Sunday, 15 October 2017

నాగ్‌పూర్ మెట్రోరైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, మిలిటరీ హాస్పిటల్‌లో ఖాళీలు, న్యూక్లియర్ పవర్‌లో స్టయిఫండరీ ట్రెయినీలు, ఇస్రో- ఐపీఆర్‌సీలో ఉద్యోగాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలు, ఎన్‌సీఏపీ రిసెర్చ్ అసోసియేట్లు.

నాగ్‌పూర్ మెట్రోరైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు,

కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతున్న నాగ్‌పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టులో సూపర్‌వైజరీ, నాన్ సూపర్‌వైజరీ (టెక్నీషియన్) విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఈ పోస్టులను ఆపరేషన్స్, మెయింటెనెన్స్ విభాగంలో భర్తీచేస్తారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 206
-పోస్టు పేరు: టెక్నీషియన్ -91 పోస్టులు
-అర్హతలు: ఎన్‌సీవీటీ/ఎస్‌వీటీ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష
-సూపర్‌వైజరీ పోస్టులు: 115
-స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్/ట్రైన్ కంట్రోలర్- 62
-అర్హతలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్‌లలో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
-సెక్షన్ ఇంజినీరింగ్- 10
-అర్హతలు: సంబంధిత విభాగంలో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-జూనియర్ ఇంజినీర్- 43
-అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక : ఆన్‌లైన్ రాతపరీక్ష, సైకో టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు ఫీజు: రూ. 500/-ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ. 150/-
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 9
-వెబ్‌సైట్: www.metrorailnagpur.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిలిటరీ హాస్పిటల్‌లో ఖాళీలు,

178 మిలిటరీ హాస్పిటల్, C/o 99 APOలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
178 మిలిటరీ హాస్పిటల్ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టులు - అర్హతలు:
-మాలి (పురుష) - 1, సఫాయివాలా (పురుష)- 2, చౌకీదార్ (పురుష) - 2.
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-వాషర్‌మెన్ (పురుష) - 1.
-అర్హత:పదోతరగతితోపాటు మిలిటరీ/సివిలియన్ దుస్తులు ఉతకడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
-పెయింటర్ (పురుష)-1, టిన్ స్మిత్ (పురుష)- 1
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-బూట్ రిపేరర్ (పురుష) - 1
-అర్హత: పదోతరగతితోపాటు క్యాన్వాస్/ టెక్స్‌టైల్, లెదర్ బూట్లు రిపేర్ చేయడం వచ్చి ఉండాలి.
-పేస్కేల్: మాలి, వాషర్‌మెన్, సఫాయివాలా, చౌకీదార్, బూట్ రిపేరర్ పోస్టులకు రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1800/-
-మిగిలిన పోస్టులకు రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1900/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:కమాండింగ్ ఆఫీసర్, 178 మిలిటరీ హాస్పిటల్, పిన్‌కోడ్ - 903178, C/o APO
-చివరితేదీ: 21 రోజుల్లోగా పంపాలి. (ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అక్టోబర్ 7 -13 ఇష్యూలో విడుదలైంది)


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
న్యూక్లియర్ పవర్‌లో స్టయిఫండరీ ట్రెయినీలు,
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ/టెక్నీషియన్ పోస్టుల భర్తీకి (తారాపూర్, మహారాష్ట్ర) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-న్యూక్లియర్ సంస్థలో ట్రెయినింగ్+ఉద్యోగం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: అక్టోబర్ 25


వివరాలు:
ఎన్‌పీసీఐఎల్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పని చేస్తున్న సంస్థ. దీన్ని 1987, సెప్టెంబర్ 17న స్థాపించారు. అణు శక్తి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ చేస్తున్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ .
-పోస్టు పేరు: స్టయిఫండరీ ట్రెయినీ/టెక్నీషియన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 56
NPCIL

విభాగాలవారీగా ఖాళీలు:
-సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరీ -1)-5 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరీ 1-హెచ్‌పీ యూనిట్)-1 పోస్టు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఉత్తీర్ణత.
-సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరీ 2 )-50 పోస్టులు (జనరల్-25, ఓబీసీ-25)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానిక్, కార్పెంటర్, మాసన్, ప్లంబర్, టర్నర్, మిల్లర్)లో ఉత్తీర్ణత. పదోతరగతి స్థాయిలో సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులను చదివి ఉండాలి. సంస్థ నిబంధనలమేరకు శారరీక ప్రమాణాలు కలిగి ఉండాలి. అంటే కనీసం 160 సెం. మీ ఎత్తు, 45.50 కేజీల బరువు ఉండాలి.
-వయస్సు: 2017 అక్టోబర్ 25 నాటికి 18 నుంచి 24 ఏండ్లు, స్టయిఫండరీ ట్రెయినీ టెక్నీషియన్‌కు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్ : ఏడాదిన్నర వరకు రూ. 9300/-(క్యాటగిరీ 1), మొదటి ఏడాది రూ. 6200/-, రెండో ఏడాదికి రూ. 7200/- ట్రెయినింగ్ పీరియడ్‌లో చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తయిన తర్వాత 35, 400/- (టెక్నీషియన్‌కు రూ. 21,700/-) అదనంగా డీఏ, సీడీఏ, సీఈఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరితేదీ: అక్టోబర్ 25
వెబ్‌సైట్: www.npcilcareers.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రో- ఐపీఆర్‌సీలో ఉద్యోగాలు,
తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఐపీఆర్‌సీ అనేది ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో పరిశోధన, అభివృద్ధికి తమిళనాడు ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 37
-టెక్నికల్ అసిస్టెంట్-12 పోస్టులు
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణిలో డిప్లొమా ఉత్తీర్ణత.
-సైంటిఫిక్ అసిస్టెంట్-1
-అర్హత: ప్రథమశ్రేణిలో బీఎస్సీ (కెమిస్ట్రీ)
-టెక్నీషియన్ (గ్రేడ్ బీ)-18 పోస్టులు
-అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు ఐటీఐ ట్రేడ్ (ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్, ఫొటోగ్రఫీ)లో ఉత్తీర్ణత.
-డ్రాఫ్ట్స్‌మెన్ (గ్రేడ్ బీ)-1 పోస్టు
-అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ఫైర్‌మెన్ (గ్రేడ్ ఏ) -1 పోస్టు
-అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత.
-డ్రైవర్ కమ్ ఆపరేటర్-2 పోస్టులు
-అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
-క్యాటరింగ్ అటెండెంట్-2 పోస్టులు
-వయస్సు: 2017 అక్టోబర్ 25 నాటికి డ్రాఫ్ట్స్‌మెన్, ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులకు 25 ఏండ్లు, మిగతా పోస్టులకు 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక : అకడమిక్ ప్రతిభ ద్వారా స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
-ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులకు రాతపరీక్షతోపాటు ఫిజికల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: అక్టోబర్ 25
వెబ్‌సైట్: www. iprc.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలు,
తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల్లో ఖాళీగా ఉన్న ఫిజికల్ డైరెక్టర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Guest-Lecturers

పోస్టు పేరు: ఫిజికల్ డైరెక్టర్ (గెస్ట్ ఫ్యాకల్టీ)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఎంపీఈడీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 15,000/- (కన్సాలిడేటెడ్ పే)
-దరఖాస్తు: ఆన్‌లైన్
-ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ
-చివరితేదీ: అక్టోబర్ 13
-వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌సీఏపీ రిసెర్చ్ అసోసియేట్లు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రిసెర్చ్ (ఎన్‌సీఏపీ) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:ఎన్‌సీఏపీ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్( ఐసీఏఆర్) అనుబంధ సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 20
-రిసెర్చ్ అసోసియేట్-10, కన్సల్టెంట్-6
-యంగ్ ప్రొఫెషనల్స్ (గ్రేడ్ 2)-4
-అర్హత: మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రిలక్చరల్ స్టాటిస్టిక్స్), బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, సంబంధిత పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూతేదీ: అక్టోబర్ 12,13
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-వెబ్ సైట్: http://www.ncap.res.in

0 comments:

Post a Comment