Wednesday, 22 November 2017

గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు 127, హెచ్‌పీసీఎల్ రిసెర్చ్ అసోసియేట్స్ ఉద్యోగాలు, ఎన్‌జీఆర్‌ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఈసీఐఎల్‌లో స్పెషల్ డ్రైవ్ ఉద్యోగాలు, ఐఐఎం ఫెలో ప్రోగ్రామ్ , నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు, ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలు.

గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు 127,
పదోతరగతి ఉత్తీర్ణులకు అవకాశం
-పోస్టల్ శాఖ పరిధిలో కొలువు
-చివరితేదీ డిసెంబర్ 19

వివరాలు: తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
india-post
-పోస్టు: గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్ బీపీఎం, జీడీఎస్ ఎంసీ)
-జీడీఎస్ బీపీఎం పే స్కేల్: రూ. 2745 - 50 - 4245
-జీడీఎస్ ఎంసీ పే స్కేల్: రూ. 2295 - 50 - 4245
-మొత్తం ఖాళీల సంఖ్య - 127. వీటిలో జనరల్ - 65, ఓబీసీ - 30, పీహెచ్ -హెచ్‌హెచ్ - 3, పీహెచ్‌సీ - ఓహెచ్ - 2, ఎస్సీ - 18, ఎస్టీ - 9 ఉన్నాయి.
-ఈ పోస్టులన్నీ ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్నాయి.
-వయస్సు: 2017, నవంబర్ 20 నాటికి 18 - 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత. అదనపు అర్హతలను పరిగణనలోకి తీసుకోరు. పదోతరగతి పరీక్షలను సప్లమెంటరీలో (రెండో ప్రయత్నంలో) పాసైన వారి కంటే మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులైనవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-కంప్యూటర్ నాలెడ్జ్: గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 60 రోజులపాటు కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై శిక్షణ తీసుకొన్న సర్టిఫికెట్ ఉండాలి లేదా ఇంటర్ లేదా ఉన్నత చదువుల్లో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నవారికి ప్రత్యేక సర్టిఫికెట్ అవసరం లేదు.
-నివాసం: జీడీఎస్ - బీపీఎం తప్పనిసరిగా ఎంపికైన బ్రాంచి పోస్ట్ ఆఫీస్ ఉన్న గ్రామంలో నివాసం ఉండాలి.(నెలలోగా నివాసం ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాలి)
నోట్: ఎంపికైన అభ్యర్థులు సెక్యూరిటీ బాండ్ కింద రూ. 25వేలు/10 వేల బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
-ఎంపిక విధానం: పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు సమయంలో పదోతరగతి సర్టిఫికెట్, కంప్యూటర్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, పీహెచ్‌సీ సర్టిఫికెట్ (ఉన్నవారు), ఫొటో, సంతకాన్ని ఆన్‌లైన్‌లో జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 19
-ఫీజు: ఓసీ/ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ. 100/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
వివరాల కోసం Help Desk number for Telangana Circle : 040-23463639 All queries of candidates may be mailed to tlglwegds2017 @ gmail.com and queries related towebsite may be given to dopgdsenquiry@gmail.com
-వెబ్‌సైట్: https://indiapost.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌పీసీఎల్ రిసెర్చ్ అసోసియేట్స్ ఉద్యోగాలు,

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిసెర్చ్ అసోసియేట్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
hp 
వివరాలు: హెచ్‌పీసీఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఒక నవరత్న కంపెనీ.
-పోస్టు: రిసెర్చ్ అసోసియేట్
-అర్హత: పీహెచ్‌డీలో కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్ లేదా ఎనర్జీ స్టడీస్/ బయో సైన్సెస్ లేదా ఎంటెక్ కెమికిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్
-వయస్సు: 2017, నవంబర్ 20 నాటికి 32 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలక పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
నోట్: ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-ఎంపిక: ఉన్నత విద్యార్హతలు, అనుభవం, రాతపరీక్ష 
-స్టయిఫండ్: నెలకు రూ. 50,000 - 60,000/- వరకు ఇస్తారు. 
-పోస్టు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-అర్హతలు: బీఎస్సీ కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్/పెట్రోలియం రిఫైనింగ్
-వయస్సు: 2017, నవంబర్ 20 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష 
-స్టయిఫండ్: నెలకు రూ. 30,000 - రూ. 40,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 11

-వెబ్‌సైట్: http://www.hindustanpetroleum.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌జీఆర్‌ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు,
సీఎస్‌ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
csir 
వివరాలు:ప్రస్తుత ఖాళీలు ఎన్‌జీఆర్‌ఐలోని పలు ప్రాజెక్టుల్లో (గ్రాంట్ ఇన్ ఎయిడ్, స్పాన్సర్డ్ ప్రాజెక్ట్, ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్‌లో) ఉన్నాయి.
-పోస్టు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్ - II)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీలో జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా అప్లయిడ్ జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, జియాలజీ, రిమోట్ సెన్సింగ్‌లో ఉత్తీర్ణత.
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ (ఆర్ -1) పోస్టుకు - జియోఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్ -II)కు - నెలకు రూ. 25,000/-
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (R- I) - పోస్టుకు - నెలకు రూ. 48,200/-
-వయస్సు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్ - II)కు 30 ఏండ్లు మించరాదు.
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఆర్ - I)కు 40 ఏండ్లు మించరాదు. 
నోట్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ 
-ఇంటర్వ్యూతేదీ: 2017, డిసెంబర్ 21 (ఉదయం 8.30 నుంచి)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 4

-వెబ్‌సైట్: http://www.ngri.org.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో స్పెషల్ డ్రైవ్ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ECIT 
వివరాలు: ఈసీఐఎల్ భారత ప్రభుత్వ సంస్థ. ఇది అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది.
-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్) - 1, జనరల్ మేనేజర్ (పీ అండ్ ఏ) - 1, క్యాంటీన్ ఆఫీసర్ - 1
స్పెషల్ డ్రైవ్‌లో భర్తీ చేసే పోస్టులు:
-సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 1, అకౌంట్ ఆఫీసర్ - 2, పర్సనల్ ఆఫీసర్ - 2 పోస్టులు ఉన్నాయి. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 25 నుంచి ప్రారంభం
-చివరితేదీ: డిసెంబర్ 11

-వెబ్‌సైట్: http://careers.ecil.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం ఫెలో ప్రోగ్రామ్ ,
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
IIM
-ప్రోగ్రామ్: ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
-స్పెషలైజేషన్స్: ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఓఎం అండ్ క్యూటీ, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్స్.
-స్టయిఫండ్: నెలకు రూ. 27,000 - 33,000/ వరకు ఇస్తారు. వీటితోపాటు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గ్రాంట్ కింద రూ. 2 లక్షలు, కంటింజెన్సీ గ్రాంట్ రూ. లక్ష, ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2018, జనవరి 28
-వెబ్‌సైట్: www.iimidr.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NIT 
-పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం ఖాళీల సంఖ్య - 81. (ఎస్సీ - 8, ఎస్టీ - 7, ఓబీసీ - 21, జనరల్ - 45)
-పేస్కేల్: కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే వాటికి రూ. 15,600 - 39,100 + ఏజీపీ రూ. 6,000/-
-రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే వాటికి రూ. 15,600 - 39,100 + ఏజీపీ రూ. 8,000/-
-అర్హతలు: పీహెచ్‌డీ ఉత్తీర్ణత. గ్రేడ్ పే రూ. 7,000/- ఉన్న పోస్టులకు పీహెచ్‌డీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. రెగ్యులర్ పోస్టులకు పీహెచ్‌డీతోపాటు కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-విభాగాలు: ఇంజినీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)
-చివరితేదీ: 2017, డిసెంబర్ 27

-వెబ్‌సైట్: http://nitkkr.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలు.
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIT 
-పోస్టు: రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ (గ్రేడ్ - 2) - 1 ఖాళీ
-పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 5,400/-
-రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ (గ్రేడ్ -1) - 2 పోస్టులు
-పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 6,600/- 

-వెబ్‌సైట్: www.iitk.ac.in

0 comments:

Post a Comment