Tuesday, 7 November 2017

హెచ్‌ఐఎల్‌లో కెమికల్ ఇంజినీర్లు, ఆర్మమెంట్స్ టెక్నీషియన్ పోస్టులు, అంబేద్కర్ యూనివర్సిటీలో రిసెర్చ్ అసిస్టెంట్, స్కిల్ ఓరియంటెడ్ ట్రెయినింగ్, సీవీఆర్‌డీఈలో 146 ఉద్యోగాలు, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు, ఇండియన్ ఆర్మీలో టెక్ని కల్ ఎంట్రీ స్కీమ్,

హెచ్‌ఐఎల్‌లో కెమికల్ ఇంజినీర్లు,

కేరళలోని హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిడెట్ ఖాళీగా ఉన్న కెమికల్ ఇంజినీర్ (మూడేండ్ల వరకు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
hil
వివరాలు:
ఇది భారత ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ.
- పోస్టు పేరు: కెమికల్ ఇంజినీర్
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కెమికల్ ఫ్యాక్టరీలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- పే స్కేల్: రూ. 20,000/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
- ఎంపిక: ఇంటర్వ్యూ/రాతపరీక్ష
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Deputy General Manager (HR &Admn),
Hindustan Insecticides Limited,
Udyogamandal P.O, Eloor,
Ernakulam District, Kerala State, PIN-683
- చివరితేదీ: నవంబర్ 25
- వెబ్‌సైట్: www.hil.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మమెంట్స్ టెక్నీషియన్ పోస్టులు,

జబల్‌పూర్‌లోని సీనియర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఆర్మమెంట్స్) అండ్ ఎల్‌పీఆర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sqae
వివరాలు:
ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (డీజీక్యూఏ) పరిధిలో పనిచేస్తుంది.
- మొత్తం పోస్టుల సంఖ్య : 29
- టెక్నీషియన్-25 పోస్టులు (ఎస్‌ఎస్-1, ఎస్‌కె-24)
- అర్హత: మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
- సివిలియన్ మోటార్ డ్రైవర్-3 పోస్టులు
- అర్హత: మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతిలో ఉత్తీర్ణత. హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- ఫైర్‌మ్యాన్-1
- అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతితోపాటు జనరల్ ఫైర్ ఫైటింగ్ కోర్సులో సర్టిఫికెట్/నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ (నాగ్‌పూర్) నుంచి సర్టిఫికెట్ పొంది ఉండాలి.
- వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక : రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్.
- చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా.
- వెబ్‌సైట్ : www.davp.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేద్కర్ యూనివర్సిటీలో రిసెర్చ్ అసిస్టెంట్,
ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టు: రిసెర్చ్ అసిస్టెంట్
- ఖాళీల సంఖ్య - 3
- పేస్కేల్: నెలకు రూ. 25,000/-
- అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఇంగ్లిష్, ఎకనామిక్స్, హిస్టరీ, సైకాలజీ, సోషియాలజీ, మ్యాథమెటిక్స్‌లో ఏదైనా ఒక సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత.
- పనిచేయాల్సిన ప్రదేశం: న్యూఢిల్లీ
- దరఖాస్తు: సీవీని acadservices@ aud. ac.in అడ్రస్‌కు మెయిల్ చేయాలి.
- చివరితేదీ: నవంబర్ 11
- వెబ్‌సైట్: http://aud.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్కిల్ ఓరియంటెడ్ ట్రెయినింగ్,

దక్షిణక్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షణ సంస్థ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్, ఇతర అగ్రికల్చరల్ మెషినరీలపై స్కిల్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
skill-oriented
వివరాలు:
అనంతపురం జిల్లా, గార్లదిన్నెలోని ఈ సంస్థ భారత ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.
- కోర్సులు: ట్రాక్టర్ ఆపరేటర్, హార్వెస్టింగ్ మెషిన్ ఆపరేటర్, అగ్రికల్చరల్ మెషినరీ ఆపరేటర్, ఇరిగేషన్ సర్వీస్ టెక్నీషియన్, ఆపరేటర్ - రిపేర్, త్రెషర్ అండ్ క్రాప్ రెసిడ్యూ మెషినరీ, సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఫార్మ్ మెషినరీ, అగ్రికల్చరల్ మెషినరీ డెమాన్‌స్ట్రేటర్, ట్రాక్టర్ మెకానిక్, ఫార్మ్ వర్క్‌షాప్ ఫోర్‌మెన్/సూపర్‌వైజర్, ఫార్మ్ వర్క్‌షాప్/సర్వీస్ మేనేజర్, అగ్రికల్చరల్ మెషినరీ, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడర్.
- అర్హతలు: ఆయా కోర్సులకు పదోతరగతి నుంచి బీఈ/బీటెక్ వరకు ఉన్నాయి. వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
నోట్: రైతులు, గ్రామీణ యువత, టెక్నీషియన్లు, ఎన్‌జీవోలు, ఎక్స్‌టెన్షన్ వర్కర్లు, మెషినరీ ఆపరేటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు: 18 -40 ఏండ్ల మధ్య ఉండాలి.
- స్టయిఫండ్: ప్రవేశం పొందినవారికి రోజుకు రూ. 175/- చెల్లిస్తారు. ఆర్డినరీ క్లాస్ ప్రయాణానికి రానుపోను చార్జీలు చెల్లిస్తారు. బోర్డింగ్ చార్జీలను అభ్యర్థులే భరించాలి.
- ఫోన్: 08551-286441
- వెబ్‌సైట్:http://srfmtti.dacnet.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీవీఆర్‌డీఈలో 146 ఉద్యోగాలు,

చెన్నైలోని కంబాట్ వెహికిల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CVRDE 
వివరాలు:
సీవీఆర్‌డీఈ అనేది డీఆర్‌డీవో పరిధిలో పనిచేస్తుంది.
- మొత్తం ఖాళీల సంఖ్య: 146
- విభాగాలవారీగా ఖాళీలు: ఆటో ఎలక్ట్రీషియన్-2, కార్పెంటర్-3, కోపా (కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-35, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)-10, ఎలక్ట్రీషియన్-20, ఫిట్టర్-35, మెషినిస్ట్-13, మెకానిక్ (మోటార్ వెహికిల్)-15, టర్నర్-7, వెల్డర్ (జీ అండ్ ఈ)-6
వివరాలు:
- విద్యార్హతలు: ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
- శిక్షణ కాలం: కార్పెంటర్ రెండేండ్లు, మిగిలిన ట్రేడ్స్ ఏడాది శిక్షణ కాలం. 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.
- ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 30/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళాలకు ఫీజు లేదు.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
- స్టయిఫండ్: కోపా, వెల్డర్ ట్రేడ్‌లకు రూ. 8609/-, కార్పెంటర్‌కు మొదటి ఏడాదికి రూ. 8609/-, రెండో ఏడాదికి రూ. 9008/-మిగిలిన ట్రేడులకు రూ. 9008/- 
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 24

- వెబ్‌సైట్: https://rac.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు,
కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- ప్రొఫెసర్ (ప్రొడ్యూసింగ్/ఎడిటింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా-2, సౌండ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా-1)
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (వీడియోగ్రఫీ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా-1, రైటింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా-1, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మేనేజ్‌మెంట్-1)
- బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్-1, ప్రొడక్షన్ మేనేజర్-1, ఎలక్ట్రీషియన్- 2
- అర్హత: డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
- చివరితేదీ: నవంబర్ 16

- వెబ్‌సైట్:http://srfti.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆర్మీలో టెక్ని కల్ ఎంట్రీ స్కీమ్,

ఇండియన్ ఆర్మీ (ఐఏ) పర్మినెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ జూలై 2018కు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ARMY
- కేవలం ఇంటర్‌లో ఉత్తీర్ణత.
- దేశ రక్షణలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం.
- చదువు + శిక్షణ + ఉద్యోగం
- చాలెంజింగ్ కెరీర్, మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన అలవెన్స్‌లు
- చివరితేదీ: నవంబర్ 29

వివరాలు:
భారతదేశాన్ని అనుక్షణం రక్షించే దళాలలో ఇండియన్ ఆర్మీ ఒకటి. ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షిండంతోపాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం.
- పోస్ట్ పేరు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (10+2 )
- మొత్తం ఖాళీల సంఖ్య: 90
- అర్హతలు: సెంట్రల్ బోర్డ్/ స్టేట్ బోర్డ్ నుంచి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 70 శాతం మార్కులతో ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- వయస్సు: 16 1/2 నుంచి 19 1/2 ఏండ్ల మధ్య ఉండాలి (1999 జనవరి 1 నుంచి 2002 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి)
- దేహదారుఢ్య ప్రమాణాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీస్తారు. అభ్యర్థులు కనీసం 157.5 సెం,మీ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
- పే అండ్ అలవెన్స్‌లు: ట్రెయినింగ్ పీరియడ్‌లో రూ.56,100/-.శిక్షణ పూర్తయ్యాక వారు లెఫ్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.15,600-1,77,500/- జీతం ఉంటుంది. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
- నాలుగేండ్ల మిలిటరీ ట్రెయినింగ్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను పర్మినెంట్ కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో తీసుకుంటారు.
- ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్ ద్వారా.
- సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) నిర్ణయం మేరకు అభ్యర్థులు పంపిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఈ-మెయిల్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు.
- అర్హత పొందిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ /టెస్ట్‌లను రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తుంది.
- ఇంటర్వ్యూ వేదిక : సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ/టెస్ట్‌లను వరుసగా ఐదు రోజులపాటు భోపాల్, బెంగళూర్, అలహాబాద్, కపుర్తలాలో నిర్వహిస్తారు.
- శిక్షణ: మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు జూలై 2018 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తును పంపేటప్పుడు నిర్ణీత నమూనాలో సర్టిఫికెట్స్, ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్‌చేయాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
- చివరితేదీ: నవంబర్ 29
- వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

0 comments:

Post a Comment