Sunday, 15 October 2017

కోస్ట్‌గార్డ్‌లో నావిక్ ప్రవేశాలు, బీహెచ్‌ఈఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు, సికింద్రాబాద్, 60 కాయ్ ఎఎస్‌సీలో ప్రవేశాలు, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ప్రవేశాలు, జిప్‌మర్‌లో సూపర్‌వైజర్లు, ఎయిర్ ఇండియాలో ప్రవేశాలు, సీఎస్‌ఐఆర్- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రవేశాలు.

కోస్ట్‌గార్డ్‌లో నావిక్ ప్రవేశాలు,

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ (డొమిస్టిక్ బ్రాంచీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారత రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తుంది. తీరప్రాంత గస్తీలో కోస్ట్‌గార్డ్ దళాలు కీలకప్రాత పోషిస్తాయి.
INDIAN-COAST
-పోస్టులు: నావిక్ {డొమిస్టిక్ బ్రాంచీ (కుక్, స్టీవార్డ్)}
-విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, జాతీయస్థాయి క్రీడాకారులకు మార్కుల్లో 5 శాతం సడలింపు ఇస్తారు. వీటితోపాటు కింది అర్హతలు ఉండాలి..
-కుక్ పోస్టు - మెనూ ప్రకారం శాఖాహారం, మాంసాహారాలను తయారుచేయాలి. అదేవిధంగా రేషన్ అకౌంటింగ్ చేయాలి. వీటితోపాటు సంస్థ అవసరాల కోసం ఇతర పనులను కూడా అప్పగిస్తారు.
-స్టీవార్డ్ పోస్టు - ఆఫీసర్స్ మెస్‌లో ఆహారాన్ని వడ్డించడం (వెయిటర్స్), హౌస్‌కీపింగ్, ఫండ్స్ అకౌంటింగ్, వైన్స్, స్టోర్స్, మెనూ తయారీ తదితరాలు చూడాలి.
-వయస్సు: 2018, ఏప్రిల్ 1 నాటికి 18 - 22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1996, ఏప్రిల్ 1 నుంచి 2000, మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు 157 సెం.మీ., ఛాతీ గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ., మంచి కంటిచూపు, వినికిడి శక్తి కలిగి ఉండాలి.
-పే & అలవెన్స్‌లు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ. 21,700/- వీటికి అదనంగా డీఏ, ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
-పదోన్నతులు: ప్రధాన అధికారి స్థాయి వరకు పదోన్నతి పొందవచ్చు. ఈ పోస్టు బేసిక్ పే రూ. 47,600/-
-ఇతర సౌకర్యాలు : రేషన్, దుస్తులు, ఉచిత వైద్యం (కుటుంబ సభ్యులకు కూడా), ఉచిత వసతి సౌకర్యం, క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, వైద్యపరీక్షల ద్వారా
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథ్స్, జనరల్ సైన్సెస్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ (కరెంట్ అఫైర్స్, జీకే), రీజనింగ్
(వెర్బల్, నాన్ వెర్బల్).
-రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ). ఈ పరీక్షలు నిర్వహించడానికి కనీసం 2- 3 రోజులు పడుతుంది.
-పీఎఫ్‌టీ: 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 ఉతక్, బైటక్‌లు, 10 ఫుషప్‌లు చేయాలి.
-పీఎఫ్‌టీలో అర్హత సాధించినవారికి రాతపరీక్షల్లో వచ్చిన మెరిట్ ప్రకారం వైద్యపరీక్షలకు ఎంపికచేస్తారు. వైద్యపరీక్షల్లో అర్హత సాధించినవారిని శిక్షణకు పంపిస్తారు. అనంతరం ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగం ఇస్తారు.
-శిక్షణ: 2018, ఏప్రిల్ నుంచి ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు.
-పరీక్ష కేంద్రాలు: ఆయా జోన్ల పరిధిలో వస్తాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి అభ్యర్థులు ఈస్టర్న్ జోన్ పరిధిలోకి వస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 16 నుంచి ప్రారంభం
-చివరితేదీ: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.go.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు,

తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ (తాత్కాలిక ప్రాతిపదికన) చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
BHEL

వివరాలు:
దేశంలో అతిపెద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ను 1964లో ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ మహారత్న హోదా కలిగి ఉంది.
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
-మొత్తం అప్రెంటీస్‌షిప్ సంఖ్య: 554
విభాగాల వారీగా ఖాళీలు:
-వెల్డర్ (జీ అండ్ ఈ)-130, ఫిట్టర్-210, టర్నర్-30, మెషనిస్ట్-30, ఎలక్ట్రీషియన్-40, మోటార్ వెహికల్ మోకానిక్-30, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్)-15, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-25, కార్పెంటర్-19, ప్లంబర్-22, ఎంఎల్‌టీ పాథాలజీ-3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. ఫిట్టర్/మెసినిస్ట్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లకు పదోతరగతి స్థాయిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి. ఎంఎల్‌టీ పాథాలజీ ట్రేడ్‌కు ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 అక్టోబర్ 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. వయోపరిమితి దృష్ట్యా ఎస్సీ, ఎసీ ్ట అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-స్టయిఫండ్: వెల్డర్, పాసా, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్‌లకు రూ. 7,350/-, మిగతా ట్రేడ్‌లకు రూ. 8270/-(ఎంఎల్‌టీ పాథాలజీ- రూ. 6,430/-) శిక్షణలో భాగంగా నెలకు కన్సాలిడేటెడ్ జీతం చెల్లిస్తారు.
-ట్రయినింగ్ పీరియడ్: ఎంఎల్‌టీ పాథాలజీ ట్రేడ్‌కు ఆరునెలలు, మిగతా అన్ని ట్రేడ్‌లకు అప్రెంటిస్ వ్యవధి 12 నెలలు.
గమనిక: మొత్తం 554 అప్రెంటిస్‌లలో ఎస్సీ (19%), ఎస్టీ (11%), ఓబీసీ-(27%), పీహెచ్ (3%) వెయిటేజీతో అభ్యర్థులకు ఖాళీలను కేటాయించారు.
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. అర్హులైన అభ్యర్థులు మొదట www.apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత బీహెచ్‌ఈఎల్ తిరుచిరాపల్లి వెబ్‌సైట్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్‌కు రిజస్టర్ చేసుకోవాలి. ఆన్‌లైన్ హార్డ్‌కాపీని ప్రింట్ తీసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు డౌన్‌లోడ్ చేసిన అఫ్లికేషన్ ఫామ్‌ను చూపించాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 18
-ఎంపికైన అభ్యర్థుల జాబితా తేదీ: అక్టోబర్ 21
-వెబ్‌సైట్: www.bheltry.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సికింద్రాబాద్, 60 కాయ్ ఎఎస్‌సీలో ప్రవేశాలు,
సికింద్రాబాద్‌లోని 60 కాయ్ ఎఎస్‌సీ (ఎస్‌యూపీ) టైప్ జీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ASC

వివరాలు: 60 కాయ్ ఎఎస్‌సీ (ఎస్‌యూపీ) టైప్ జీ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 50
-సివిలియన్ మోటార్ డ్రైవర్-4, కుక్-1, ఫైర్‌మెన్-21, లేబర్-16, చౌకీదార్ (ఎంటీఎస్)-8
-వయస్సు: 2017 అక్టోబర్ 27 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
-అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. సివిలియన్ మోటార్ డ్రైవర్‌కు హెవీ వెహికిల్ లైసెన్స్, కుక్ పోస్టుకు ఇండియన్ కుకింగ్‌లో పరిజ్ఞానం, ఫైర్‌మెన్, లేబర్, చౌకీదార్ (ఎంటీఎస్) పోస్టులకు సంస్థ నిబంధనల మేరకు శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. సంస్థ నిర్వహించే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-రాత పరీక్షలో జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్-15 , న్యూమరికల్ ఆప్టిట్యూడ్-10, జనరల్ ఇంగ్లిష్-10, జనరల్ అవేర్‌నెస్-15 అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-ఆబ్జెక్టివ్ పద్ధతిలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కనీసం 100 మార్కులకు 40 మార్కులను సాధించాలి.
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: Commandant, 60, Coy ASC (Sup), Type G, Trimulagherry, P.O, Secunderabad- 500015, Telangana
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు అక్టోబర్ 7-13 వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ప్రవేశాలు,
కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్‌ఈఆర్) లో స్కౌట్స్ అండ్ గైడ్ కోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్ -సీ, డీ పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది..
Indian-Railways

వివరాలు:
-గ్రూప్ సీ- 2 పోస్టులు
-గ్రూప్ డీ - 8 పోస్టులు
-అర్హత: ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. గ్రూప్ డీ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత. ప్రెసిడెంట్ స్కౌట్, గైడ్, రోవర్, రేంజర్ హిమాలయన్ ఉడ్ బ్రిడ్జి సభ్యత్వం ఉండాలి.
-వయస్సు: 18 -31 ఏండ్ల (గ్రూప్ సీ పోస్టులకు 18 -28 ఏండ్లు) మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ.1800/- (గ్రూప్ సీ పోస్టులకు గ్రేడ్ పే రూ. 1900/-)
-ఎంపిక: రాత పరీక్ష, స్కౌట్ స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనా లో పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 18
-వెబ్‌సైట్:www.ser.indianrailways.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో సూపర్‌వైజర్లు,
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
jipmer

వివరాలు: భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ ఇది.
-పోస్టు పేరు: సూపర్‌వైజర్-2 ఖాళీలు
-అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు సోషియాలజీ/సోషల్ వర్క్‌లో పీజీ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత. హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-పోస్టు పేరు: మల్టీపర్పస్ వర్కర్-6 ఖాళీలు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, హాస్పిటల్‌లో రెండ్లేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: www.jipmer.edu.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో ప్రవేశాలు,
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: ఈ పోస్టులను ఈస్టర్న్ పరిధిలోని కోల్‌కతా ప్రదేశంలో మూడేండ్ల వరకు భర్తీచేస్తారు.
-పోస్టు పేరు: డ్రైవర్ -15 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-3, ఎస్సీ-3)
-అర్హత : గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతితోపాటు. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్, లైట్ కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
-పోస్టు పేరు: డ్రైవర్ -60 పోస్టులు (జనరల్-32, ఓబీసీ-13, ఎస్సీ-13, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత. ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ సెక్టార్‌లో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 15,418/-
-ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో అవసరమైన ర్టిఫికెట్లతో పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ తేదీన హాజరుకావాలి.
-ఇంటర్వ్యూతేదీ: అక్టోబర్ 30
-వెబ్‌సైట్: www.airindia.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రవేశాలు.
సీఎస్‌ఐఆర్- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
csir
వివరాలు:సీఈఆర్‌ఐ కరైకుడిలో ఉంది. ఇది సీఎస్‌ఐఆర్ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-ఖాళీల సంఖ్య - 2
-అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 55 శాతం
మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూతేదీ: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.cecri.res.in

0 comments:

Post a Comment