Friday, 15 September 2017

బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రవేశాలు, ఇండో జర్మన్ టూల్‌రూంలో ప్రవేశాలు, టీఐఎఫ్‌ఆర్‌లో ప్రవేశాలు. MBA Admissions in BHU,Admissions in the Indo German Toilroom,Admissions in TIFR.

బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రవేశాలు,



బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) 2018-20 విద్యా సంవత్సారానికి రెండేండ్ల ఎంబీఏ కోర్సు ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
బెనారస్ హిందూ యూనివర్సిటీ మహామాన్య మదన్ మోహన్ మాలవీయ 1916లో స్థాపించారు. బీహెచ్‌యూ సెంట్రల్ హిందూ కాలేజీగా వ్యవహరించేవారు.
కోర్స్ పేరు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
విభాగాలు: ఇంటర్నేషనల్ బిజినెస్, జనరల్ ఎంబీఏ
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎసీ,్ట పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం) ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు: రూ.1500/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 750/-)
ఎంపిక: క్యాట్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేదీ:2018 జనవరి 22
వెబ్‌సైట్: http://bhuonline.in
BINARUS-UNIVERSITY



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండో జర్మన్ టూల్‌రూంలో
ఔరంగాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఇండో జర్మన్ టూల్‌రూంలో లాంగ్‌టర్మ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఇండో జర్మన్ టూల్‌రూం భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. దేశంలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడానికి జర్మనీ సహకారంతో దీన్ని ప్రారంభించారు.
కోర్సులు: కింది విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు
టూల్ డిజైన్ అండ్ క్యాడ్/క్యామ్, మెకానికల్ ప్రొడక్ట్ డిజైన్, మెకట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, టూల్ డిజైన్ (లెవల్ 6),సీఎన్‌సీ మెషిన్ మెయింటెనెన్స్, ఇండస్ట్రియల్ ఆటోమెషిన్ అండ్ రోబోటిక్స్, టూల్ డై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి.

నోట్: ఇవి ఫుల్‌టైం కోర్సులు.
కోర్సు ప్రారంభం: అక్టోబర్ 3
వెబ్‌సైట్: www.igtr-aur.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఐఎఫ్‌ఆర్‌లో ప్రవేశాలు
ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, ఎమ్మెస్సీ ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
టీఐఎఫ్‌ఆర్‌ను సర్ దొరబ్జి టాటా ట్రస్ట్ 1945 జూన్ 1లో స్థాపించింది.
కోర్సు పేరు: పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ/ఎమ్మెస్సీ
విభాగాలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్స్, సైన్స్ ఎడ్యుకేషన్
కోర్సు వ్యవధి: పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఐదేండ్లు, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఆరేండ్లు
అర్హత: సంబంధిత విభాగంలో బీఏ, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్ , బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, , ఎంసీఏ, డిగ్రీ, మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
ఎంపిక విధానం : ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరితేదీ : అక్టోబర్ 12
వెబ్‌సైట్: http://www.tifr.res.in

0 comments:

Post a Comment