Tuesday, 24 October 2017

ఇస్రోలో ఉద్యోగాలు, సమీర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు, ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు, బామర్ లారీలో అప్రెంటిస్‌లు, ఈఎస్‌ఎస్‌వో ప్రాజెక్ట్ సైంటిస్టులు, ఎన్‌ఐఈ ఎంపీహెచ్ కోర్సు, కంటోన్మెంట్ హాస్పి టల్‌లో ఉద్యోగాలు, ఎస్‌ఎస్‌సీ జేఈ ఎగ్జామినేషన్ - 2017.

ఇస్రోలో ఉద్యోగాలు,

తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎస్సీ) సివిల్, ఎలక్ట్రికల్ విభాగంల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 9
-పోస్టు పేరు: ఇంజినీర్ (సివిల్-8, ఎలక్ట్రికల్-1)
-అర్హత: ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. 
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 3
-వెబ్‌సైట్: www.lpsc.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సమీర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు,

ముంబై ఐఐటీ క్యాంపస్‌లోని సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్ (సమీర్) ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Society
-పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 14 (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్-11, కంప్యూటర్ సైన్స్-2, మెకానికల్-1)
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: రూ. 10,000/- అదనంగా ఫుడ్, ట్రావెల్ సాకర్యాలు కల్పిస్తారు.
-వయస్సు : 25 ఏండ్లకు మించరాదు
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 25
-వెబ్‌సైట్: http://www.sameer.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు,
భోపాల్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగానున్న నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IISER-BHOPAL
-మొత్తం పోస్టుల సంఖ్య: 10
-అసిస్టెంట్ రిజిస్ట్రార్ హిందీ ఆఫీసర్ (రాజభాష)-1, అసిస్టెంట్ రిజిస్ట్రార్-1, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1, ఆఫీస్ అసిస్టెంట్ (ఎంఎస్)-2, జూనియర్ అసిస్టెంట్ (ఎంఎస్)-1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-1, సైంటిఫిక్ అసిస్టెంట్-1, ల్యాబ్ టెక్నీషియన్-1 
-అర్హత: మాస్టర్ డిగ్రీ/పీజీ, బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలోఅనుభవం.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.iiserb.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బామర్ లారీలో అప్రెంటిస్‌లు,
న్యూఢిల్లీలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్‌లో టికెటింగ్/ ట్రావెల్ కన్సల్టెంట్ విభాగంలో అప్రెంటిస్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Balmer-Lawrie
వివరాలు: బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ అనేది పెట్రోలియం, సహజవాయువుల శాఖ ఆధ్వర్యలో నడిచే సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 20 (టికెటింగ్-10, ట్రావెల్-10)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌లో ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ : అక్టోబర్ 31
-వెబ్‌సైట్: https://careers.balmerlawrie.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఎస్‌ఎస్‌వో ప్రాజెక్ట్ సైంటిస్టులు,

పుణెలోని ఎర్త్ సిస్టం సైన్స్ ఆర్గనైజేషన్ (ఈఎస్‌ఎస్‌వో) ప్రాజెక్ట్ సైంటిస్ట్, అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఈఎస్‌ఎస్‌వో పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయోరాలజీ (ఐఐటీఎం)లో ప్రస్తుత ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను పూర్తి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీచేయనున్నారు.
TROPMET
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ డీ - 10 ఖాళీలు
-పేస్కేల్: రూ. 68,000 + హెచ్‌ఆర్‌ఏ
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ సీ - 20 ఖాళీలు
-పేస్కేల్: రూ. 58,000 + హెచ్‌ఆర్‌ఏ
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీ - 26
-పేస్కేల్: రూ. 49,000 + హెచ్‌ఆర్‌ఏ
-విజిటింగ్ సైంటిస్ట్ - 1
-పేస్కేల్: రూ. 50,000/- (కన్సాలిడేటెడ్)
-జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 1
-పేస్కేల్: రూ. 29,200 + హెచ్‌ఆర్‌ఏ
-ప్రాజెక్ట్ మేనేజర్ - 1
-పేస్కేల్: రూ. 68,000 + హెచ్‌ఆర్‌ఏ
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 1
-పేస్కేల్: రూ. 22,000 + ప్రతి ఏడాది 3 శాతం పెంచుతారు.
-యూడీసీ - 8 పోస్టులు
-పేస్కేల్: రూ. 25,500 + హెచ్‌ఆర్‌ఏ
-సెక్షన్ ఆఫీసర్ - 2 ఖాళీలు
-పేస్కేల్: రూ. 49,000 + హెచ్‌ఆర్‌ఏ
-కంప్యూటర్ అప్లికేషన్ సపోర్టింగ్ సైంటిస్ట్ - 1
-పేస్కేల్: రూ. 75,000 /-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (రేపటి నుంచి)
-చివరితేదీ: నవంబర్ 19
-వెబ్‌సైట్: http://www.tropmet.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈ ఎంపీహెచ్ కోర్సు,
చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ (ఎన్‌ఐఈ) 2018-19 విద్యా సంవత్సరానికి ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIE-Chennai-Recrui
వివరాలు: ఈ కోర్సును ఐసీఎంఆర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
-కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్ )
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.nie.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కంటోన్మెంట్ హాస్పి టల్‌లో ఉద్యోగాలు,

బొల్లారం కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నది. 
-మొత్తం ఖాళీల సంఖ్య - 6
-గైనకాలజిస్ట్ - 2, ఆప్తల్మాలజిస్ట్ - 1, ఎండీ జనరల్ మెడిసిన్ - 1, రేడియాలజిస్ట్ - 1, ల్యాబ్ టెక్నీషియన్ - 1 ఖాళీ ఉన్నాయి.
-ఈ పోస్టులను గౌరవ వేతనం ప్రాతిపదికన నియమిస్తారు.
-గౌరవవేతనం: ల్యాబ్ టెక్నీషియన్‌కు నెలకు రూ. 21,230/- మిగిలిన అన్ని పోస్టులకు నెలకు రూ. 49,870/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ: అక్టోబర్ 23న 
-ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం: కంటోన్మెంట్ హాస్పిటల్, బొల్లరం, సికింద్రాబాద్.
-వెబ్‌సైట్: www.scb.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఎస్‌సీ జేఈ ఎగ్జామినేషన్ - 2017.

ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఖాళీలు
-రాతపరీక్ష ద్వారా ఎంపిక
-కేంద్ర కొలువులు, ఆకర్షణీయమైన జీతభత్యాలు
-స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా పరీక్షల నిర్వహణ

కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.
reet-exam 

వివరాలు: కేంద్రంలోని పలు శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-పోస్టు: జూనియర్ ఇంజినీర్స్ (గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్).
-పేస్కేల్: రూ. 35,400 - 1,12,400/- (పే మ్యాట్రిక్స్‌లో లెవల్ - 6)
సంస్థలు, విభాగాలవారీగా ఖాళీలు:
-సెంట్రల్ వాటర్ కమిషన్, సీపీడబ్ల్యూడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, ఎంఈఎస్, ఫరక్కా బ్యారేజ్ (ప్రాజెక్ట్), డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లలో - జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్) పోస్టులు ఉన్నాయి.
-సీపీడబ్ల్యూడీ, ఎంఈఎస్, ఫరక్కా బ్యారేజీ (ప్రాజెక్ట్), డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్, క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లలో - జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు ఉన్నాయి.
-వయస్సు: సెంట్రల్ వాటర్ కమిషన్, సీపీడబ్ల్యూడీ విభాగాల్లో ఖాళీలకు 32 ఏండ్లు మించరాదు.
-డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లో ఖాళీలకు 27 ఏండ్లు మించరాదు.
-మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో జేఈ (సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీర్) పోస్టులకు 30 ఏండ్లు, క్వాలిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ పోస్టులకు 27 ఏండ్లు మించరాదు.
-ఫరక్కా ప్రాజెక్ట్, డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్, నేవల్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
SSC-JE-LOGO 
-అర్హతలు: 2018, జనవరి 1 నాటికి కింది విద్యార్హతలు కలిగి ఉండాలి..
-జూనియర్ ఇంజినీర్ పోస్టుకు - గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. లేదా డిగ్రీ ఇన్ సివిల్/ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. 
-ఎంఈఎస్‌లోని పోస్టులకు పై అర్హతలతోపాటు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఎంఈఎస్‌లో జూనియర్ ఇంజినీర్ (క్వాంటిటీ, సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్)పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ (ఇండియా) బిల్డింగ్ సర్వేయింగ్ సబ్ డివిజనల్ - 2లో ఇంటర్ ఉత్తీర్ణత. 
-బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో జూనియర్ ఇంజినీర్ సివిల్ పోస్టులకు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ నేవల్‌లో పోస్టులకు రెండేండ్ల అనుభవం ఉండాలి.
నోట్: పూర్తి అర్హతలకు సంబంధించిన వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
పరీక్ష విధానం: 
-పేపర్ - 1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. 
-పేపర్ - 1 పరీక్షను 2018, జనవరి 5 - 8 వరకు 
-పేపర్ - 1లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి పేపర్ - 2కు ఎంపికచేస్తారు.
-పేపర్ - 2ను కన్వెన్షనల్ టైప్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్షతేదీని తరువాత ప్రకటిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 17
-వెబ్‌సైట్: http://ssc.nic.in

0 comments:

Post a Comment