Friday, 22 September 2017

టీఎస్‌పీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉద్యోగాలు, సీసీఆర్‌టీ స్కాలర్‌షిప్స్. TSPSC Forest Range Officers Jobs,CCRT scholarships

టీఎస్‌పీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
వయోపరిమితి 28 నుంచి 31 ఏండ్లకు పొడిగింపు
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 22
తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
Forest-Department 
వివరాలు:

రాష్ట్రంలోని నీటి భద్రత, ఆహార భద్రత కోసం అడవులు, నిర్జన ప్రాంతాల జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి, వన్యప్రాణి, వన్యప్రాణుల 
నివాసాలను సంరక్షించడానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 
పనిచేస్తుంది.
-పాత జిల్లాలవారీగా మొత్తం ఖాళీలు: 67. వీటిలో జనరల్ అభ్యర్థులకు-47, మహిళా అభ్యర్థులకు-20 పోస్టులను కేటాయించారు.
-రిజర్వేషన్‌వారీగా: ఓసీ (జనరల్-25, మహిళలు-10), బీసీ ఏ-4, బీసీ బీ (జనరల్-5, మహిళలు-2), బీసీ సీ-1, బీసీ డీ (జనరల్-2, మహిళలు-2), బీసీ ఈ (జనరల్-1, మహిళ-1) ఎస్సీ-(జనరల్-5, మహిళలు-4), ఎస్టీ 
(జనరల్-4, మహిళ-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, జువాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్) లేదా బీఈ/బీటెక్ (అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్) లేదా తత్సమాన 
పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏండ్ల మధ్య ఉండాలి. 
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 31,460- 84 970/-
-పరీక్ష కేంద్రాలు: గ్రేటర్ హైదరాబాద్ పరిధి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్
-ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, నడక, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-ఆబ్జెక్టివ్ రాతపరీక్ష మొత్తం నాలుగు పేపర్లుగా ఉంటుంది. .
-క్వాలిఫయింగ్ పేపర్లు రెండు జనరల్ ఇంగ్లిష్ పేపర్-100 మార్కులు, మ్యాథమెటిక్స్ -100 మార్కులు
-ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం- 100 నిమిషాలు (పై రెండు పేపర్లు)
-మెయిన్ పేపర్లు (జనరల్ స్టడీస్-150 మార్కులు, ఆప్షనల్ పేపర్-300 మార్కులు ) అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
-పదోతరగతి స్థాయిలో ప్రశ్నలను ఇస్తారు.
-ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం- 150 నిమిషాలు
-కేటాయించిన 21 ఆప్షనల్ సబ్జెక్టుల్లోని ఏదైనా ఒక సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి
-ఆప్షనల్ సబ్జెక్ట్‌లో 150 ప్రశ్నలు-300 మార్కులు అంటే ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.
-ఇంటర్వ్యూకు 50 మార్కులు
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 22
-ఆబ్జెక్టివ్ పరీక్ష: అక్టోబర్ 14

-వెబ్‌సైట్: www.tspsc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఆర్‌టీ స్కాలర్‌షిప్స్.

సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్‌టీ) 2016-17, 2017-18 అకడమిక్ ఇయర్‌కు గాను సాంస్కృతిక విభాగంలో జూనియర్, సీనియర్ ఫెలోషిప్స్ పొందడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CCRT
వివరాలు:

భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం పరిధిలో
పనిచేస్తుంది.
-మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 400
-ప్రతి ఏడాదికి జూనియర్ ఫెలోషిప్స్-200, సీనియర్ ఫెలోషిప్స్-200 ఇస్తారు.
-విభాగాలు: పెర్ఫార్మింగ్, లిటరరీ, ప్లాస్టిక్ ఆర్ట్స్, ఇండలాజీ, ఏపీగ్రఫీ, సోషియాలజీ ఆఫ్ కల్చర్, కల్చర్ ఎకనామిక్స్, తదితర సాంస్కృతిక అంశాలు
-స్టయిఫండ్: జూనియర్ ఫెలోషిప్
నెలకు రూ. 10,000/-, సీనియర్ ఫెలోషిప్
నెలకు రూ. 20,000/-
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో/అంశాల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్,
-చివరితేది: అక్టోబర్ 10
-వెబ్‌సైట్: www.indiaculture.nic.in



0 comments:

Post a Comment