Friday, 22 September 2017

సింగరేణిలో ఎంటీ ఉద్యోగాలు, ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు. MT Jobs in Singareni,Jobs in the Indian Army,Jobs in Cochin Shipyard,

సింగరేణిలో ఎంటీ ఉద్యోగాలు,

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎగ్జిక్యూటివ్ క్యాడర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది రాష్ట్రంలోని బోగ్గును ఉత్తత్తి చేసే కంపెనీ. దీన్ని 49:51 ఈక్విటీ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ప్రారంభంలో హైదరాబాద్ దక్కన్ (1886)గా, 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరు మారి, 1956 నుంచి రాష్ట్ర స్థాయి పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్‌గా పరిగణిస్తున్నారు. ఈ కంపెనీకి 2006లో మినీరత్న హోదాను కల్పించారు.
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎఫ్ అండ్ ఏ) 
మొత్తం ఖాళీల సంఖ్య- 12. వీటిలో 10 రెగ్యులర్, 2 క్యారీఫార్వర్డ్ పోస్టులు. 
వీటిలో 5 పోస్టులు- ఓపెన్ టు ఆల్ క్యాటగిరీలో (లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు) ఉన్నాయి. 
లోకల్ అభ్యర్థులకు-7 ఖాళీలు. వీటిలో ఓసీ (జనరల్-2, మహిళలు-2), బీసీబీ-1, బీసీడీ-1, ఎస్టీ (మహిళ)-1 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏలో ఉత్తీర్ణత.
పేస్కేల్: 20,600 - 46,500/-
వయస్సు: 2017 ఆగస్టు 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా . ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలతోపాటు, నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్‌యాలి.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 5 (సాయంత్రం 5 గంటల వరకు)

వెబ్‌సైట్: www.scclmines.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు,

దేశ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ (ఐఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: 
ఈస్టర్న్ కమాండ్ పరిధిలోని ఏఎస్‌సీ కమాండ్ 
యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
విభాగాలవారీగా ఖాళీలు:
ఫైర్ ఇంజన్ డ్రైవర్-3, స్టేషన్ ఆఫీసర్-1, ఫైర్ పిట్టర్-1, ఫైర్‌మెన్-23, ట్రేడ్స్‌మెన్ మేట్-56, చౌకీదార్-3, టిన్ స్మిత్-3, కుక్-3, పెయింటర్-2, కార్పెంటర్-3, బార్బర్-2, ఈక్విప్‌మెంట్ రిపేరియర్-1, వాషర్‌మ్యాన్-1
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి/ఇంటర్‌లో ఉత్తీర్ణత. ఫైర్ పోస్టులకు డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ రిసెర్చ్ నుంచి సీనియర్ ఫైర్ సూపర్‌వైజర్ కోర్సులో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. డ్రైవింగ్‌లైసెన్స్ ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం ఎత్తును కలిగి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
పే స్కేల్ : రూ. 18,000/- 
నోట్: పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి
ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 12

వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) వివిధ విభాగాల్లోఖాళీగా ఉన్న ఫైర్‌మెన్, షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
కొచ్చిన్ షిప్‌యార్డ్ భారతదేశంలోని అతిపెద్ద నౌకానిర్మాణ, నిర్వహణ సౌకర్యం ఉన్న సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య-60
విభాగాల వారీగా ఖాళీలు: 
ఫైర్‌మెన్-28 పోస్టులు (జనరల్-11, ఓబీసీ-13, ఎస్సీ-4)
సేఫ్టీ అసిస్టెంట్-2 పోస్టులు (జనరల్-1, ఎస్సీ-1)
అర్హత : గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఎస్‌ఎస్‌సీ/ఎస్‌ఎస్‌ఎల్‌సీలో ఉత్తీర్ణత. ఫైర్ ఫైటింగ్/ఎన్‌బీసీడీలో సర్టిఫికెట్ ఉండాలి. ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 సెప్టెంబర్ 24 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: కన్సాలిడేటెడ్ పే విధానంలో రూ. 18,400/-,ఫైర్‌మెన్ పోస్టుకు రూ. 17,400/-ఎక్స్‌ట్రావర్క్ చేస్తే గరిష్ఠంగా నెలకు రూ. 4,200/- లేదా రూ. 4,500/- చెల్లిస్తారు.
షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ (మెకానికల్)-13 (జనరల్-8, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్)-17 (జనరల్-10, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-1)
అర్హత : పదోతరగతితోపాటు మూడేండ్ల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డ్రాఫ్ట్స్‌మెన్ షిప్ లేదా క్యాడ్‌లో పరిజ్ఞానం ఉండాలి.
పే స్కేల్: మొదటి ఏడాదికి రూ. 8,500/- , రెండో ఏడాదికి రూ. 8,900/-స్టయిఫండ్ ఇస్తారు. ఎక్స్‌ట్రావర్క్ చేస్తే గరిష్ఠంగా నెలకు రూ. 4, 200/- చెల్లిస్తారు.
వయస్సు: 2017 సెప్టెంబర్ 24 నాటికి 25 ఏండ్లకు మించరాదు.
ఎంపిక : రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ : సెప్టెంబర్ 24 (షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ పోస్టులకు సెప్టెంబర్ 28)

వెబ్‌పైట్ : www.cochinshipyard.com0 comments:

Post a Comment