Friday, 8 September 2017

టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాలు, సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ఐఐటీ గువాహటిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, వ్యాప్కోస్‌లో ఇంజినీర్ ట్రెయినీలు. Tata Memorial Center jobs,Project Engineers Jobs At C-DAC,Junior Assistant Jobs in IIT Guwahati,Engineer trainees Jobs at Wapcos.

టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాలు,

ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: 
ఈ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
అసిస్టెంట్ ప్రొఫెసర్-7 పోస్టులు
విభాగాలు: రేడియో డయాగ్నసిస్, పాథాలజీ, అనెస్థీషియాలజీ, మెడికల్ ఆంకాలజీ, పిడియాట్రిక్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజీ
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్/సర్జికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్, డీఎమ్, ఎంసీహెచ్, డీఎన్‌బీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
జూనియర్ ఇంజినీర్ -3 పోస్టులు
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మూడేండ్ల డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
నర్స్ (గ్రేడ్ - ఏ)-50 పోస్టులు (జనరల్-27, ఓబీసీ-13, ఎస్సీ-7, ఎస్టీ-3)
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీతోపాటు ఆంకాలజీ నర్సింగ్‌లో డిప్లొమా లేదా నాలుగేండ్ల బీఎస్సీ (నర్సింగ్) లేదా బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్-రెండేండ్ల కోర్సు) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. 50 పడకల వైద్యశాలలో రెండేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు: రూ. 300/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్, చివరి తేదీ: సెప్టెంబర్ 14
హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 21
చిరునామా: TATA MEMORIAL HOSPITAL, PAREL, MUMBAI

వెబ్‌సైట్ : https://tmc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు,

నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ( సీడాక్) వివిధ విభాగాల్లోని తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
CDAC

వివరాలు:
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధంగా సీడాక్ పనిచేస్తుంది.
పోస్టు పేరు ఖాళీలు:
-ప్రాజెక్ట్ మేనేజర్- 2 పోస్టులు
-ప్రాజెక్ట్ ఇంజినీర్-65 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంస్థ నింబంధనల ప్రకారం సంబంధిత విభాగంలో అనుభవం, కంప్యూటర్ అంశాల్లో నైపుణ్యం ఉండాలి.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 16 నాటికి 37 ఏండ్లు మించరాదు (మేనేజర్‌కు 50 ఏండ్లు)
-పేస్కేల్ : మేనేజర్‌కు రూ. 64,000/-, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ. 31,000/-
దరఖాస్తు ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మొయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 18
వెబ్‌సైట్: www.cdac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ గువాహటిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు,

గువాహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

వివరాలు: ఐఐటీ గువాహటిని 1994లో ఏర్పాటుచేశారు.
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు-20 పోస్టులు 
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్‌లో పరిజానం ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే. రూ.2000/-
వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ 
చివరితేదీ: సెప్టెంబర్ 22

వెబ్‌సైట్: www.iitg.ac.in.


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వ్యాప్కోస్‌లో ఇంజినీర్ ట్రెయినీలు.





భోపాల్‌లోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
వ్యాప్కోస్ జల వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ కన్సల్టెన్సీ సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 6
పోస్టు పేరు: ఇంజినీర్ ట్రెయినీ
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-2, సివిల్-2, మెకానికల్-1, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-1
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) ఉత్తీర్ణత.
వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Regional Manager (CR),
WAPCOS Limited, House No. B-23, Shahpura Trilanga Road,
Near Shahpura Gate No. 8, Bhopal - 462039 (M.P)
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 11
వెబ్‌సైట్: www.wapcos.gov.in

0 comments:

Post a Comment