Wednesday, 22 November 2017

హెచ్‌ఎన్‌ఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు, ఆర్‌ఐఎస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బీఎస్‌ఎఫ్‌లో పారామెడికల్ పోస్టులు, ధార్వాడ్ ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, సీహెచ్‌ఎస్‌ఎల్ - 2017.

హెచ్‌ఎన్‌ఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు,
కొట్టాయంలోని హిందూస్థాన్ పేపర్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న హిందూస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్(హెచ్‌ఎన్‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
hnl
వివరాలు: అప్రెంటిస్ 1973 యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
మొత్తం ఖాళీల సంఖ్య: 12 (సివిల్-2, ఎలక్ట్రికల్-2, ఇన్‌స్ట్రుమెంటేషన్-2, మెకానికల్-4, కెమికల్-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ ( సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కెమికల్)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: నెలకు రూ. 4984/-
-ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
-ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అభ్యర్థులు బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ కోసం వెబ్‌సైట్ (www.mhrdnats.gov.in)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
చిరునామా: Assistant Manager, Training Section,
-Hindustan Newsprint Limited,
-Newsprint Nagar, Kottayam, Kerala-686616
-చివరితేదీ: నవంబర్ 25
-వెబ్‌సైట్:www.hnlonline.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఆర్‌ఐఎస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
న్యూఢిల్లీలోని రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలప్‌మెంట్ కంట్రీస్ (ఆర్‌ఐఎస్) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ris 
వివరాలు: 
ఆర్‌ఐఎస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తిగల సంస్థ
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్-2 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్) పాటు, పీహెచ్‌డీ. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.ris.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్‌ఎఫ్‌లో పారామెడికల్ పోస్టులు,
గృహ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్‌ఎఫ్ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
bsf 
వివరాలు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశ ఐదు సాయుధ పోలీస్ దళాలల్లో ఒకటి. దీన్ని 
డిసెంబర్ 1, 1965న ఏర్పాటు చేశారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 33
-ఎస్‌ఐ (స్టాఫ్ నర్స్)-2 ఖాళీలు 
-అర్హత: ఇంటర్‌తోపాటు జనరల్ నర్సింగ్‌లో డిప్లొమా/డిగ్రీ. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వంఉండాలి.
-వయస్సు: 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఏఎస్‌ఐ (ఫార్మాసిస్ట్)-21 ఖాళీలు 
-అర్హత: ఇంటర్‌తోపాటు ఫార్మసీలో డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణత. ఫార్మసీ కౌన్సిల్‌లో రిజస్టర్ చేసుకొని ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు:18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-కానిస్టేబుల్ (కెహర్)-10 ఖాళీలు
-అర్హత: మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల 
అనుభవం ఉండాలి. 
-వయస్సు:18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 28
-వెబ్‌సైట్: http://bsf.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ధార్వాడ్ ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్,
ధార్వాడ్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2017-18 అకడమిక్ ఇయర్‌కు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iit 
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: బయోసైన్స్ అండ్ బయో ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ విభాగానికి 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్, బేసిక్ సైన్సెస్ విభాగానికి 60 శాతం మార్కులతో ఎంఫిల్/ఎంటెక్ లేదా బీటెక్/బీఈ లేదా ఎమ్మెస్సీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి ఎంఫిల్/ఎంఏ లేదా తత్సమాన పరీక్షలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గేట్/నెట్, సీఎస్‌ఐఆర్/యూజీసీ జేఆర్‌ఎఫ్ లేదా నెట్ లెక్చరర్‌షిప్, ఎన్‌బీహెచ్‌ఎం, డీబీటీ, ఐసీఏఆర్, ఐసీఎంఆర్, ఐసీపీఆర్, పీఎంఆర్‌ఎఫ్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్ ఫెలోషిప్‌లో అర్హతను సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు రూ.100/-) 
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సూచించిన ఫార్మాట్‌లోనే పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 3
-వెబ్ సైట్: http://www.iitdh.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీహెచ్‌ఎస్‌ఎల్ - 2017.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్
-3259 కేంద్ర కొలువులు 
-స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపిక
-ఇంటర్ అభ్యర్థులకు అవకాశం
-మూడంచెల విధానంలో భర్తీ (టైర్ -1, 2, 3) 
-ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు

ssc 
దేశంలో భారీగా కొలువులు భర్తీచేసే పరీక్షల్లో ఒకటి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్ (10+2)) నోటిఫికేషన్. దీన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 
వివరాలు: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్‌డీసీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ స్థాయి పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్ ద్వారా భర్తీ చేస్తుంది. 
-భర్తీ చేసే పోస్టులు: డాటా ఎంట్రీ ఆపరేటర్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 2018, ఆగస్టు 1 నాటికి విద్యార్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-నోట్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్‌స్థాయిలో సైన్స్ స్ట్రీమ్ (మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి) చదివి ఉండాలి.
-వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1991, ఆగస్టు 2 నుంచి 2000, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. టైర్ -1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. టైర్ - 2 డిస్క్రిప్టివ్. టైర్ - 3లో టైపింగ్/స్కిల్‌టెస్ట్. 
-స్టెప్ -1లో టైర్ -1 ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 
-స్టెప్ - 2లో టైర్ - 2 ఎగ్జామ్. ఇది డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. 100 మార్కులకు, ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
-స్టెప్ -3లో టైర్ - 3 ఎగ్జామ్. ఇది స్కిల్/టైపింగ్ టెస్ట్. టైర్ -2లో క్వాలిఫై అయిన వారికి దీన్ని నిర్వహిస్తారు.
టైర్ - 1 ఎగ్జామ్: 
-ఈ పరీక్షలో నాలుగు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్ -1 జనరల్ ఇంటెలిజెన్స్. పార్ట్ -2 ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్). పార్ట్ - 3 జనరల్ అవేర్‌నెస్.
-ప్రతి పార్ట్ నుంచి 25 ప్రశ్నలు. ప్రతి పార్ట్‌కు 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. 
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
-ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీలో ఉంటాయి.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కుల కోత విధిస్తారు.
టైర్ - 2 ఎగ్జామ్:
-ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఆఫ్‌లైన్ (పెన్, పేపర్ పద్ధతి)లో ఉంటుంది.
-ఇది 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. 
-ఈ పరీక్షలో 200 -250 పదాలతో లెటర్స్/ అప్లికేషన్ రైటింగ్ ఉంటుంది. 
-టైర్ -2 క్వాలిఫయింగ్ మార్కులు 33 శాతం. ఈ పేపర్ హిందీ/ ఇంగ్లిష్‌లో ఏదైనా ఒక భాషలో రాయాల్సి ఉంటుంది.
టైర్ - 3 ఎగ్జామ్: 
-స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్.
-ఇది క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే
-కంప్యూటర్‌పై గంటకు 8,000 కీ డిప్రెషన్స్ వేగంతో డాటా ఎంట్రీ చేయాలి. అంటే 15 నిమిషాల్లో ఇంగ్లిష్‌లో 2000 -2,200 స్ట్రోక్స్/కీ డిప్రెషన్స్‌తో ఇచ్చిన విషయాన్ని తప్పు లేకుండా టైప్ చేయాల్సి ఉంటుంది.
-కాగ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు గంటకు 15000 కీ డిప్రెషన్స్ తగ్గకుండా టైపింగ్ చేయాలి.
-టైపింగ్ టెస్ట్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ/జూనియుర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఉంటుంది.
-నోట్: ఫైనల్ మెరిట్ లిస్ట్ టైర్ - 1, 2లో అభ్యర్థులకు వచ్చిన స్కోర్ ఆధారంగా చేస్తారు.
-పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పేబ్యాండ్ - 1 (5,200- 20,200) + గ్రేడ్ పే రూ. 2,400/-
-డాటా ఎంట్రీ ఆపరేటర్: పేబ్యాండ్ - 1 (5,200- 20,200) + గ్రేడ్ పే రూ. 2,400/-
-ఎల్‌డీసీ/జూనియుర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: పేబ్యాండ్ - 1 (5,200- 20,200) + గ్రేడ్ పే రూ. 1,900/-

-మొత్తం ఖాళీల సంఖ్య - 3259
-డాటా ఎంట్రీ ఆపరేటర్ - 2
-లోయర్ డివిజన్ క్లర్క్ - 898
-పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్ - 2359

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- 
-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
-చివరితేదీ: డిసెంబర్ 18
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
-టైర్ -1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్) - 2018, మార్చి 4 నుంచి 26 వరకు. 
-టైర్ - 2 (డిస్క్రిప్టివ్ పేపర్) - 2018, జూలై 8
-వెబ్‌సైట్: http://ssc.nic.in


0 comments:

Post a Comment