Monday, 2 October 2017

ఆర్‌సీఐలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఐఆర్‌డీఏలో మేనేజర్లు ఉద్యోగాలు, డీఐఏటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు. JRF jobs in RCI,Manager jobs in IRDA,DIAT Recruitment For Assistant Professors.

ఆర్‌సీఐలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలుహైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
డీఆర్‌డీవో పరిధిలో ఆర్‌సీఐ పనిచేస్తుంది.
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్
-ఖాళీల సంఖ్య-18 (ఈసీఈ-6, ఈఈఈ-6, మెకానికల్-4, సీఎస్‌ఈ-2, ఫిజిక్స్-1, కెమిక ల్ ఇంజినీరింగ్/మెటీరియల్ సైన్స్/కెమిస్ట్రీ-1)
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీతోపాటు గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో సంబంధిత బ్రాంచీ లేదా ఎమ్మెస్సీ (ఫిజిక్స్) లేదా తత్సమాన కోర్సుతోపాటు నెట్/స్లెట్ లేదా గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
-కాలపరిమితి: మొదట రెండేండ్ల కాలపరిమితికి తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటారు.
-వయస్సు: 2017, అక్టోబర్ 31 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు సడలింపు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్
-చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్: www.rcilab.in
DRDO


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఆర్‌డీఏలో మేనేజర్లు
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

వివరాలు:
దేశంలోని బీమా, బీమా కంపెనీలను ప్రోత్సహించడం, క్రమబద్ధీకరించడం కోసం హైదరాబాద్‌లో 1999లో దీన్ని స్థాపించారు.
-పోస్టు పేరు: మేనేజర్
-విభాగాలు: అక్చ్యురియల్, ఎఫ్ అండ్ ఏ, ఇన్వెస్టిమెంట్స్, లైఫ్/నాన్‌లైఫ్, ఐటీ, లీగల్
-మొత్తం ఖాళీల సంఖ్య-29 (గ్రేడ్‌బీ మేనేజర్-12, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-10, డిప్యూటీ జనరల్ మేనేజర్-5, జనరల్ మేనేజర్-2)
-అర్హత: ఏదైనా డిగ్రీ, అక్చ్యురియల్, ఏసీఏ, ఏఐసీడబ్ల్యూ, ఏసీఎస్, సీఎంఏ, సీఎఫ్‌ఏ, ఎల్‌ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణత. సంబంధిత ఇన్సూరెన్స్ రంగంలో అనుభవం, కంప్యూటర్ ఆపరేషన్స్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను ప్రింట్ తీసి పర్సనల్ అధికారికి పంపాలి.
-అడ్రస్: The Executive Director (Gen), Insurance Regulatory and Development Authority of India, 3rd Floor, Parishrama Bhavan,
Bashirbagh, Hyderabad 500004.
-చివరితేదీ: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: www.irdai.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఐఏటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఫుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ) మెకానికల్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
డీఐఏటీ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 3
-అర్హత: గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్, మెకట్రానిక్స్, మెరైన్ ఇంజినీరింగ్, షిప్ డైనమిక్స్, షిప్ ట్రిబలాజీ, హీట్ అండ్ మాస్ ట్రాన్స్‌ఫర్, థర్మల్ ఇంజినీరింగ్‌లో పీజీతోపాటు, పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ . 50,900/- (కన్సాలిడేటెడ్ పే)
గమనిక : రెసిడెన్షియల్ వసతి ఉన్నది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తుతోపాటు అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Joint Registrar (Admin),Defence Institute of Advanced Technology, Girinagar, Pune-411025
-చివరితేదీ: అక్టోబర్ 20
-వెబ్‌సైట్:www.diat.ac.in

0 comments:

Post a Comment