Sunday, 29 October 2017

మధుర రిఫైనరీలో 150 అప్రెంటిస్‌లు, గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు, డీటీఆర్‌ఎల్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాలు, కాండ్లా పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు, ఏయూలో ప్రొఫెసర్లు.

మధుర రిఫైనరీలో 150 అప్రెంటిస్‌లు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పరిధిలోని మధుర రిఫైనరీలో అప్రెంటిస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులకు అవకాశం
-శిక్షణా కాలంలో స్టయిఫండ్
వివరాలు: ఐవోసీఎల్ ఒక గ్లోబల్ 500 కంపెనీ. రిఫైనరీ డివిజన్‌లోని మధుర రిఫైనరీలో ప్రస్తుత ఖాళీలు ఉన్నాయి. 1961/1973 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.
-మొత్తం ఖాళీల సంఖ్య - 150. వీటిలో జనరల్ - 76, ఎస్సీ - 31, ఎస్టీ - 1, ఓబీసీ - 42 ఖాళీలు ఉన్నాయి.

ట్రేడుల వారీగా ఖాళీలు:
-ట్రేడ్ అప్రెంటిస్/అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 40. వీటిలో జనరల్ - 20, ఎస్సీ - 9, ఓబీసీ - 11 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: మూడేండ్ల ఫుల్‌టైం బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ).
-టెక్నీషియన్ అప్రెంటిస్ - 15. వీటిలో జనరల్ - 8, ఎస్సీ - 3, ఓబీసీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: మెట్రిక్/పదోతరగతితోపాటు రెండేండ్ల ఐటీఐ (ఫిట్టర్) ఉత్తీర్ణత.
-ట్రేడ్ అప్రెంటిస్ (బాయిలర్) - 10. వీటిలో జనరల్ - 5, ఎస్సీ - 2, ఓబీసీ - 3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: మూడేండ్ల ఫుల్‌టైం బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)
-టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్) - 15. వీటిలో జనరల్ - 8, ఎస్సీ - 3, ఓబీసీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: మూడేండ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్
-టెక్నీషియన్ అప్రెంటిస్ (కెమికల్) - 40. (జనరల్ - 20, ఎస్సీ - 8, ఓబీసీ - 12)
-అర్హతలు: మూడేండ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్/ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్.
-టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్) - 20.(జనరల్ - 10, ఎస్సీ - 4, ఎస్టీ - 1, ఓబీసీ - 11)
-టెక్నీషియన్ అప్రెంటిస్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 10. (జనరల్ - 5, ఎస్సీ -2, ఓబీసీ -3)
-అర్హతలు: మూడేండ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్.
-వయస్సు: 2017, అక్టోబర్ 31 నాటికి 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
mathura-refinery

ఎంపిక విధానం:
-రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
-రాతపరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు. 40 శాతం మార్కులను క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 35 శాతం క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు.
-రాతపరీక్షలో అర్హత సాధించినవారిని 1:2 నిష్పత్తితో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపికచేస్తారు.
-స్టయిఫండ్: అప్రెంటిస్ చట్టం ప్రకారం నిర్ణయించిన కనీస వేతనాలను ఇస్తారు. వీటికి అదనంగా నెలకు రూ. 2,500/- స్టేషనరీ, ఇతరత్రా సదుపాయాలు కోసం రిఫైనరీ అందిస్తుంది.
-వీటికి అదనంగా అభ్యర్థులకు సేఫ్టీ షూస్, హెల్మెట్ (శిక్షణ ముగిసిన తర్వాత వెనకకు ఇవ్వాలి)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 11
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీ ప్రింట్‌ను కింది చిరునామాకు నవంబర్ 18లోగా చేరేలా పంపాలి. Deputy Genral Manager (HR), Indian Oil Corporation Limited, P.O. Mathura Refinery, Mathura - 281005 (Uttarpradesh)
-వెబ్‌సైట్: www.iocl.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు,

గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిజైన్ అసిస్టెంట్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఈ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీచేస్తారు.
-మొత్తం పోస్టుల సంఖ్య:20
-పోస్టు పేరు: డిజైన్ అసిస్టెంట్ (సూపర్‌వైజర్)
-విభాగాలు: ఇంజినీరింగ్, లా అండ్ డబ్ల్యూ, డిజైన్ గ్రూప్ తదితరాలు.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 అక్టోబర్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 9,900-3%-23,300/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 450/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్
-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో 100 ప్రశ్నలను ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
-జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ అంశాల నుంచి 20 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్) అంశాల నుంచి 80 ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చిరునామా: Post Box No. 3076, Lodhi Road, New Delhi 110003
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 14
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరి తేదీ: నవంబర్ 25
-రాతపరీక్ష: డిసెంబర్ 10
-వెబ్‌సైట్: www.grse.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీటీఆర్‌ఎల్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని డిఫెన్స్ టెరైన్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీటీఆర్‌ఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ 
(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
డీటీఆర్‌ఎల్ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది. 
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్-3 పోస్టులు 
-అర్హత: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఎమ్మెస్సీ (జియాలజీ, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, జియో ఇన్ఫర్మాటిక్స్/జియోమెటిక్స్) లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్. నెట్ లేదా గేట్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 8

-వెబ్‌సైట్: www.drdo.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాలు,
మణిపూర్(ఇంపాల్)లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం పోస్టుల సంఖ్య: 115 
-విబాగాలవారీగా ఖాళీలు:ప్రొఫెసర్-33, అసోసియేట్ ప్రొఫెసర్-37, అసిస్టెంట్ ప్రొఫెసర్-29, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, ఎస్‌ఎంఎస్ హార్టికల్చర్, ఆగ్రానమీ/లైవ్ స్టాక్ ప్రొడక్షన్, ఫిషరీస్ తదితర పోస్టులు-18)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ, సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి. మిగతా పోస్టులకు యూనివర్సిటీ నింబంధనల మేరకు అర్హతలను కలిగి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 500/-)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా 
-చివరి తేదీ : నవంబర్ 6

-వెబ్‌సైట్: www.cau.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కాండ్లా పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు,
గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్టు ట్రస్ట్ (కాండ్లా)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-మొత్తం ఖాళీల సంఖ్య - 6. 
-విభాగాలవారీగా ఖాళీలు

డిప్యూటీ ఎస్టేట్ మేనేజర్ - 1, సీనియర్ అసిస్టెంట్ ఎస్టేట్ మేనేజర్ - 1, గ్రేడ్ -1 అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ - 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) - 1, ఏఈఈ(ఎలక్ట్రికల్)- 1, లైబ్రేరియన్ - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 24

-వెబ్‌సైట్: www.kandlaport.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏయూలో ప్రొఫెసర్లు.
వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ (రెగ్యులర్), అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ (బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య: 32
-రెగ్యులర్ పోస్టుల సంఖ్య-19 ( ప్రొఫెసర్)
-విభాగాలు: ఆర్ట్స్ (ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, యోగా), సైన్స్ (బయోకెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ, జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైకాలజీ అండ్ పారాసైకాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ), ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్)
-బ్యాక్‌లాగ్ పోస్టుల సంఖ్య -13 (అసోసియేట్ ప్రొఫెసర్-9, అసిస్టెంట్ ప్రొఫెసర్-4)
-విభాగాలు: ఆర్ట్స్ (మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్, సంస్కృతం), సైన్స్ (మెటీరియాలజీ అండ్ ఓషనోగ్రఫీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్), ఇంజినీరింగ్ (ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ ఫిజిక్స్, జియో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్)
-అర్హతలు: పీహెచ్‌డీ, సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ : నవంబర్ 25
-వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

0 comments:

Post a Comment