Sunday, 29 October 2017

ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు, టిస్‌లో ప్రవేశాలు, డామన్ & డయ్యూ ఎస్‌ఎస్‌బీలో ఉద్యోగాలు, ఎన్‌సీటీఈలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, వాటర్‌వేస్‌లో సర్వేయర్లు.

ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు,

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ క్యాంపస్‌లో పలు విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIT--BUILDING 
వివరాలు:
హైదరాబాద్‌కు సమీపంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో కందిలో ఐఐటీ క్యాంపస్ ఉంది. ఈ ఐఐటీని 2008లో ప్రారంభించారు.
మొత్తం పోస్టుల సంఖ్య - 114
పోస్టులు - అర్హతల వివరాలు
నెట్‌వర్క్/ సిస్టం అడ్మినిస్ట్రేటర్ - 2 ఖాళీలు
అర్హతలు: ఎంటెక్/ఎంఈ లేదా ఎంఎస్‌లో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ/ఎలక్ట్రానిక్స్‌తోపాటు నెట్‌వర్క్/సిస్టం అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం 8 ఏండ్ల అనుభవం ఉండాలి.
డిప్యూటీ రిజిస్ట్రార్ - 2
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఐదేండ్లపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం లేదా అసిస్టెంట్‌ప్రొఫెసర్ (ఏజీపీ స్కేల్ రూ. 6,000)గా 9 ఏండ్ల అనుభవం ఉండాలి. లేదా తత్సమాన అర్హత.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 1
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణతతోపాటు నిర్మాణ రంగంలో కనీసం 8 ఏండ్ల అనుభవం, దీనిలో కనీసం 5 ఏండ్లు బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసి ఉండాలి.
నెట్‌వర్క్/సిస్టం అడ్మినిస్ట్రేటర్ - 2
అర్హతలు: ఎంటెక్/ఎంఈ లేదా ఎంఎస్‌లో కంప్యూటర్ సైన్స్/ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్‌తోపాటు సంబంధిత రంగంలో కనీసం 4 ఏండ్ల అనుభవం ఉండాలి.
స్పోర్ట్స్ ఆఫీసర్ - 2
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. పీజీలో కింది వాటిలో ఏదో ఒక స్పెషలైజేషన్ ఉండాలి. అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్ తదితరాలు. వీటితోపాటు 55 శాతం మార్కులతో ఎంఫిల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణతతోపాటు 8 ఏండ్ల అనుభవం ఉండాలి.
సెక్యూరిటీ ఆఫీసర్ - 1
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయిలో 7 ఏండ్లు పనిచేసిన అనుభవం లేదా కనీసం 8 ఏండ్లు ఏదైనా ఆర్గనైజేషన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
గ్రేడ్ - 2 టెక్నికల్ ఆఫీసర్ - 1
అర్హతలు: బీఈ/బీటెక్‌లో మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కనీసం 10 ఏండ్ల అనుభవం ఉండాలి.
మెడికల్ ఆఫీసర్ II - 1 
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. ఎంసీఐ నిబంధనల ప్రకారం అర్హతలు.
మెడికల్ ఆఫీసర్ I - 1 
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. కనీసం ఆరేండ్ల అనుభవం ఉండాలి లేదా రెండేండ్ల స్పెషలైజేషన్ ఉన్నవారికి మూడేండ్ల అనుభవం.
లేడీ మెడికల్ ఆఫీసర్ I - 1 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు కనీసం 6 ఏండ్ల అనుభవం ఉండాలి. లేదా రెండేండ్ల స్పెషలైజేషన్‌తో మూడేండ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 4 ఖాళీలు
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు మంచి అకడమిక్ రికార్డు కలిగి ఉండాలి. అకౌంట్స్/ అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, హాస్టల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్ తదితర విభాగాల్లో అనుభవం ఉండాలి.
సెక్షన్ ఆఫీసర్ - 3
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రభుత్వ, ప్రభుత్వ పరిధిలోని, స్వతంత్ర లేదా పీఎస్‌యూలో రూ. 4,200/- గ్రేడ్‌పేతో పనిచేసిన అనుభం ఉండాలి. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్‌లో అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రకల్) - 2 పోస్టులు
అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతోపాటు కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ఇంజినీర్ (సివిల్) - 3
అర్హతలు: బీఈ/బీటెక్‌లో సివిల్‌తోపాటు మూడేండ్ల అనుభవం లేదా డిప్లొమాతోపాటు 5 ఏండ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 1
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీతోపాటు లైబ్రేరీ కంప్యూటరైజేషన్ లేదా లైబ్రేరీలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ - 18 పోస్టులు
అర్హతలు: డిగ్రీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పరిజ్ఞానం లేదా మూడేండ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా డీసీసీపీతోపాటు అనుభవం ఉండాలి.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 1
అర్హతలు:పీజీలో హిందీతోపాటు డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా తత్సమాన అర్హతతోపాటు హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీలోకి ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. లేదా ప్రభుత్వ/ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో రెండేండ్లు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభం ఉండాలి.
అసిస్టెంట్ - 2
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్టాబ్లిష్‌మెంట్ లేదా అడ్మినిస్ట్రేషన్, స్టోర్స్, పర్చేస్, ఆర్ అండ్ డీ అకౌంట్స్, వర్క్స్, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ట్రెయినింగ్, ప్లేస్‌మెంట్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ అకౌంటెంట్ - 4
అర్హతలు: బీకాం డిగ్రీతోపాటు రెండేండ్ల అనుభవం, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ - 7
అర్హతలు: డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్ ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జూనియర్ టెక్నీషియన్ - 23
మల్టీస్కిల్ అసిస్టెంట్ - 8
టెక్నికల్ సూపరింటెండెంట్ - 23
అర్హతలు: పై మూడు పోస్టుల్లో పలు విభాగాలు ఉన్నాయి. వీటికి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనా దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: నవంబర్ 22
దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:The Registrar Indian Institute of Technology Hyderabad KANDI 502 285, 
Sangareddy District, Telangana.
నోట్: కందిలో కొరియర్ సర్వీస్ లేదు. దరఖాస్తులను రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి.

వెబ్‌సైట్: http://www.iith.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టిస్‌లో ప్రవేశాలు,
ముంబైలోని ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TISS-STUDENTS
వివరాలు:
టిస్‌ను సర్ దొరబ్జి టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌గా 1936లో స్థాపించారు. దీన్ని 1944లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌గా మార్చారు.
-టిస్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా మహారాష్ట్రలోని తుల్జాపూర్, అసోంలోని గువాహటి, తెలంగాణాలోని హైదరాబాద్ క్యాంపస్‌లలో సీట్లను భర్తీచేస్తారు.
-బ్యాచిలర్ డిగ్రీ (బీఏ ఆనర్స్)
-విభాగం: సోషల్ వర్క్ (తుల్జాపూర్ క్యాంపస్)
-బ్యాచిలర్ డిగ్రీ (మూడేండ్ల బీఏ ఆనర్స్)
-విభాగం: సోషల్ సైన్సెస్ (తుల్జాపూర్, గువాహటి, హైదరాబాద్ క్యాంపస్‌లలో)
-ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ -పీహెచ్‌డీ, డైరెక్ట్ పీహెచ్‌డీ, షార్ట్ టర్మ్ సర్టిఫికెట్స్ (డిప్లొమా ప్రోగ్రామ్), మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
-ఎంపిక విధానం : ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 25 (కోర్సులను బట్టి వేర్వేరు చివరితేదీలున్నాయి)
-ఎంట్రన్స్ టెస్ట్ : 2018 జనవరి 6,13, మే 5
-వెబ్‌సైట్: http://admissions.tiss.edu



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డామన్ & డయ్యూ ఎస్‌ఎస్‌బీలో ఉద్యోగాలు,

కేంద్రపాలిత ప్రాతంమైన డామన్ & డయ్యూ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి స్టాఫ్ సెలక్షన్ బోర్డు 
(ఎస్‌ఎస్‌బీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DAMANDSCPOLICE 
వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య: 164 పోస్టులు 
-అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్-2 పోస్టులు 
-అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, రేడియోటెక్నాలజీ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-పోలీస్ కానిస్టేబుల్-72 పోస్టులు (జనరల్-47, ఓబీసీ-18, ఎస్సీ-2, ఎస్టీ-5)
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత
-కానిస్టేబుల్ డ్రైవర్ -6 పోస్టులు (జనరల్-5, ఓబీసీ-1)
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత. లైట్ మోటార్ వెహికిల్/హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
-పోలీస్ కానిస్టేబుల్ (ఆర్‌టీవో/రేడియో మెకానిక్/సిఫర్)-17 పోస్టులు (జనరల్-12, ఓబీసీ-4, ఎస్టీ-1)
-అర్హత: హెచ్‌ఎస్‌సీ (సైన్స్)లో ఉత్తీర్ణత లేదా వైర్‌లెస్ ఆపరేటింగ్/రేడియో టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్-9 పోస్టులు (జనరల్-7, ఓబీసీ-1, ఎస్సీ-1)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎక్సైజ్ గార్డ్ -58 పోస్టులు (జనరల్-32, ఓబీసీ-19, ఎస్సీ-2, ఎస్టీ-5)
-అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ పోస్టుకు 30 ఏండ్లు) ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక విధానం: పీఈటీ, పీఎస్‌టీ, రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
-శారీరక ప్రమాణాలు, ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా 
-చివరితేదీ: నవంబర్ 7

-వెబ్‌సైట్: www.daman.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీటీఈలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు,
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCTE-LOGO
వివరాలు:
ఎన్‌సీటీఈ అనేది భారతప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య:14
-డిప్యూటీ సెక్రటరీ/రీజినల్ డైరెక్టర్-4, సెక్షన్ ఆఫీసర్/ప్రోగ్రామ్ ఆఫీసర్-2, అకౌంట్స్ ఆపీసర్-1, కంప్యూటర్ కమ్ ప్లానింగ్ అండ్ మానిటారింగ్ ఆఫీసర్(సీపీపీఎంఓ)-1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-5
-గమనిక: ఈ పోస్టులను డిప్యూటేషన్/ తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ:ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: www.ncte-india.org



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వాటర్‌వేస్‌లో సర్వేయర్లు.
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, అసిస్టెంట్, తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

వివరాలు: ఐడబ్ల్యూఏఐ అనేది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పరిధిలో పనిచేస్తున్న శాసనబద్ధ సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య : 7 పోస్టులు (అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్-2, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్-3, అకౌంట్స్ అసిస్టెంట్-2 )
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ లేదాతత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరి తేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.iwai.nic.in

0 comments:

Post a Comment