Sunday, 15 October 2017

సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలు, ఐఐటీ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్, నేషనల్ హైవేలో కొలువులు, ఐఐటీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, నిట్ ఫ్యాకల్టీ పోస్టులు, ఐఐటీ టెక్నికల్ సూపరింటెండెంట్లు, ఐఐటీ తిరుపతి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.

సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలు,
విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక్ స్కూల్‌లో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
maxresdefault
- రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం
- రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- 6,9 తరగతుల్లో ప్రవేశాలు
- ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
వివరాలు:
మిలిటరీ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌ను అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులను విద్యాపరంగా, శారీరకంగా, మానసికంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రమాణాలకు సరిపోయే రీతిలో సంసిద్ధులను చేస్తారు.
- ప్రవేశాలు కల్పించే తరగతులు: ఆరు, తొమ్మిది
- నోట్: కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆరోతరగతి:
- సీట్ల సంఖ్య - 80
- విద్యార్థులు 2007, జూలై 2 నుంచి 2008, జూలై 1 మధ్య (ఆ రెండు రోజులు కలుపుకొని) జన్మించి ఉండాలి.
తొమ్మిదో తరగతి:
- విద్యార్థులు 2004, జూలై 2 నుంచి 2005, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- సీట్ల సంఖ్య - 20
- కరికులమ్: సీబీఎస్‌ఈ 10+2 విద్యావిధానంలో విద్యను అందిస్తారు.
- ఎంపిక: ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ద్వారా
ఎంపిక చేస్తారు.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ.
- స్కాలర్‌షిప్స్: ప్రతిభ/ తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా డిఫెన్స్ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
- రిజర్వేషన్లు: మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు,
7.5 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. మిగిలిన
సీట్లలో 67 శాతం సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లకు దేశంలోని అన్ని రాష్ర్టాల, యూటీ అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు. రక్షణశాఖలో పనిచేసిన వారి పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయిస్తారు.
- నోట్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగినంతగా లేనిపక్షంలో ఆ సీట్లను జనరల్ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్/ ఆన్‌లైన్‌లో (అక్టోబర్ 16 నుంచి ప్రారంభం, నవంబర్ 30 చివరితేదీ)
- దరఖాస్తు ఫీజు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే జనరల్/డిఫెన్స్ విద్యార్థులు రూ. 400/-, ఎస్సీ, ఎస్టీలు రూ. 250/- చెల్లించాలి.
- ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేవారు జనరల్/డిఫెన్స్ విద్యార్థులు రూ. 450/-, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. 300/ చెల్లించాలి.
- చివరితేదీ: పూర్తిచేసిన దరఖాస్తులను 2017, డిసెంబర్ 5 నాటికి కింది చిరునామాకు చేరేలా పంపాలి.
- ప్రిన్సిపాల్, సైనిక్‌స్కూల్,
కోరుకొండ, విజయనగరం - 535214
పూర్తి వివరాల కోసం 08922-246119 &
246168 లేదా
- వెబ్‌సైట్: www.sainikschoolkorukonda.org లో సంప్రదించవచ్చు----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్,

ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iit-indore

వివరాలు:
ఐఐటీ ఇండోర్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ.
- పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్
- ఈ పోస్టులను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు కేటాయించారు.
- విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెంటర్ ఆఫ్ ఆస్ట్రానమీ, సెంటర్ ఆఫ్ బయోసైన్సెస్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ స్టడీస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత అంశం/బ్రాంచీలో పీహెచ్‌డీతోపాటు మంచి అకడమిక్, రిసెర్చ్ రికార్డు కలిగి ఉండాలి. పీహెచ్‌డీ తర్వాత కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. అనుభవం లేని వారిని మూడేండ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకొని తర్వాత రెగ్యులర్ చేసే అవకాశం ఉన్నది.
- పేస్కేల్: కనీస వేతనం నెలకు రూ. 30,000/- (రూ. 15,600 - 39,100)
- కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకొనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పేబ్యాండ్ -3తో జీతం చెల్లిస్తారు.
- వయస్సు: 35 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- వెబ్‌సైట్: http://iiti.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ హైవేలో కొలువులు,
నేషనల్ హైవే అథారిటీ సివిల్ ఇంజినీరింగ్, ఐటీ విభాగంలో కొలవుల భర్తీకి నోటిఫికేషన్స్‌ను విడుదల చేసింది.
NHAI
వివరాలు:
ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలోనిది. ఇది ఒక స్వతంత్ర సంస్థ.
- డిప్యూటీ మేనేజర్లు
- నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 40 డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టు: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
- ఖాళీల సంఖ్య - 40
- పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 5,400/-
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: 2017, నవంబర్ 30 నాటికి 30 ఏండ్లు మించరాదు.
- పనిచేయాల్సిన ప్రదేశం: దేశంలో ఏ ప్రాంతంలోనైనా
- ఎంపిక: గేట్ స్కోర్ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్ 28
- పోస్టు: డిప్యూటీ మేనేజర్ (ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ)
- అర్హత: బీఈ/బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్/ఐటీ
- వయస్సు: 2017, నవంబర్ 30 నాటికి 35 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: గేట్ స్కోర్ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 30
- వెబ్‌సైట్: www.nhai.org----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు,
పాలక్కడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
palakkad 
పోస్టుల వివరాలు:
- రిజిస్ట్రార్ - 1
- పేబ్యాండ్ -4, జీపీ - రూ. 10,000/-
- జూనియర్ ఇంజినీర్ (సివిల్) - 1
- పేబ్యాండ్ - 2, జీపీ - రూ. 4,200/-
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సిస్టం) - 2
- పేబ్యాండ్ - 2, జీపీ - రూ, 4,200/-
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సివిల్ ఇంజినీరింగ్) - 1
- పేబ్యాండ్ - 2, జీపీ - రూ. 4,200/-
- జూనియర్ టెక్నీషియన్ (సివిల్ ఇంజినీరింగ్) -1
- పేబ్యాండ్ - 1, జీపీ- రూ. 2000/-
- అర్హతలు, వయస్సు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 10

- వెబ్‌సైట్: http://turing.iitpkd.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్ ఫ్యాకల్టీ పోస్టులు,
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NIT-Trichy
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 11
- హార్డ్‌కాపీని దాఖలు చేయడానికి
చివరితేదీ: నవంబర్ 21
- వెబ్‌సైట్: www.nitt.edu----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ టెక్నికల్ సూపరింటెండెంట్లు,
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
iitbL-bombay
వివరాలు:
ఐఐటీ బాంబే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఈ పోస్టులను మొదట మూడేండ్ల కాలపరిమితికి తీసుకొంటారు. ఆ తర్వాత పనితనాన్ని బట్టి పర్మినెంట్ చేసే అవకాశం ఉంది.
- పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
- అర్హతలు: బీటెక్/బీఈలో సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. లేదా మూడేండ్ల డిప్లొమాతోపాటు ఆరేండ్ల అనుభవం ఉండాలి.
- పనిచేయాల్సిన ప్రదేశం: ముంబై
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 12
- వెబ్‌సైట్: http://www.ircc.iitb.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ తిరుపతి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
2015, మార్చిలో తిరుపతి ఐఐటీని ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ మెంటరింగ్‌లో 2015-16 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించారు. 
- అసిస్టెంట్ లైబ్రేరియన్ - 1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ - 1, జూనియర్ టెక్నీషియన్ - 2 ఖాళీలు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 13

- వెబ్‌సైట్: http://iittp.ac.in

0 comments:

Post a Comment