Friday, 8 September 2017

ఏఐఈఎస్‌ఎల్‌లో పైలట్‌ ఉద్యోగాలు, నేషనల్ జియోటెక్నికల్‌లో ఉద్యోగాలు, నాల్కోలో మెడికల్ పోస్టులు. Pilot jobs in AIESL,Jobs in National Geotechnical,Medical posts in Nalco.

ఏఐఈఎస్‌ఎల్‌లో పైలట్‌ ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ బ్యాక్‌లాగ్ రిక్రూట్‌మెంట్ కింద సీనియర్ ట్రెయినీ పైలట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
AIESL 
వివరాలు:ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. ఈ పోస్టులను ఐదేండ్లవరకు భర్తీచేస్తారు. అభ్యర్థి ప్రవర్తనను బట్టి మరో ఐదేండ్ల 
వరకు పొడిగిస్తారు. 
- పోస్టు పేరు: సీనియర్ ట్రెయినీ పైలట్ 
- మొత్తం ఖాళీల సంఖ్య- 217 (ఓబీసీ-150, ఎస్సీ-35, ఎస్టీ-32)
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. డీజీసీఏ నుంచి వినియోగంలో ఉన్న సీపీఎల్/ఏటీపీఎల్ లైసెన్స్ సర్టిఫికెట్ ఉండాలి.
- పే స్కేల్: ట్రెయినింగ్ సమయంలో రూ. 25,000/- స్టయిఫండ్ ఇస్తారు. పైలట్‌గా విధుల్లోకి చేరిన తర్వాత రూ. 80,000/- అదనంగా ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.

- వయస్సు: ఓబీసీలకు 38 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 ఏండ్లు మించరాదు. 
- అప్లికేషన్ ఫీజు: రూ. 3000/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: General Manager (Personnel),Air India Limited, Headquarters Airlines House,113, Gurudwara Rakab Ganj Road, New Delhi-110001
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 25

- వెబ్‌సైట్: www.airindia.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ జియోటెక్నికల్‌లో ఉద్యోగాలు,
డెహ్రాడూన్‌లోని నేషనల్ జియోటెక్నికల్ ఫెసిలిటీ సైంటిస్ట్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Geotechnical 
వివరాలు: ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది.
- మొత్తం ఖాళీలు: 15
- సైంటిస్ట్- ఎఫ్: 1 పోస్టు
- సైంటిస్ట్- సీ: 3 పోస్టులు
- సైంటిస్ట్- బీ: 3 పోస్టులు
- సపోర్టింగ్ స్టాఫ్: 8 ఖాళీలు
- ఫైనాన్స్ ఆఫీసర్: 1 పోస్టు
- టెక్నికల్ ల్యాబ్ అసిస్టెంట్: 2 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్: 2 పోస్టులు

- ఆఫీస్ అసిస్టెంట్: 2 పోస్టులు
- డ్రైవర్: 1 పోస్టు
- అర్హతలు: నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, డిగ్రీ, డిప్లొమా, ఇంటర్, పదోతరగతిలో ఉత్తీర్ణత.
- వయస్సు: 18 నెంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
- చివరితేదీ: అక్టోబర్ 3
చిరునామా: The Project Director, National Geotechnical Facility,Poonch House, 11-C, Circular Road, Dalanwala,Dehradun - 248001

- వెబ్‌సైట్: www.surveyofindia.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నాల్కోలో మెడికల్ పోస్టులు.

ఒడిశాలోని భువనేశ్వర్‌లోఉన్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) మెడికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Nalco-Recruitment
వివరాలు:ఆసియాలోనే అతిపెద్ద అల్యూమినియా-అల్యూమినియం కాప్లెక్స్ అయిన నాల్కో.. నవరత్న హోదా
కలిగిన కంపెనీ. దీన్ని 1981, జనవరి 7న
భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశారు. ఇది గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
- మొత్తం పోస్టులు: 16
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంఓ)
- పోస్టుల సంఖ్య-5 (జనరల్-1, ఓబీసీ-3, ఎస్సీ-1)
- అర్హత: డీజీఎఫ్‌ఏఎస్‌ఎల్‌ఐ గుర్తించిన సంస్థ నుంచి ఇండస్ట్రియల్ హెల్త్ కోర్సులో ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: 2017, ఆగస్టు 18 నాటికి 32 ఏండ్లు నిండినవారై ఉండాలి.
- పే స్కేల్: రూ. 24,900-50,500

- సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఎస్‌ఆర్‌ఎంఓ)
- పోస్టుల సంఖ్య- 11 (జనరల్-7, ఓబీసీ-3, ఎస్సీ-1)
- విభాగాల వారీగా ఖాళీలు.. మెడిసిన్-2, ఓబీఎస్ అండ్ గైనకాలజీ-1, పీడియాట్రిక్స్-2, ఆప్తాల్మాలజీ-1, అనస్థీషియా-1,రేడియాలజీ-1, పాథాలజీ-1, డెర్మటాలజీ-1
- అర్హత: ఎండీ లేదా ఎమ్మెస్ లేదా మెడిసిన్‌లో పోస్ట్ ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
- వయస్సు: 2017, ఆగస్టు 18 నాటికి 37 ఏండ్లు నిండిన వారై ఉండాలి.
- పేస్కేల్: రూ. 29,100-54,500
నోట్: వీటిలో రెండు పోస్టులు పీహెచ్‌సీలకు కేటాయించారు.

- ఎంపిక విధానం: జీడీఎం పోస్టులకు రాతపరీక్ష/ఇంటర్వ్యూ, ఎస్‌ఆర్‌ఎంఓలకు ఇంటర్వ్యూ
- దరఖాస్తు ఫీజు: రూ. 100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ దరఖాస్తును ప్రింట్ తీసుకుని సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి కింది అడ్రస్‌కు పంపిచాలి.
చిరునామా: Asst. General Manager (HRD), Recruitment Cell,HRD Department, NALCO Bhawan, P/1, Nayapali, Bhubaneswar-751013, Odisha
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 15
- ఆన్‌లైన్ హార్డ్ కాపీలకు చివరితేదీ: సెప్టెంబర్ 25
- వెబ్‌సైట్: www.nalcoindia.com0 comments:

Post a Comment