Sunday, 15 October 2017

సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలు, జంషెడ్‌పూర్ నిట్‌లో ఫ్రొఫెసర్లు, ఐఐఏపీ ప్రాజెక్ట్ సైంటిస్టులు.

సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలు,

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్ (దివ్యాంగన్)లో కింది ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూల కోసం అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఐఈపీఐడీ భారత ప్రభుత్వ సంస్థ.
ఇది ఐఎస్‌వో 9001 - 2008 సంస్థ.
పోస్టులు:
ఎన్‌ఐఈపీఐడీలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం...
రిసెర్చ్ ఆఫీసర్ - 1, అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్ - 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ - 10, అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్ (క్లస్టర్ బేస్డ్ ప్లేస్‌మెంట్ కింద) - 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (క్లస్టర్ బేస్డ్) - 1 ఖాళీ ఉన్నాయి.
ఎన్‌ఐఈపీఐడీ సికింద్రాబాద్‌లోకొత్త ప్రాజెక్టుల కోసం...
రిసెర్చ్ ఆఫీసర్ - 1, అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్(ఐడీ) - 1, అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్ - 1 ఖాళీ ఉన్నాయి.
-ముంబైలోని ఆర్‌లో కొత్త ప్రాజెక్ట్ కోసం...
-అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్ - 1 పోస్టు
-కోల్‌కతాలోని ఆర్‌సీ కొత్త ప్రాజెక్ట్ కోసం...
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 2 పోస్టులు
గెస్ట్ ఫ్యాకల్టీ/ స్టాఫ్ పోస్టులు...
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ రిహాబిలిటేషన్ ఇన్ సైకాలజీ లెవల్, అసిస్టెంట్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్,డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, సెక్షన్ ఆఫీసర్, రిహాబిలిటేషన్ థెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఎంపిక: పై పోస్టులన్నింటిని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.niepid.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జంషెడ్‌పూర్ నిట్‌లో ఫ్రొఫెసర్లు,
జంషెడ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దీన్ని 1960లో ఏర్పాటుచేశారు. గతంలో దీన్ని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీగా పిలిచేవారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 123 (జనరల్-57, ఓబీసీ-38, ఎస్సీ- 17, ఎస్టీ-11)
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, సివిల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఎంఎంఈ, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్, హ్యూమానిటీస్ సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.15,600 - 39,100 +అకడమిక్ గ్రేడ్ పే రూ. 6000/7000/8000
అప్లికేషన్ ఫీజు: రూ. 1500/-,
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 24.
వెబ్‌సైట్: www.nitjsr.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఏపీ ప్రాజెక్ట్ సైంటిస్టులు.

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏపీ) ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
ఐఐఏపీ భారత ప్రభుత్వరంగ సంస్థ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ పరిధిలోని స్వతంత్ర సంస్థ.
పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ (సైన్స్) - 1
అర్హత: పీహెచ్‌డీ (అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ (ఆప్టికల్ అండ్ ఇన్‌ఫారెడ్))
ప్రాజెక్ట్ సైంటిస్ట్ (ఆప్టిక్స్) - 1
అర్హత: పీహెచ్‌డీ (ఆప్టిక్స్/ఆస్ట్రోనామికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్)
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: అక్టోబర్ 24
వెబ్‌సైట్: www.iiap.res.in

0 comments:

Post a Comment