Sunday, 15 October 2017

బీడీఎల్‌లో 52 ఖాళీలు, తెలంగాణ వ్యవసాయశాఖలో 851 ఏఈవోలు ఉద్యోగాలు, నిమ్స్‌లో పీజీ, పారామెడికల్ కోర్సులు, ఐఐటీ భువనేశ్వర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఎన్‌సీఎల్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.

బీడీఎల్‌లో 52 ఖాళీలు,

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bharat-dynamics
వివరాలు:బీడీఎల్‌ను భారత రక్షణ శాఖ పరిధిలో 1970లో ఏర్పాటు చేశారు. ఇది మినీరత్న కేటగిరీ గల సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 52
విభాగాల వారీగా ఖాళీలు: -ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పీ అండ్ ఏ)-1, కంపెనీ సెక్రటరీ-1, డిప్యూటీ జనరల్ మేనేజర్
(పీ అండ్ ఏ)-1, మేనేజర్/సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)-2, మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్)-1, మేనేజర్/డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)-3, మేనేజర్/డిప్యూటీ మేనేజర్ (సివిల్)-2, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, పీ అండ్ ఏ)-19, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ)-24 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, , ఎమ్మెస్సీ (ఫిజిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్), ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, కంపెనీ సెక్రటరీ, లా, మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు తప్ప మిగతా పోస్టులన్నింటికి అనుభవం ఉండాలి.
-పే స్కేల్: డిప్యూటీ మేనేజర్‌కు రూ. 20,600-46,500/-, మేనేజ్‌మెంట్ ట్రెయినీ
రూ. 16,400-40,500/-, మేనేజర్‌కు 24,900-50,500/-, వివిధ పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేళ్లు ఉన్నాయి.
-వయస్సు: 2017 అక్టోబర్ 28 నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏండ్లు, మేనేజ్‌మెంట్ ట్రెయినీకి 27 ఏండ్లు (సేఫ్టీ, ఫైనాన్స్‌కు 28 ఏండ్లు), మేనేజర్‌కు 40 ఏండ్లు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, బీడీఎల్ ఉద్యోగులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ, మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్‌తీసి అవసరమైన సర్టిఫికెట్లను జతపరచి పర్సనల్ అధికారికి పంపాలి. మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు మినహాయింపు ఉంది (పంపించాల్సిన అవసరం లేదు).
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 14
-దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 28
-హార్డ్‌కాపీలకు చివరి తేదీ: నవంబర్ 6
-వెబ్‌సైట్: http://bdl-india.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తెలంగాణ  వ్యవసాయశాఖలో 851 ఏఈవోలు ఉద్యోగాలు,
తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లోని సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AGRICULTURE 
వివరాలు: ఈ పోస్టులను పాతజిల్లాలవారీగా భర్తీచేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. 
-మొత్తం పోస్టుల సంఖ్య: 851 (జనరల్ అభ్యర్థులకు-544, మహిళా అభ్యర్థులకు-307)
విద్యార్హతలవారీగా ఖాళీలు: 
-డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్-340 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-96, మహిళలు-48), బీసీ ఏ (జనరల్-16, మహిళలు-9), బీసీ బీ (జనరల్-18, మహిళలు-12), బీసీ సీ (జనరల్-4, మహిళలు-1), బీసీ డీ (జనరల్-15, మహిళలు-9), బీసీ ఈ (జనరల్-12, మహిళలు-7), ఎస్సీ (జనరల్-34, మహిళలు-17), ఎస్టీ (జనరల్-8, మహిళలు-9).
-జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-30, కరీంనగర్-31, వరంగల్-36, ఖమ్మం-30, రంగారెడ్డి-31, మహబూబ్‌నగర్-86, మెదక్-48, నల్లగొండ-35, నిజామాబాద్-13
-డిప్లొమా/బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్-88 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-25, మహిళలు-15), బీసీ ఏ (జనరల్-6, మహిళలు-3), బీసీ బీ (జనరల్-5, మహిళలు-1), బీసీ సీ (జనరల్-2), బీసీ డీ (జనరల్-2, మహిళలు-3), బీసీ ఈ (జనరల్-1, మహిళలు-3), ఎస్సీ (జనరల్-5, మహిళలు-4), ఎస్టీ (జనరల్-5).
-జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-9, కరీంనగర్-7, వరంగల్-8, ఖమ్మం-9, రంగారెడ్డి-8, మహబూబ్‌నగర్-22, మెదక్-13, నల్లగొండ-8, నిజామాబాద్-4
-బీఎస్సీ అగ్రికల్చర్-345 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-103, మహిళలు-52), బీసీ ఏ (జనరల్-18, మహిళలు-7), బీసీ బీ (జనరల్-20, మహిళలు-9), బీసీ సీ (జనరల్-4, మహిళలు-1), బీసీ డీ (జనరల్-16, మహిళలు-6), బీసీ ఈ (జనరల్-10, మహిళలు-5), ఎస్సీ (జనరల్-33, మహిళలు-15), ఎస్టీ (జనరల్-16, మహిళలు-5).
-జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-28, కరీంనగర్-31, వరంగల్-37, ఖమ్మం-35, రంగారెడ్డి-30, మహబూబ్‌నగర్-90, మెదక్-47, నల్లగొండ-35, నిజామాబాద్-12
-బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ )-78 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-24, మహిళలు-11), బీసీ ఏ (జనరల్-1, మహిళలు-8), బీసీ బీ ( మహిళలు-2), బీసీ సీ (జనరల్-1), బీసీ డీ ( మహిళలు-1), బీసీ ఈ (మహిళలు-1), ఎస్సీ (జనరల్-8, మహిళలు-9), ఎస్టీ (మహిళలు-4).
-జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-6, కరీంనగర్-7, వరంగల్-8, ఖమ్మం-7, రంగారెడ్డి-7, మహబూబ్‌నగర్-21, మెదక్-11, నల్లగొండ-8, నిజామాబాద్-3
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు లేదా సంస్థ నుంచి.. కింది వాటిలో ఏదైనా కోర్సులో ఉత్తీర్ణత అయి ఉండాలి.
1) బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ (మూడు/నాలుగేండ్ల కోర్సు)లో ఉత్తీర్ణత.
2) అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
3) అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లో డిప్లొమా (సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ ప్రొటెక్షన్, ఆర్గానిక్ ఫార్మింగ్)లో ఉత్తీర్ణత.
4) బ్యాచిలర్ సైన్స్ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
గమనిక: ప్రకటించిన ఖాళీలను పైన పేర్కొన్న విద్యార్హతల ఆధారంగా 4:1:4:1 నిష్పత్తిలో భర్తీచేస్తారు.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. జనాభా గణన విభాగంలో 6 నెలలపాటు పనిచేసినవారు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌ఎన్‌సీ ఇన్‌స్ట్రక్టర్‌కు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లవరకు సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 22,460-66,330/-
-ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ. 200/-, ఎగ్జామినేషన్ ఫీజు రూ. 80
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-ఆబ్జెక్టివ్ రాతపరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది.
-పేపర్-1 (జనరల్ స్టడీస్-150 మార్కులు) పేపర్-2 (సంబంధిత సబ్జెక్ట్ -150 మార్కులు) 
-ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలను ఇస్తారు.
-ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం- 150 నిమిషాలు.
-జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ (డిప్లొమా లెవల్) వారికి సంబంధిత సబ్జెక్ట్ పేపర్ ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31
-ఆబ్జెక్టివ్ పరీక్ష: నవంబర్ 22

-వెబ్‌సైట్: www.tspsc.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్‌లో పీజీ, పారామెడికల్ కోర్సులు,
హైదరాబాద్‌లో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పీజీ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
nizams
వివరాలు:నిమ్స్‌ను 1980లో ఏర్పాటు చేశారు.
కోర్సుల వారీగా సీట్ల సంఖ్య:
-మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ- 15
-పారామెడికల్ పీజీ డిప్లొమా- 108
-అర్హత: సైన్స్ లేదా లైఫ్ సైన్సెస్‌లో బీఎస్సీ.
-వయస్సు: 20-30 ఏండ్ల మధ్య ఉండాలి.
-కోర్సు కాలవ్యవధి: 2 ఏండ్లు
-ఎంపిక విధానం: డిగ్రీ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపిచాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 25
-మెరిట్ జాబితా: నవంబర్ 10
-వెబ్‌సైట్: www.nims.edu.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ భువనేశ్వర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పీహెచ్‌డీ కోర్సులో ్ల ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT
కోర్సు వివరాలు:
పీహెచ్‌డీ పోగ్రామ్:
-విభాగాలు: ఎర్త్ ఓషియన్ అండ్ ైక్లెమేట్ సైన్సెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ సైన్స్, మెకానికల్ సైన్స్, మినరల్స్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, బేసిక్ సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్
-అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్/మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 250/-
-ఎంపిక: గేట్ స్కోర్, యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: www.iitbbs.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఎల్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (ఎన్‌సీఎల్) ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
NCL-BUILDING 
వివరాలు: ఎన్‌సీఎల్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ 
-మొత్తం పోస్టుల సంఖ్య: 6
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగం/విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: 25,000/-
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
-దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 16
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 24

-వెబ్‌సైట్: recruit.ncl.res.in

0 comments:

Post a Comment