Sunday, 29 October 2017

జవహర్ నవోదయ ప్రవేశాలు, ఐఐఎఫ్‌పీటీ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఏఐఈఎస్‌ఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్‌లో ఉద్యోగాలు, ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగాలు, ఈసీహెచ్‌ఎస్‌లో 77 ఉద్యోగాలు, ఎన్‌ఎఫ్‌డీబీ కన్సల్టెంట్లు ఉద్యోగాలు.

జవహర్ నవోదయ ప్రవేశాలు,

నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలోని నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం (రెసిడెన్షియల్ ప్రోగ్రామ్) కోసం జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష-2018 రాయడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
jawaharnavodaya
వివరాలు:
నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ (1986) ప్రకారం కేంద్ర ప్రభుత్వం బోధనలో ఉన్నత ప్రమాణాలను పాటించడానికి జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రవేశపెట్టింది.
- జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష
- అర్హత: నిర్ణీత పరీక్షకు హాజరువుతున్న అభ్యర్థి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2017-18 విద్యాసంవత్సరానికి 5వతరగతి చదువుతున్నవారు. ఏ జిల్లా నుంచి ప్రవేశ కోరుతున్నారో ఆ జిల్లాలోని పాఠశాలలో చదువుతూ ఉండాలి.
- వయస్సు: 2005, మే 1 నుంచి 2009, ఏప్రిల్ 3 మధ్యన జన్మించి ఉండాలి.
- మొత్తం విద్యాలయాలు: 660 (దేశవ్యాప్తంగా) రాష్టాలవారీగా విద్యాలయాల సంఖ్య/వివరాలు
- తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్-(15), అసోం-(28), అరుణాచల్‌ప్రదేశ్-18, అండమాన్ నికోబార్ దీవులు-3, బీహార్-(39), చండీగఢ్-1, ఛత్తీస్‌గఢ్-(28), దాద్రానగర్, హవెలీ-1, డామన్ డయ్యూ-2, ఢిల్లీ-9, గోవా-2, గుజరాత్-(34), హర్యానా-21, హిమాచల్ ప్రదేశ్-12, జమ్ము, కశ్మీర్-(23), జార్ఖండ్-(26), కర్ణాటక-(31), కేరళ-14, లక్షదీవులు-1, మధ్యప్రదేశ్-(53), మహారాష్ట్ర-(34), మణిపూర్-(11), మేఘాలయా-(12), మిజోరం-8, నాగాలాండ్-11, ఒడిశా-(31), పుదుచ్చేరి-4, పంజాబ్-(23), రాజస్థాన్-(35), సిక్కిం-4, త్రిపుర-8, ఉత్తరప్రదేశ్-(76), ఉత్తరాఖండ్-13, పశ్చిమబెంగాల్-(20)
- పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.
- ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 విద్యార్థులను తీసుకుంటారు.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా
పరీక్ష విధానం:-
- ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- మొత్తం 100 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. సమయం-2 గంటలు
- పరీక్ష పేపర్ ఇంగ్లిష్/హిందీతోపాటు రాజ్యాంగం గుర్తించిన ప్రాంతీయ భాషల్లోని ఏదైనా భాషలో పరీక్ష రాయవచ్చు.
- రాష్ట్ర అభ్యర్థులు ఎంచుకున్న తెలుగు, ఉర్దూ లేదా ఇంగ్లిష్/హిందీలో ప్రశ్నపత్రం ఇస్తారు.
- రిజర్వేషన్లు: గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కనీసం 75 శాతం సీట్లు కేటాయిస్తారు.
- 1/3వ వంతు సీట్లు బాలికలకు, 3 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించారు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
- నవోదయ పాఠశాలలో ప్రవేశం పొందినవారికి ఇంటర్ వరకు చదువు, వసతి, భోజనం కూడా ఉచితంగా అందిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
- దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 25
- హాల్‌టికెట్ల పంపిణి: 2018 జనవరి 15 నుంచి
- ప్రవేశ పరీక్ష తేదీ: 2018 ఫిబ్రవరి 10
- వెబ్‌సైట్: http://navodayahyd.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌పీటీ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ ప్రవేశాలు,

తంజావూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
iifpt-summit 
వివరాలు:
ఐఐఎఫ్‌పీటీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
ప్రోగ్రామ్: పీహెచ్‌డీ (బయోటెక్నాలజీ)
- ఈ ప్రోగ్రామ్ ఫుల్‌టైం ప్రోగ్రామ్. 
- అర్హతలు: ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ లేదా న్యూట్రిషన్ బయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ లేదా నానోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 15

- వెబ్‌సైట్: www.iifpt.edu.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఈఎస్‌ఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) మెటీరియల్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదిన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
air-india 
వివరాలు:
ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ శాఖ ఆధ్వర్యలో నడిచే సంస్థ.
- పోస్టు పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ -7 
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ/ఎంబీఏ, పీజీడీఎంలో ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం ఉండాలి
- వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 50,000/- (కన్సాలిడేటెడ్ పే)
- ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ 
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో 
- ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 17

- వెబ్‌సైట్:www.airindia.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు,
ముంబైలోని ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
iprcl 
- మొత్తం పోస్టుల సంఖ్య: 8
- భర్తీచేసే ప్రదేశాలు: ముంబై, నాగ్‌పూర్, భువనేశ్వర్, విజయవాడ, కోల్‌కతా
- ఏజీఎం/జేజీఎం, డీజీఎం (ప్రాజెక్ట్స్)- 6 
- ఏజీఎం/జేజీఎం, డీజీఎం (సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్)-1 
- మేనేజర్ /అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్)-1 
- అర్హత: పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలను కలిగి ఉండాలి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
- చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.

- వెబ్‌సైట్: www.iprcl.org----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్‌లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనే జర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
engineering-projects 
వివరాలు:
ఈ సంస్థ మినీరత్న హోదాను కలిగి ఉన్నది.
- అసిస్టెంట్ మేనేజర్-3 పోస్టులు 
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సీఏ/సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. డిగ్రీ స్థాయి లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- పే స్కేల్: రూ.16,400-40,500/-
- అకౌంట్స్ అసిస్టెంట్-2 పోస్టులు
- అర్హత: డిగ్రీతోపాటు సీఏ ఇంటర్ లేదా సీఎంఏ ఇంటర్‌లో ఉత్తీర్ణత.
- పే స్కేల్: రూ.11,600-26,450/-
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 3

- వెబ్‌సైట్: www.engineeringprojects.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT-HyD-Phd 
వివరాలు:
ఈ ఐఐటీని 2008లో ప్రారంభించారు.
- పోస్టు పేరు: ప్రాజెక్ట్ స్టాఫ్ 
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
- పే స్కేల్ : రూ. 14,000-18,000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ. 
- ఇంటర్వ్యూ: నవంబర్ 3 

- వెబ్‌సైట్: www.iith.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీహెచ్‌ఎస్‌లో 77 ఉద్యోగాలు,
ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్) తెలంగాణ, ఏపీ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Multiple-Recruitment-ECH 
వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 77
- విభాగాలవారీగా ఖాళీలు: ఓఐసీ-7, మెడికల్ స్పెషల్ ఆఫీసర్-5, మెడికల్ ఆఫీసర్-8, డెంటల్ హైగనిస్ట్/టెక్నీషియన్-5, ల్యాబ్ టెక్నీషియన్-7, నర్స్ అసిస్టెంట్-1, ల్యాబ్ అసిస్టెంట్-5, ఫార్మసిస్ట్-10, ఫిజియోథెరపిస్ట్-5, ప్యూన్-5, మహిళా అటెండెంట్-2, సఫాయి కర్మచారి-4
- అర్హత: పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉండాలి. పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలను కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. 
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: Station Head quarters ECHS Cell, C/O HQ Telangana & Andhra Sub Area, Bolarum Post, Secunderabad-500010.
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 24
- ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 12,13,14,15

- వెబ్‌సైట్: http://echs.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎఫ్‌డీబీ కన్సల్టెంట్లు ఉద్యోగాలు.

హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ఎన్‌ఎఫ్‌డీబీ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
- పోస్టు: కన్సల్టెంట్లు
- ఖాళీల సంఖ్య - 12. వీటిలో 9 పోస్టులు హైదరాబాద్, 3 పోస్టులు ఢిల్లీ బోర్డులో ఉన్నాయి. 
- అర్హతలు, వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 3, ఉదయం 10.30 ని॥.
వేదిక: ఎన్‌ఎఫ్‌డీబీ కార్యాలయం, ఫిష్ బిల్డింగ్, పిల్లర్ నంబర్ 235, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్ - 52.

- వెబ్‌సైట్: www.ntdb.gov.in

0 comments:

Post a Comment