Tuesday, 24 October 2017

మజ్‌గావ్‌ డాక్‌లో 985 ఖాళీలు, ఎస్‌ఏసీ స్పేస్ అప్లికేషన్‌లో పోస్టులు, ఓఎన్‌జీసీ సెక్యూరిటీ ఆఫీసర్స్, జేఎన్‌టీయూఏలో ప్రొఫెసర్లు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎంటీఎస్ ఉద్యోగాలు, జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్.

మజ్‌గావ్‌ డాక్‌లో 985 ఖాళీలు,

భారత రక్షణ శాఖ పరిధిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ స్టాఫ్ (స్కిల్డ్, సెమీ స్కిల్డ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-షిప్‌బిల్డర్‌లో టెక్నికల్ స్టాఫ్
-రాతపరీక్ష, ట్రేడ్ పరీక్ష ద్వారా ఎంపిక
వివరాలు:
భారత నావికా దళానికి కావాల్సిన యుద్ధనౌకలను, సబ్‌మెరైన్స్‌ను ఈ డాక్‌లో నిర్మిస్తారు. ప్రపంచస్థాయి కలిగిన ఈ షిప్‌యార్డ్‌ను 1934లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: టెక్నికల్ స్టాఫ్ (స్కిల్డ్, సెమీ స్కిల్డ్)
-పనిచేసే ప్రదేశం: ముంబై (మహారాష్ట్ర)
-మొత్తం ఖాళీల సంఖ్య: 985 (రెగ్యులర్ 872, బ్యాక్‌లాగ్ 113 పోస్టులు)
-ఈ పోస్టులను రెండేండ్ల కాలానికి తాత్కాలికంగా భర్తీ చేస్తారు.
-విభాగాల వారీగా ఖాళీలు: ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్-1, బ్రాస్ ఫినిషర్-11, కార్పెంటర్-11, కంపోసైట్ వెల్డర్-240, డ్రాఫ్ట్స్‌మ్యాన్-15, డ్రైవర్-4, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్స్-6, ఎలక్ట్రీషియన్-38, ఎలక్ట్రానిక్ మెకానిక్-15, ఫిట్టర్-31, మెషినిస్ట్-3, మిల్‌రైట్ మెకానిక్-17, పెయింటర్-27, పైప్ ఫిట్టర్-58, ప్లానర్ ఎస్టిమేటర్
(ఎం అండ్ ఈ)-10, క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (ఎం అండ్ ఈ)-11, రిగ్గర్-50, స్టోర్స్ స్టాఫ్-1, స్ట్రక్చరల్ ఫాబ్రికేటర్-291, ఎన్‌డీటీ ఇన్‌స్పెక్టర్-4, ఇంజిన్ డ్రైవర్-1, లష్కర్-8, సెక్యూరిటీ సిపాయి-6, చిప్పర్ గ్రైండర్ -65, ఫైర్ ఫైటర్-13, యుటిలిటీ హ్యాండ్-42, సెయిల్ మేకర్-6
అర్హత : గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి ఎనిమిదో తరగతి, పదోతరగతి, సంబంధిత బ్రాంచి/ట్రేడుల్లో డిప్లొమా/ ఐటీఐలో ఉత్తీర్ణత. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 33 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 6000/- నుంచి రూ. 8000/- వరకు ఇస్తారు. విద్యార్హతలను బట్టి వేర్వేరుగా పే స్కేల్ ఇస్తారు. అదనంగా కంపెనీ రూల్స్ అనుసరించి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ సబ్సిడీ,
సీపీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 140/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష, ఎక్స్‌పీరియన్స్, ట్రేడ్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలతోపాటు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 29
-వెబ్‌సైట్: www.mazagondock.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎస్‌ఏసీ స్పేస్ అప్లికేషన్‌లో పోస్టులు,

అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్‌ఏసీ)లో జేఆర్‌ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోని అనుబంధ సంస్థల్లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఒకటి. ఇస్రో ప్రయోగాలకు అవసరమైన స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, నావిగేషన్, డిజాస్టర్ మానిటరింగ్ తదితర కీలక సేవలను ఎస్‌ఏసీ అందిస్తుంది.

జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్):
-మొత్తం ఖాళీల సంఖ్య - 58
-అర్హతలు: సంబంధిత అంశంలో కనీసం 65 శాతం మార్కులతో పీజీతోపాటు నెట్ అర్హత సాధించి ఉండాలి. పీజీలో - ఎమ్మెస్సీ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఫిజికల్ ఓషనోగ్రఫీ/ ఓషనోగ్రఫీతోపాటు డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా కలిగి ఉండాలి. ఎమ్మెస్సీలో జియోఫిజిక్స్ లేదా అప్లయిడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్ లేదా పీజీలో జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ, ఫిజిక్స్, ఆగ్రోనమీ, హార్టికల్చర్, మెరైన్ బయాలజీ, ఆక్వాటిక్ బయాలజీ, మెరైన్ ఫిషరీస్, ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ లేదా ఫిషరీస్ హైడ్రోగ్రఫీ లేదా ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ, జియోఇన్ఫర్మాటిక్స్, రిమోట్ సెన్సింగ్, వాటర్ రిసోర్సెస్, హైడ్రాలజీ, సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్స్.
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు
-ఫెలోషిప్: మొదటి రెండేండ్లు నెలకు రూ. 25 వేలు, తర్వాత నెలకు రూ. 28 వేలు ఇస్తారు.
SAC

రిసెర్చ్ అసోసియేట్స్:
-మొత్తం ఖాళీల సంఖ్య - 14
-అర్హతలు: పీహెచ్‌డీలో ఫిజిక్స్/ అట్మాస్ఫియరిక్ సైన్సెస్‌తో న్యూమరికల్ వెదర్ లేదా ఓషియన్ మోడల్స్/ సాటిలైట్ రిట్రివల్ టెక్నిక్స్‌లో రిసెర్చ్ అనుభవం ఉండాలి. లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఫిజిక్స్ లేదా అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ ఫిజికల్ ఓషనోగ్రఫీతోపాటు మూడేండ్ల రిసెర్చ్ అనుభవం ఉండాలి లేదా ఫిజిక్స్‌లో పీహెచ్‌డీతోపాటు శాటిలైట్ డాటా క్యాలిబరేషన్ అండ్ వాలిడేషన్‌లో రిసెర్చ్ అనుభవం ఉండాలి. లేదా తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-ఫెలోషిప్: మొదటి ఏడాది నెలకు రూ. 36 వేలు, రెండో ఏడాది నెలకు రూ. 38 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 40 వేలు ఇస్తారు.

టెక్నికల్ అసిస్టెంట్ - 4 ఖాళీలు
-ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ &టెలికమ్యూనికేషన్స్ - 2, కంప్యూటర్ సైన్స్ - 1, మెకానికల్ - 1
-అర్హతలు: ప్రథమశ్రేణిలో సంబంధిత అంశంలో డిప్లొమా ఉత్తీర్ణత.

సైంటిఫిక్ అసిస్టెంట్ - 5 ఖాళీలు
-ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్-3, మల్టీమీడియా-1, కంప్యూటర్ సైన్స్/ఐటీ - 1)
-అర్హ్హతలు: సంబంధిత అంశంలో ప్రథమశ్రేణిలో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.

టెక్నీషియన్ బీ - 3
-ఎలక్ట్రీషియన్ - 2, ఐటీ/ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయింటెనెన్స్ - 1)
-అర్హత: మెట్రిక్ + సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
-పే స్కేల్: టెక్నీషియన్ బీ పోస్టుకు రూ. 21,700 - 69,100/-
-మిగిలిన పోస్టులకు రూ. 44,900 - రూ. 1,42,400/-
-వయస్సు: 2017, నవంబర్ 17 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 17
-వెబ్‌సైట్: https://recruitment.sac.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఓఎన్‌జీసీ సెక్యూరిటీ ఆఫీసర్స్,
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు: సెక్యూరిటీ ఆఫీసర్స్
-మొత్తం ఖాళీల సంఖ్య - 9
-పేస్కేల్: రూ. 24,900 - 50,500/-
-అర్హతలు: పీజీ ఉత్తీర్ణతతోపాటు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ లేదా సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 4
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: నవంబర్ 26
-వెబ్‌సైట్: http://www.ongcindia.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎన్‌టీయూఏలో ప్రొఫెసర్లు,
అనంతపురంలోని జేఎన్‌టీయూ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం పోస్టుల సంఖ్య: 10
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరి తేదీ: నవంబర్ 23
-వెబ్ సైట్: www.jntua.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎంటీఎస్ ఉద్యోగాలు,
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)లోని సదరన్ రీజియన్ పరిధిలో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ (ఎంటీఎస్, హౌస్ కీపింగ్ స్టాఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అనేది దేశానికి చెందిన త్రివిధ దళాల్లో అత్యంత ముఖ్యమైన సేనా విభాగం. దీన్ని 1932 అక్టోబర్ 8న ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 7 (ఎంటీఎస్-6, హౌస్ కీపింగ్ స్టాఫ్-1)
-గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 18,000
-వయస్సు : 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాత పరీక్ష / ఇంటర్వ్యూ
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి. ప్రకటన పూర్తి వివరాలకు అక్టోబర్ 21-27న వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ఇష్యూను చూడగలరు.----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్.

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రాం (2017-18 అకడమిక్ ఇయర్) ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

-కోర్సు పేరు: పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ/ఎంఎస్ రిసెర్చ్
-మొత్తం సీట్ల సంఖ్య: 255
-విభాగాలవారీగా ఖాళీలు: ఇంజినీరింగ్ (సివిల్-32, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-32, మెకానికల్-56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-17, కంప్యూటర్ సైన్స్-48, మెటలర్జికల్-7), బయోటెక్నాలజీ-2, కెమిస్ట్రీ-13, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ-7, మ్యాథమెటిక్స్-7, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ-2, ఫిజిక్స్-11, వాటర్ రిసోర్సెస్, ఎర్త్ అట్మాస్ఫిరియక్ సైన్సెస్-8, ఫార్మాస్యూటికల్ సైన్సెస్-6, మేనేజ్‌మెంట్-5
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌తోపాటు, ఎంటెక్, ఎమ్మెస్సీ లేదా ఎమ్మెస్సీ (టెక్), బీఫార్మసీతోపాటు ఎంఫార్మసీ, ఎంబీఏ, పీజీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు ఫీజు: రూ. 1000/-(డీడీ రూపంలో చెల్లించాలి)
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా:డైరెక్టర్ అఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి, హైదరాబాద్-500085
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 16
-వెబ్‌సైట్: www. jntuh.ac.in

0 comments:

Post a Comment