Wednesday, 18 October 2017

ఎన్‌సీసీఎస్‌లో సైంటిస్టులు, ఐఆర్‌ఎస్‌డీసీలో సివిల్ ఇంజినీర్లు, ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగాలు, ఓఎన్‌జీసీలో సేఫ్టీ ఆఫీసర్లు, ఎన్‌టీసీఎల్‌లో ఉద్యోగాలు, లోక్‌సభ టీవీలో ఖాళీలు, బీఈఎల్192 ఉద్యోగాలు.

ఎన్‌సీసీఎస్‌లో సైంటిస్టులు,

పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCCS
వివరాలు:ఎన్‌సీసీఎస్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: సైంటిస్ట్ బీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 4 (జనరల్-3, ఓబీసీ-1)
-అర్హత: ఎంటెక్/ఎండీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మా, ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ)/పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: 63,412/-
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్.
-చివరి తేదీ: నవంబర్ 1
-వెబ్‌సైట్: http://www.nccs.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఆర్‌ఎస్‌డీసీలో సివిల్ ఇంజినీర్లు,
న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌ఎస్‌డీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IRSDC
వివరాలు:సైట్ ఇంజినీర్-1, సివిల్ ఇంజినీర్-2,
ఎలక్ట్రికల్ ఇంజినీర్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం.
-వయస్సు: 1984 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-పే స్కేల్: రూ. 29,120/-
-ఎంపిక:రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ : నవంబర్ 6
-వెబ్‌సైట్:www.irsdc.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగాలు,
ఆంధ్రాబ్యాంక్‌లో కౌన్సెలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఆంధ్రాబ్యాంక్ ట్రస్ట్ జన చేతన ఫైనాన్షియల్ లిటరసీ అండ్ క్రెడిట్ కౌన్సెలింగ్ ట్రస్ట్ ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పోస్టులు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
AB-BANK 

-పోస్టు: ఎఫ్‌ఎల్‌సీ కౌన్సెలర్స్
-ఖాళీల సంఖ్య - 18
-అర్హతలు: పదవీ విరమణ చేసిన బ్యాంక్ ఆఫీసర్లు (స్కేల్ -2లోపు వారు) లేదా వీఆర్‌ఎస్ తీసుకొన్నవారు వీటికి అర్హులు.
-వయస్సు: గరిష్ఠ వయోపరిమితి 62 ఏండ్లు మించరాదు.
-జీతం: నెలకు రూ. 20,000/- ఇస్తారు.
-కాలపరిమితి: ఏడాది. అవసరాన్ని బట్టి మరికొంత కాలం కాంట్రాక్టు పొడిగించవచ్చు.
-పనిచేయాల్సిన ప్రదేశాలు: మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ (రూరల్), నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట & ముచ్చింతల (ఆర్‌ఆర్ జిల్లా).
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ: అక్టోబర్ 20

-వెబ్‌సైట్: https://www.andhrabank.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓఎన్‌జీసీలో సేఫ్టీ ఆఫీసర్లు,
డెహ్రాడూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)లో ఖాళీగా ఉన్న సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ. ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థ. దీన్ని 1956 ఆగస్టు 14న స్థాపించారు.
ongc
-పోస్టు పేరు: సేఫ్టీ ఆఫీసర్
-మొత్తం ఖాళీల సంఖ్య-9
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఆర్మ్‌డ్ ఫోర్సెస్/ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్‌లో రెండేండ్లపాటు పనిచేసి ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
-పే స్కేల్: 24,900-50,500/-
-ఎంపిక విధానం:ఆన్‌లైన్‌టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 4
-వెబ్‌సైట్: www.iisc.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీసీఎల్‌లో ఉద్యోగాలు,
నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీసీఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ సూపర్‌వైజర్, క్లరికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
 

వివరాలు: 
ఎన్‌టీసీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది నూలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తి చేసే మిల్లులను నిర్వహిస్తుంది. దీన్ని 1968లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 40
-పోస్టు పేరు: క్లరికల్ స్టాఫ్-26 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. 6 నెలల కంప్యూటర్ కోర్సులో ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.4200-4625/- అదనంగా ప్రాంతాలవారీగా వేర్వేరుగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్స్‌లు చెల్లిస్తారు.
-పోస్టు పేరు: సెక్యూరిటీ సూపర్‌వైజర్-14 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 11,600-26,000+డీఏ, 
హెచ్‌ఆర్‌ఏ, తదితర అలవెన్స్‌లు ఇస్తారు.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో 
దరఖాస్తులను నింపి, పర్సనల్ అధికారికి పంపాలి. 
-చివరి తేదీ: అక్టోబర్ 30
-వెబ్‌సైట్: http://ntcltd.org----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లోక్‌సభ టీవీలో ఖాళీలు,
పార్లమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోని లోక్‌సభ టెలివిజన్ (ఎల్‌ఎస్‌టీవీ)లో ప్రొడక్షన్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తదితర పోస్టుల (కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
LOKHSABHA

వివరాలు:
-సీనియర్ ప్రొడ్యూసర్-4(హిందీ -2, ఇంగ్లిష్ - 2)
-జీతం: రూ. 75,000 - 90,000/-
-అర్హతలు: డిగ్రీతోపాటు కనీసం 12 ఏండ్లు ప్రింట్/ఎలక్ట్రానిక్ లేదా ఆన్‌లైన్‌లో మీడియాలో పనిచేసిన అనుభవం. దీనిలో కనీసం ఐదేండ్లు ఇన్‌పుట్/అవుట్‌పుట్ లేదా అసెన్‌మెంట్స్/ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ టెలివిజన్ చేసిన అనుభవం ఉండాలి.
-ప్రొడ్యూసర్ - 3
-జీతం: రూ. 60,000 - 70,000/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం 10 ఏండ్ల అనుభవం ఉండాలి.
-గెస్ట్ కోఆర్డినేటర్ - 3
-జీతం: రూ. 40,000 - 50,000/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. టెలివిజన్/ఆన్‌లైన్ మీడియాలో కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-అసోసియేట్ ప్రొడ్యూసర్ - 2
-జీతం: రూ. 50,000 - 60,000/-
-అర్హతలు:డిగ్రీతోపాటు కనీసం 8 ఏండ్లు అనుభవం
-అసిస్టెంట్ ప్రొడ్యూసర్ - 3
-జీతం: రూ. 40,000 - 50,000/-
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 5 ఏండ్లు అనుభవం.
-యాంకర్ (ఇంగ్లిష్) కమ్ ప్రొడ్యూసర్ - 2
-జీతం: రూ. 70,000 - 80,000/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. టీవీలో యాంకర్/రిపోర్టర్‌గా కనీసం 8 ఏండ్ల అనుభవం ఉండాలి. జర్నలిజంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
-ప్రోమో ప్రొడ్యూసర్ - 1
-జీతం: రూ. 60,000 - 70,000/-
-అర్హతలు: డిగ్రీతోపాటు 8 ఏండ్లు అనుభవం.
-వీడియో ఎడిటర్ - 2
-జీతం: రూ. 45,000 - 55,000/-
-అర్హత: డిగ్రీతోపాటు ఐదేండ్ల అనుభవం, వీడియో ఎడిటింగ్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత.
-వీటితోపాటు ప్రొడక్షన్ అసిస్టెంట్ - 2, ప్రొడక్షన్ మేనేజర్ - 1, మార్కెటింగ్ మేనేజర్ - 1, మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్) -1 పోస్టు ఉన్నాయి.
-పనిచేయాల్సిన ప్రదేశం: ఢిల్లీ
-ఎంపిక: స్కిల్‌టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 13
-వెబ్‌సైట్: http://loksabhatv.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈఎల్192  ఉద్యోగాలు.
బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: అక్టోబర్ 26

bel-engineer 
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: బీఈఎల్ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న నవరత్న కంపెనీ. 
-పోస్టు: డిప్యూటీ ఇంజినీర్
నోట్: ఈ పోస్టులను రెండేండ్ల కాలపరిమితికి నియామకం చేస్తారు.
-పేస్కేల్: రూ. 16,400 - 40,500 (సీటీసీ ఏడాదికి రూ. 7.7 లక్షలు)
-మొత్తం ఖాళీలు - 192 
బ్రాంచీల వారీగా ఖాళీలు
-ఎలక్ట్రానిక్స్ - 184, మెకానికల్ - 8
-రిజర్వేషన్ల వారీగా.. జనరల్ - 96, ఓబీసీ - 52, ఎస్సీ - 29, ఎస్టీ - 15 ఖాళీలు ఉన్నాయి.
-పనిచేయాల్సిన ప్రదేశం: బెంగళూరు కాంప్లెక్స్
-అనుభవం: పరిశ్రమలో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. (ప్రొడక్షన్/ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి)
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ప్రథమశ్రేణిలో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత.లేదా ప్రథమశ్రేణిలో సంబంధిత బ్రాంచీలో ఏఎంఐఈ/ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణులైతే చాలు.
-వయస్సు: 2017, అక్టోబర్ 1 నాటికి 26 ఏండ్లు మించరాదు. పీహెచ్‌సీలకు పదేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక విధానం:
-దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపికచేస్తారు.
-రాతపరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
-రాతపరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-రాతపరీక్ష కేంద్రాలు: బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గువాహటి
-రాతపరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సంబంధిత బ్రాంచీలో బేసిక్ ఇంజినీరింగ్ సబ్జెక్టులపై, స్పెషలైజేషన్స్, జనరల్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 25
-దరఖాస్తు ఫీజు: రూ. 500/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
-అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్: నవంబర్ 17 నుంచి
-రాతపరీక్ష తేదీ: నవంబర్ 26, 2017

-వెబ్‌సైట్: http://bel-india.com

0 comments:

Post a Comment