Sunday, 15 October 2017

ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఐఐఆర్‌ఆర్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఎఫ్‌సీఐలో 408 ఖాళీలు, హెచ్‌ఎంటీలో ఇంజినీర్లు ఉద్యోగాలు, ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా, పానిపట్ రిఫైనరీలో స్పెషల్ డ్రైవ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రొబేషనరీ ఇంజినీర్లు, సీఎస్‌ఐఆర్-సీబీఆర్‌ఐలో సైంటిస్టులు.

ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు ఉద్యోగాలు,

ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలిజియస్ టీచర్)గా పనిచేయడానికి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indian-army 
వివరాలు: భారతదేశాన్ని అనుక్షణం రక్షించే దళాలలో ఇండియన్ ఆర్మీ ఒకటి. ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షిండంతోపాటు దేశంలో శాంతి భద్రతలను 
కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం.
-పోస్ట్ పేరు: జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలిజియస్ టీచర్)
-మొత్తం ఖాళీల సంఖ్య: 72
విభాగాల వారీగా ఖాళీలు:
-పండిట్స్-63, గ్రాంథి-2, పాద్రీ-1, పండిట్ (గోర్ఖా)-3, మౌల్వి (షియా)-1, బోధ్ మంక్ (మహాయాన)-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలోసంస్కృతం/హిందీ/అరబిక్/ఉర్దూ భాషలను మెయిన్ సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
-వయస్సు: 2017 అక్టోబర్ 10 నాటికి 27 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి. 1984 అక్టోబర్ 1 నుంచి 1991 అక్టోబర్ 30 మధ్య జన్మించి ఉండాలి. 
-శారీరక ప్రమాణాలు: ఎత్తు- 160 సెం.మీ., ఛాతీ గాలి పీల్చినపుడు 77 నుంచి 82 సెం.మీ. వరకు వ్యాకోచం చెందాలి. 
-బరువు: కనీసం 50 కేజీలు ఉండాలి (ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి). ఐదు నిమిషాల 45 సెకండ్లలో 1600 మీటర్ల పరుగు పందెంలో అర్హతను సాధించాలి.
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ అవేర్‌నేస్ (పేపర్ 1)కు 100 మార్కులు, సంబంధిత రిలిజియస్ భాష (పేపర్ 2)కు 100 మార్కులు ఉంటుంది. ప్రతి అభ్యర్థి పేపర్ 1 అండ్ పేపర్ 2లో కనీసం 40 శాతం అర్హత మార్కులను సాధించాలి.
-పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది
-పేపర్ - 1 అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పేపర్ 2లో సాధించిన మార్కులను మెరిట్‌లిస్ట్ పరిగణనలోకి తీసుకుంటారు.
-రాతపరీక్షలో ప్రతిభ చూపిన మెరిట్ అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
-ఇంటర్వ్యూ, పేపర్ - 2లో సాధించిన మార్కులను ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేసి తుది జాబితాను తయారు చేస్తారు.
-రాతపరీక్షను 2018 ఫిబ్రవరి 25న, ఇంటర్వ్యూను 2018 మార్చి 30న నిర్వహించనున్నారు. 
-ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులను విజయవంతంగా ట్రైనియింగ్ పూర్తియిన తర్వాత ఇండియన్ ఆర్మీ సర్వీసెస్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా తీసుకుంటారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 8

-వెబ్‌సైట్: www.indanarmy.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఆర్‌ఆర్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIRR-BUILDING 
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
-అర్హత: మాస్టర్ డిగ్రీ/పీజీ (అగ్రికల్చర్), పీజీ (బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, బాటనీ)లో ఉత్తీర్ణత. నెట్‌లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్ : రూ. 25,000 + హెచ్‌ఆర్‌ఏ
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: పూర్తి వివరాలతో దరఖాస్తులను నింపి, అవసరమైన ఒరిజనల్ సర్టిఫికెట్లతో పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
చిరునామా:ICAR- Indian Institute of Rice Research, Rajendranagar, Hyderabad. 
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 4 

-వెబ్‌సైట్: www.drricar.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎఫ్‌సీఐలో 408 ఖాళీలు,

ఉత్తర ప్రదేశ్ రీజియన్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Food-Corporation
-పోస్టు పేరు: వాచ్‌మెన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 408 (జనరల్-208, ఓబీసీ-110, ఎస్సీ-86, ఎస్టీ-4, )
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 8,100-18,070/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
-ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, పీఈటీ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 6
-వెబ్‌సైట్: www.fciupjobs.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌ఎంటీలో ఇంజినీర్లు ఉద్యోగాలు,

బెంగళూరులోని హెచ్‌ఎంటీ (ఇంటర్నేషనల్) లిమిటెడ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజర్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
HMT 
-మొత్తం పోస్టులు: 9
-అసిస్టెంట్ జనరల్ మేనేజర్-1, డిప్యూటీ మేనేజర్-1, డిప్యూటీ ఇంజినీర్-5, మార్కెటింగ్ పర్ఛేస్/కమర్షియల్ అసిస్టెంట్-2
-అర్హత: బీఈ/బీటెక్+ఎంబీఏ, సీఏ, బీకాం/బీబీఏ, బీబీఎంలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు (పోస్టులను బట్టి వయోపరిమితిలో సడంపు ఉంటుంది)
-పే స్కేల్ : డిప్యూటీ ఇంజినీర్‌కు రూ. 16,400 40,500 /-, అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, తదితర అలవెన్స్‌లు ఉంటాయి (మిగతా పోస్టులకు వేర్వేరుగా పే స్కేల్ ఉన్నాయి) 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 30

-వెబ్‌సైట్ : http://www.hmti.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా,

నాగ్‌పూర్‌లోని నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ) ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ విభాగంలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
npti
కోర్సు పేరు: పీజీ డిప్లొమా (ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్)
-మొత్తం సీట్ల సంఖ్య: 60
-కోర్సు వ్యవధి: 26 వారాలు
-అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పవర్ ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్)లో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
-దరఖాస్తు ఫీజు: రూ. 500/- (డీడీ రూపంలో చెల్లించాలి)
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ: నవంబర్ 1
-వెబ్‌సైట్: www.nptinagpur.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పానిపట్ రిఫైనరీలో స్పెషల్ డ్రైవ్,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పానిపట్ రిఫైనరీ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (పీహెచ్‌సీ అభ్యర్థులు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IndianOil
-పోస్టు పేరు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీల సంఖ్య: 19
-విభాగాలు: ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ మెయింటెనెన్స్, మెటీరియల్స్, ఫైనాన్స్
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఫైనాన్స్ విభాగానికి బీకాంలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రొఫెషియెన్సీ టెస్ట్ ద్వారా. అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 3
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: నవంబర్ 11
-రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 3
-వెబ్‌సైట్:www.iocrefrecruit.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రొబేషనరీ ఇంజినీర్లు,
మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆప్టిక్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BEL
-పోస్టు పేరు: ప్రొబేషనరీ ఇంజినీర్- 3 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ (టెక్), ఎంటెక్ (అప్లయిడ్ ఆప్టిక్స్)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు .
-పే స్కేల్: రూ. 16,400-40,500/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-,
-ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 3
-వెబ్‌సైట్: www.bel-india.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్-సీబీఆర్‌ఐలో సైంటిస్టులు.
రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య:19
-సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్-17 ఖాళీలు
-సీనియర్ సైంటిస్ట్/ప్రిన్సిపాల్ సైంటిస్ట్-2 ఖాళీలు
-అర్హత: సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్), ఎం ఆర్క్, ఎమ్మెస్సీ (కెమిస్రీ, ఫిజిక్స్ ), సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ/పీజీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: సైంటిస్ట్‌కు 32 ఏండ్లు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 37 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: సైంటిస్ట్ పోస్టులకు రూ. 67,700+ డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 78,800 + డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా చెల్లిస్తారు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: అక్టోబర్ 23
-వెబ్‌సైట్ : http://cbri.res.in

0 comments:

Post a Comment