించిన సమయం 3 గంటల 30 నిమిషాలు.
- పరీక్షలో 300 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరియైన జవాబుకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 1200 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
- మొత్తం 300 ప్రశ్నల్లో అనాటమీ-15, ఫిజియాలజీ-15, బయోకెమిస్ట్రీ-15, ఫార్మకాలజీ-20, మైక్రోబయాలజీ-20, పాథాలజీ-25, ఫోరెన్సిక్ మెడిసిన్-10, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్-25, మెడిసిన్ డెర్మటాలజీ అండ్ వినిరియోలజీ-37, సర్జరీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్ అండ్ అనెస్థీయాలజీ-16, రేడియోడయాగ్నసిస్ అండ్ రేడియోథెరపీ-12, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-25, ఆప్తాల్మాలజీ-10, సైకియాట్రి-10 శాతం వెయిటేజీ చొప్పున ప్రశ్నలను ఇస్తారు.
- నీట్ ఎండీఎస్ ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష. ఈ పరీక్షకు కేటాయించిన సమయం 3 గంటలు.
- పరీక్షలో 240 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరియైన జవాబుకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 960 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
- మొత్తం 240 ప్రశ్నల్లో ఓరల్ పాథాలజీ అండ్ ఓరల్ మైక్రోబయాలజీ-15, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ-15 జనరల్ అనాటమీ (ఎంబ్రియాలజీ, హిస్టాలజీ), జనరల్ హ్యూమన్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, డెంటల్ అనటామీ, ఎంబ్రియాలజీ అండ్ ఓరాలజీ, జనరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, జనరల్ అండ్ డెంటల్ ఫార్మకాలజీ, డెంటల్ మెటీరియల్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పెడోడెంటిక్స్ ప్రివెంటివ్ డెస్టినీ, ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫెషియల్ సర్జరీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీలో తదితరాల అంశాలు ఉన్నాయి. ప్రతి విభాగం నుంచి 14 శాతం వెయిటేజీ చొప్పున ప్రశ్నలను ఇస్తారు.
- పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్‌తోసహా మొత్తం 128 సెంటర్లలో నీట్ పీజీ పరీక్ష, హైదరాబాద్, వైజాగ్‌తో సహా 29 సెంటర్లలో నీట్ ఎండీఎస్ పరీక్ష నిర్వహిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా 
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 27
- ఎంట్రెన్స్ టెస్ట్: 2018, జనవరి 7
- ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల: 
2018 జనవరి 31
- వెబ్‌సైట్: www.nbe.edu.in

0 comments:

Post a Comment