Friday, 22 September 2017

టీఎస్‌పీఎస్సీ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు TSPSC Child Development Project Officers Recruitment

టీఎస్‌పీఎస్సీ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు


చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్/అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్
పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్
సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:

చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) పోస్టులు, అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలోనివి.
-మొత్తం ఖాళీల సంఖ్య - 68. జనరల్ - 33, బీసీ ఏ - 5, బీసీ బీ - 5, బీసీ సీ -1, బీసీ డీ - 5, బీసీ ఈ - 2, ఎస్సీ - 10, ఎస్టీ -4, వీహెచ్ - 1, హెచ్‌హెచ్ - 1, ఓహెచ్ - 1 ఖాళీ ఉన్నాయి.
-పోస్టు: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్/ అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్
-వయస్సు: 18 - 44 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 35,120 - 87,130/-
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హోం సైన్స్/ సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత.
నోట్: ఇవి రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులు. లోకల్ రిజర్వేషన్లు ఉండవు. ఈ పోస్టులు పూర్తిగా (100 శాతం) మహిళలకు కేటాయించారు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్/ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించినవారిని 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
రాతపరీక్ష:
-పేపర్ -1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలు (150 మార్కులు), పరీక్ష కాలవ్యవధి - 150 నిమిషాలు.
-పేపర్ - 2లో సంబంధిత సబ్జెక్టుపై (డిగ్రీస్థాయిలో) - 150 ప్రశ్నలు (300 మార్కులు), పరీక్ష కాలవ్యవధి - 150 నిమిషాలు.
-ఇంటర్వ్యూ - 50 మార్కులు.
-రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు కలిపి 500 మార్కులు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఈ నెల 18 నుంచి ప్రారంభం
-ఫీజు: రూ. 200/-
-పరీక్షకేంద్రాలు: హైదరాబాద్ (హెచ్‌ఎండీఏ పరిధిలో)
-దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: అక్టోబర్ 16
-వెబ్‌సైట్: https://tspsc.gov.in

0 comments:

Post a Comment