Tuesday, 24 October 2017

స్వామి రామానందతీర్థలో ఉచిత శిక్షణ, ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలు, ఎన్‌సీఈఆర్‌టీలో ల్యాబ్ అసిస్టెంట్లు, ఐఐఎఫ్‌ఎం పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ట్రీ మేనే జ్‌మెంట్, జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ కోర్సు, ఐడీపీఎల్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు, తేజ్‌పూర్ యూనివర్సిటీ ఉద్యోగాలు.

స్వామి రామానందతీర్థలో ఉచిత శిక్షణ,

స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
SRTI-STUDENTS

వివరాలు:
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, భారత ప్రభుత్వం ద్వారా ఈ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలను స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుంది.
srtrs
మూడు నెలల సాంకేతిక విద్యలు..
- అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాంలో ఉత్తీర్ణత.
- ఆటోమొబైల్ -2,3 వీలర్ సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ మెయింటెనెన్స్ (సెల్‌ఫోన్‌తోపాటు)
- సర్వీస్, సూయింగ్ మెషిన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్-నాలుగు నెలలు)
- విదార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి
పదోతరగతిలో ఉత్తీర్ణత
- సోలర్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్ అండ్ సర్వీస్, డీటీపీ & ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్
- విదార్హత:గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్‌లో ఉత్తీర్ణత. సోలర్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్ అండ్ సర్వీస్‌కు ఇంటర్/ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అర్హతలు: గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. శిక్షణ అనంతరం ఉద్యోగం చేయడానికి సిద్దంగా ఉండాలి. ఇదివరకే ఆర్‌వైకే/రోషిణి, డీడీయూజీకేవై పథకాల ద్వారా శిక్షణ పొందినవారు అర్హులు కారు.
- ప్రారంభ వేతనం: నెలకు రూ. 6000 నుంచి రూ. 8000/- వరకు, 6 నెలల/12 నెలల తర్వాత వేతనం పెంచుతారు. ఈపీఎఫ్, మెడికల్ సదుపాయం ఉంటుంది.
గమనిక: శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితం & ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తారు.
- రిజిస్ట్రేషన్ ఫీజు: ఎంపికైన అభ్యర్థులు రూ. 250/- రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి.
- దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్‌తోపాటు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 2017 నవంబర్ 1న ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంస్థలో హాజరుకావాలి.
- ఇతర వివరాలకు ఫోన్ నంబర్:
9948466111, 9133908000,
9133908111, 9133908222 లేదా జిల్లా డీఆర్‌డీఏ ఆఫీస్‌లోగల జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను సంప్రదించవచ్చు.
- చిరునామా: స్వామి రామానందతీర్థ రూరల్
ఇన్‌స్టిట్యూట్, జలాల్‌పూర్ గ్రామం,
భూదాన్ పోచంపల్లి మండలం,
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ - 508284
- వెబ్‌సైట్: www.srtri.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పైప్‌లైన్స్ డివిజన్‌లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indian-oil 
వివరాలు:
ఇండియన్ ఆయిల్ భారత ప్రభుత్వరంగ సంస్థ. ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.
- పోస్టు: టెక్నీషియన్ అప్రెంటిస్
- మొత్తం ఖాళీలు - 310
- విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికం అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్
- రాష్ర్టాల వారీగా ఖాళీలు: గుజరాత్ - 59, రాజస్థాన్ - 35, పశ్చిమబెంగాల్ - 30, బీహార్ - 18, ఉత్తరప్రదేశ్ (తూర్పు రీజియన్) - 6, అసోం - 15, ఢిల్లీ - 14, హర్యానా - 31, పంజాబ్ - 12, ఉత్తరప్రదేశ్ (ఉత్తర రీజియన్) - 15, ఉత్తరాఖండ్ - 3, తమిళనాడు - 22, కర్ణాటక - 2, ఆంధ్రప్రదేశ్ - 6, ఒడిశా - 33, ఛత్తీస్‌గఢ్ - 6, జార్ఖండ్ - 3 ఖాళీలు ఉన్నాయి.
- వయస్సు: 2017, అక్టోబర్ 16 నాటికి 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి మూడేండ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇన్ మెకానికల్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ లేదా ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. నోట్: ఐటీఐ తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా చేసినవారు కూడా అర్హులే. అదేవిధంగా డిప్లొమాలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. 
- అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్: ఏడాది
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో కనీసం 40 శాతం రావాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం తక్కువగా అంటే 35 శాతం మార్కులు వస్తే క్వాలిఫైగా పరిగణిస్తారు.
- రాతపరీక్షకు 85(85 ప్రశ్నలు), ఇంటర్వ్యూకు 15 మార్కులు. మొత్తం 100 మార్కులు.
- ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. 
నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
- 85 మార్కుల్లో 60 మార్కులు డిప్లొమాలో సంబంధిత బ్రాంచీ నుంచి ఇస్తారు. మిగిలిన 25 మార్కులు జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్/హిందీ, న్యూమరికల్ ఆప్టిట్యూట్, జనరల్ నాలెడ్జ్ నుంచి ఇస్తారు.
- రాతపరీక్ష కాలవ్యవధి 2 గంటలు. 
- రాతపరీక్షలో క్వాలిఫై అయినవారిని 1:3 
నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
- స్టయిఫండ్: నెలకు రూ. 7, 530/- (కన్సాలిడేటెడ్)
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 6
(సాయంత్రం 6 గంటల వరకు)
- రాతపరీక్ష తేదీ: 2017, డిసెంబర్ 3
- వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు: 
డిసెంబర్ 4 - 6 మధ్య

- వెబ్‌సైట్: https://plis.indianoilpipelines.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఈఆర్‌టీలో ల్యాబ్ అసిస్టెంట్లు,

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎడిటోరియల్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ncerr
- ల్యాబ్ అసిస్టెంట్-4 పోస్టులు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: రూ.17,000/-
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. ఒరిజినల్ సర్టిఫికెట్లతో నవంబర్ 7న ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
- వెబ్‌సైట్: www.ncert.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఐఎఫ్‌ఎం పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ట్రీ మేనే జ్‌మెంట్,


భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
iifm
- కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్ (పీజీడీఎఫ్‌ఎం)
- 2018 - 20 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాలు. ఈ కోర్సు పూర్తిగా రెసిడెన్షియల్.
- మొత్తం సీట్ల సంఖ్య - 120
- అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: క్యాట్ అభ్యర్థులకు 2018, ఫిబ్రవరి 10
- ఎక్స్‌ఏటీ అభ్యర్థులకు 2018, ఫిబ్రవరి 20
- వెబ్‌సైట్: http://iifm.ac.in/pddfm

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ కోర్సు,

జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
AIIMS-Jodhpur
వివరాలు:
- కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
- మొత్తం సీట్ల సంఖ్య: 18
- అర్హత : మాస్టర్ డిగ్రీ (బయోమెడికల్ సైన్సెస్/ల్యాబొరేటరీ మెడిసిన్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా మాస్టర్ డిగ్రీ (సర్జరీ/మెడిసిన్) /ఎండీఎస్ లేదా తత్సమాన డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత. ఎంబీబీఎస్/బీడీఎస్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరితేదీ : నవంబర్ 10
- వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐడీపీఎల్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు,

గురుగ్రామ్‌లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) ఖాళీగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IDPL
- మొత్తం ఖాళీల సంఖ్య: 10
- విభాగాలవారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్/సీనియర్ ఎగ్జిక్యూటివ్-5, డిప్యూటీ పర్సనల్ మేనేజర్-2, డిప్యూటీ మేనేజర్-1, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్-1, డిప్యూటీ మార్కెటింగ్ మేనేజర్-1)
- అర్హత: బీ ఫార్మసీ/ఎంఫార్మసీ, బీటెక్, పీజీ/ ఎంబీఏ, సీఏ/ఎంబీఏ, బీకాం/ఎంకామ్, సైన్స్ గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణత.
- పే స్కేల్: రూ. 22,000-25,000/-
(పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్ ఉన్నాయి)
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
- ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 25, 26
- వెబ్‌సైట్: http://www.idplindia.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు,
తమిళనాడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
IIFPT 

- మొత్తం ఖాళీల సంఖ్య: 10 పోస్టులు 
(రిసెర్చ్ అసోసియేట్-2, ఎస్‌ఆర్‌ఎఫ్-4, 
ప్రాజెక్ట్ అసిస్టెంట్-4)
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ /ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, ఇంటర్వ్యూ రోజున 
పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
- ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 31

- వెబ్‌సైట్: www.iifpt.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తేజ్‌పూర్ యూనివర్సిటీ ఉద్యోగాలు.

తేజ్‌పూర్ యూనివర్సిటీలో జూనియర్ అకౌంటెంట్, ఎల్‌డీసీ, క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Tezpur_University 
- పోస్టులు: జూనియర్ అకౌంటెంట్ - 2, లోయర్ డివిజన్ క్లర్క్ - 4, మెడికల్ ఆఫీసర్ - 1, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (అడ్మినిస్ట్రేషన్) - 1, జూనియర్ ప్రోగ్రామర్ (కంప్యూటర్ సెంటర్) - 1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 1, టెక్నికల్ అసిస్టెంట్ (ఈసీఈ డిపార్ట్‌మెంట్) - 1, లైబ్రేరీ 
అసిస్టెంట్ - 1, జూనియర్ అకౌంటెంట్ - 2, ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 1 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 27

- వెబ్‌సైట్: www.tezu.ernet.in

0 comments:

Post a Comment