Sunday, 12 November 2017

10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, మేనేజ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్‌లు, డీఆర్‌డీవో-చెస్‌లో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు, సీసీఐలో ఐటీ ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలు, టాటా మెమోరియల్‌లో ఉద్యోగాలు.

10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్,

భారత నావికాదళంలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) కింద నాలుగేండ్ల
డిగ్రీ కోర్సు చేయడానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఎజిమల (కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ నోటిఫికేషన్ విడుదలచేసింది.
-ఇండియన్ నేవీలో అవకాశం
- ఇంటర్ మార్కులు+జేఈఈ మెయిన్ స్కోర్‌తో ఎంపిక
-చదువు+శిక్షణతో ఉద్యోగం
-చివరితేదీ: నవంబర్ 30

INDIAN-NAVY
వివరాలు: నావికా దళంలో 10 +2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇంటర్ అభ్యర్థులను తీసుకుంటారు. ఈ కోర్సు 2018 జూలైలో ప్రారంభమవుతుంది.
-వయస్సు: 1999, జనవరి 2 నుంచి 2001, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమాన పరీక్ష/మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ (ఎస్సెస్సీ/ఇంటర్‌స్థాయి)లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. జేఈఈ మెయిన్-2017 ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
శారీరక ప్రమాణాలు:
-ఎత్తు- కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి.
-ఎంపిక: జేఈఈ మెయిన్- 2017 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ:
-షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు బెంగళూరు, భోపాల్, కోయంబత్తూరు, విశాఖపట్నంలలో 2018 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
-ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది.
-స్టేజ్-1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని స్టేజ్- 2కు ఎంపిక చేస్తారు.
-స్టేజ్- 2లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ (నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు)
-స్టేజ్- 2లో అర్హత సాధించిన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు.
నోట్: మొదటిసారి ఇంటర్వ్యూకు హాజరైనవారికి
ఏసీ థర్డ్ క్లాస్ ప్రయాణ చార్జీలు ఇస్తారు.
-శిక్షణ: మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు జూలై 2018 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.
-ఆల్ ఇండియా మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులను కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)/ మెకానికల్ ఇంజినీరింగ్ (నేవల్ ఆర్క్‌టెక్చర్‌తోపాటు ఇంజినీరింగ్ బ్రాంచ్) లేదా బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్ బ్రాంచ్)లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ బీటెక్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.
-శిక్షణ సమయంలో ఉచితంగా పుస్తకాలు, రీడింగ్ మెటీరియల్, దుస్తులు, భోజన సౌకర్యాలను ఇండియన్ నేవీ సమకూరుస్తుంది.
పేస్కేల్ + పదోన్నతులు:-సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. అనంతరం కమాండర్ స్థాయి వరకు పదోన్నతులను పొందవచ్చు.
-సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు సుమారుగా రూ. 83,448-96,204/-జీతం వస్తుంది. ఈ ప్రాథమిక పేలో డీఏ, గ్రేడ్ పే, మిలిటరీ సర్వీస్ పే, హౌస్ రెంటల్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు కలిపి ఉంటాయి. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తును పంపేటప్పుడు నిర్ణీత నమూనాలో సర్టిఫికెట్స్, ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్‌చేయాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మేనేజ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) ఖాళీగా ఉన్న మేనేజ్ ఫెలో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ (ఏడాది వ్యవధికి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
manage
వివరాలు: మేనేజ్‌ను 1987లో ఏర్పాటుచేశారు. ఈ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రెయినింగ్, కన్సల్టెన్సీ, మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, రిసెర్చ్, సమాచార సేవల గురించి 
మెలకువలను నేర్పిస్తారు.
-ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్- 1
-మేనేజ్ ఫెలో- 1
-అర్హత: ఎంబీఏ, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్‌లో 
డాక్టరేట్. సంబంధిత విభాగంలో అనుభవం.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: మేనేజ్ ఫెలోకు రూ. 56,000/-, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌కు రూ. 50,000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 27

-వెబ్‌సైట్: www.manage.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్‌లు,
రాజస్థాన్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) వివిధ ట్రేడ్‌లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Hindustan-cooper
వివరాలు
-మొత్తం ఖాళీల సంఖ్య: 129
విభాగాల వారీగా ఖాళీలు
-మైనింగ్ మేట్- 12 (జనరల్-7, బీసీ -2, ఎస్సీ -2, ఎస్టీ- 1)
-కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు
-కంప్యూటర్ అండ్ పెరిఫెరల్ హార్డ్‌వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్- 2
-వైర్‌మ్యాన్- 3
-పై రెండు కోర్సుల కాలవ్యవధి: రెండేండ్లు
-టర్నర్- 5 (జనరల్-4, బీసీ -1)
-ఫిట్టర్- 23 (జనరల్-13, బీసీ-4, ఎస్సీ-4, ఎస్టీ-2)
-ఎలక్ట్రీషియన్- 40
(జనరల్-21, బీసీ-8, ఎస్సీ-6, ఎస్టీ-5)
-ఎలక్ట్రానిక్ మెకానిక్- 10 (జనరల్-6, బీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 1
-డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 2
-వెల్డర్- 10 (జనరల్-6, బీసీ-2,ఎస్సీ -1, ఎస్టీ-1)
-డీజిల్ మెకానిక్- 8
(జనరల్-5, బీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 6 (జనరల్-4, బీసీ-1, ఎస్సీ-1)
-కేబుల్ జాయింటర్- 3
-ఆటో ఎలక్ట్రీషియన్- 2
-పై కోర్సుల కాలవ్యవధి రెండేండ్లు.
-అర్హతలు: 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా.
-ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నిబంధనల ప్రకారం స్టయిఫండ్ చెల్లిస్తారు.
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.hindustancopper.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవో-చెస్‌లో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో-సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DRDO-CHESS
వివరాలు: సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్) అనేది డీఆర్‌డీవో పరిధిలో పనిచేస్తుంది. 
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్- 1
-అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌తో పాటు నెట్/గేట్‌లో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్-1 
-అర్హత: పీజీతోపాటు పీహెచ్‌డీ (ఇంజినీరింగ్ అండ్ సైన్స్), ఎంఈ/ఎంటెక్‌లోతోపాటు 
ఆప్టికల్ సెన్సార్, ఆప్టికల్ సిస్టమ్‌లో అనుభవం. 
-వయస్సు: రిసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏండ్లు, జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ ( రిసెర్చ్ అసోసియేట్‌కు రూ. 40,000+హెచ్‌ఆర్‌ఏ)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
చిరునామా: DLOMI, DRDO township, Kanchanbagh, Hyderabad-500058
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 19, 20

-వెబ్‌సైట్: www.drdo.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు,
చెన్నైలోని కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
kpl
వివరాలు :కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌ను గతంలో ఎన్నార్ పోర్ట్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఇది మినీరత్న కంపెనీ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 13
-చీఫ్ మేనేజర్ (డాక్‌మాస్టర్)- 1
-సీనియర్ మేనేజర్ (పైలట్)- 10 
-అర్హతలు: విదేశాలకు వెళ్లే నౌకలు నడిపే 
అనుమతి పత్రం పొంది, పైలట్ లైసెన్స్‌తోపాటు, పైలట్‌గా అనుభవం ఉండాలి. 
-జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హెచ్‌ఎస్‌ఈ)- 1 
-అర్హతలు: సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్
-జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్)- 1
-అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పోస్టుద్వారా పంపిచాలి. 
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 26

-వెబ్‌సైట్: www.ennoreport.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఐలో ఐటీ ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలు,
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఖాళీగా ఉన్న ఐటీ ఎక్స్‌పర్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
Competition-Commission
వివరాలు..
ఖాళీల సంఖ్య- 3
-పోస్టుపేరు: ఐటీ ఎక్స్‌పర్ట్స్ (లెవల్-3, 2, 1)
-అర్హతలు: లెవల్-3 పోస్టుకు.. బీటెక్ (ఐటీ లేదా సీఎస్), ఎంసీఏ లేదా ఐటీలో పీజీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి. 
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 7

-వెబ్‌సైట్: www.cci.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టాటా మెమోరియల్‌లో  ఉద్యోగాలు.

ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
tata-memorial-hospital
వివరాలు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తిగల సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 8 (రిసెర్చ్ కో ఆర్డినేటర్-1, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్-7
-అర్హత: స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా 
-చివరి తేదీ: నవంబర్ 20

-వెబ్‌సైట్ :https://tmc.gov.in

0 comments:

Post a Comment