Wednesday, 18 October 2017

ఆర్‌బీఐలో 623 అసిస్టెంట్లు, బీఈఎల్ ప్రొబేషనరీ ఇంజినీర్లు , ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉద్యోగాలు, హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు, డీఆర్‌డీవో-సెప్టమ్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.

ఆర్‌బీఐలో 623 అసిస్టెంట్లు,

డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్‌పీటీ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం

రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
rbi 
వివరాలు: ఆర్‌బీఐ దేశంలోని బ్యాంకులకు బ్యాంక్. దీన్ని 1935, ఏప్రిల్ 1న ప్రారంభించారు.
-పోస్టు: అసిస్టెంట్
-మొత్తం ఖాళీల సంఖ్య - 623 (ఎస్సీ - 92, ఎస్టీ - 79, ఓబీసీ - 144, జనరల్ - 308) 
కార్యాలయాల వారీగా ఖాళీల వివరాలు:
-అహ్మదాబాద్ - 19, బెంగళూరు -25, భోపాల్ - 25, భువనేశ్వర్ - 17, చండీగఢ్ - 13, చెన్నై - 15, గువాహటి - 36, హైదరాబాద్ - 16, జైపూర్ - 13, జమ్ము - 23, కాన్పూర్ అండ్ లక్నో - 44, కోల్‌కతా - 23, ముంబై - 264, నాగ్‌పూర్ - 15, న్యూఢిల్లీ - 47, పాట్నా - 15, తిరువనంతపురం & కొచ్చి - 13 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 2017, అక్టోబర్ 1 నాటికి 20 - 28 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1989, అక్టోబర్ 2 నుంచి 1997, అక్టోబర్ 1 మధ్య జన్మించి ఉండాలి. 
-నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు అంటే 33 ఏండ్ల వరకు. ఓబీసీలకు మూడేండ్లు అంటే 31 ఏండ్ల వరకు. పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-విద్యార్హతలు: 2017, అక్టోబర్ 1 నాటికి.. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
-అభ్యర్థులకు పీసీ వర్డ్ ప్రాసెసింగ్‌లో నాలెడ్జ్ ఉండాలి. 
-ఏ రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలో దరఖాస్తు చేసుకొంటారో ఆ యూనిట్ పరిధిలోని స్థానిక భాష రాయడం, చదవడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.
-ఎంపిక విధానం:
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
-ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
-పరీక్షను ఇంగ్లిష్ - 30 ప్రశ్నలు (35 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు (35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు (35 మార్కులు) చొప్పున మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
మెయిన్ ఎగ్జామినేషన్:
-ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
-రీజనింగ్ - 40 (30 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 40 (30 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీ - 40 (30 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ - 40 (25 నిమిషాలు), కంప్యూటర్ నాలెడ్జ్ - 40 (20 నిమిషాలు) మార్కుల చొప్పున మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు. 
-లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ):
-మెయిన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించినవారికి ఎల్‌పీటీ నిర్వహిస్తారు. ఇది అఫీషియల్/లోకల్ లాంగ్వేజ్‌పై ఉంటుంది. దీనిలో అర్హత సాధించనివారికి పోస్టింగ్ ఇవ్వరు.
-ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారిని మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. దీనిలో క్వాలిఫై అయినవారికి ఎల్‌పీటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కుల కోతవిధిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, 
-హైదరాబాద్ కార్యాలయం చిరునామా:
Reserve Bank of India
6-1-56, Secretariat Road,
Saifabad, Hyderabad - 500 004
-పే స్కేల్: ప్రారంభ బేసిక్ పే రూ. 14,650/- వీటితోపాటు ఇతర అలవెన్స్‌లు అన్ని కలుపుకొని నెలకు సుమారుగా రూ. 32,528/- వస్తాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 10
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 450/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ. 50/-
-ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ: నవంబర్ 27, 28 
-మెయిన్ ఎగ్జామ్ తేదీ: 2017, డిసెంబర్ 20
-వెబ్‌సైట్: https://rbidocs.rbi.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈఎల్ ప్రొబేషనరీ ఇంజినీర్లు ,
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
విడుదలైంది.
-పోస్టు: ప్రొబేషనరీ ఇంజినీర్
-అర్హతలు: ఎంటెక్ (టెక్)/ ఎంటెక్ (అప్లయిడ్ ఆప్టిక్స్)
-ఈ పోస్టులు మచిలీపట్నం యూనిట్‌లో ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 3
-వెబ్‌సైట్: www.bel-india.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉద్యోగాలు,

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌గా పిలిచేవారు ) పబ్లిక్ సెక్టార్ సంస్థలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
nlcarchgate 
-జనరల్ సర్జరీ - 4
-అర్హతలు: ఎంబీబీఎస్, ఎంఎస్/డీఎన్‌బీ ఇన్ జనరల్ సర్జరీ (ల్యాప్రోస్కోపీలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు) చేసిన వారు.
-మెడిసిన్ - 3 
-అర్హతలు: ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీలో మెడిసిన్
-ఆప్తాల్మాలజీ - 1
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు డిప్లొమా/ఎంఎస్ లేదా డీఎన్‌బీలో ఆప్తాల్మాలజీ
-ఆర్థోపెడిక్స్ - 1
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు డిప్లొమా/డీఎన్‌బీలో ఆర్థోపెడిక్స్
-నోట్: అన్ని డిగ్రీ/పీజీలు ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 24 నుంచి
-చివరితేదీ: నవంబర్ 7
-వెబ్‌సైట్: https://www.nlcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు,
హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
HIL 
-పోస్టు: కెమికల్ ఇంజినీర్
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొదట మూడేండ్ల కాలపరిమితికి నియమిస్తారు.
-జీతం: నెలకు రూ. 20,000/-
-అర్హతలు, వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: http://www.hil.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవో-సెప్టమ్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) యూనిట్‌లోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 
DRDO 
వివరాలు: డీఆర్‌డీవో దేశంలో ప్రతిష్ఠాత్మక రిసెర్చ్ సంస్థ. దీని పరిధిలో పలు విభాగాలు ఉన్నాయి. దేశ రక్షణ, వైద్య ఇతర పరికరాల తయారీలో కీలకమైన పరిశోధనలను ఈ సంస్థ చేపడుతుంది. 
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్- 2 ఖాళీలు
-అర్హత: ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ/ఇంజినీరింగ్ అభ్యర్థులు నెట్/గేట్‌లో అర్హతను సాధించాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 28,000/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
-ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 14
-వెబ్‌సైట్: www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్  ఉద్యోగాలు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి కేవలం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
womens 
-గ్రూప్ - 1 సోషల్ సైన్సెస్:
-ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్): అసోసియేట్ ప్రొఫెసర్ - 1 , ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ - అసోసియేట్ ప్రొఫెసర్ - 1, లా - అసోసియేట్ ప్రొఫెసర్ - 1, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేట్ ప్రొఫెసర్ - 1 , ఉమెన్స్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ - 1 , ఎడ్యుకేషన్ (జనరల్) - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1, సోషల్ వర్క్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1
గ్రూప్ - 2 సైన్సెస్ విభాగంలో..
-కంప్యూటర్ సైన్స్ - అసోసియేట్ ప్రొఫెసర్ \ - 1 ఖాళీ
-హోం సైన్స్ - అసోసియేట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
-అప్లయిడ్ మైక్రోబయాలజీ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
-సెరీకల్చర్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
గ్రూప్ -3 ఫార్మసీ విభాగంలో..
-ఫార్మసీ - అసోసియేట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
-నోట్: ఈ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఆయా పోస్టుల రోస్టర్ పాయింట్స్ కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-అర్హతలు:
-అసోసియేట్ ప్రొఫెసర్ - మంచి అకడమిక్ రికార్డుతోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ డిగ్రీ. పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. బోధనలో కనీసం 8 ఏండ్ల అనుభవం లేదా అకడమిక్ రిసెర్చ్‌లో అనుభవంతోపాటు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్: పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నెట్/స్లెట్ లేదా సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
-పేస్కేల్: అసోసియేట్ ప్రొఫెసర్: Rs.37,400-67,000+AGP 9000
-అసిస్టెంట్ ప్రొఫెసర్: Rs. 15,600-39,100+AGP 6000
-నోట్: ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: నవంబర్ 15
-వెబ్‌సైట్: http://www.spmvv.ac.in

0 comments:

Post a Comment