Thursday, 28 September 2017

ఎయిర్‌పోర్ట్ అథారిటీ లో జూనియర్ అసిస్టెంట్లు, సీఈఐఎల్‌లో ఇంజినీర్లు, ఎన్‌పీసీసీఎల్‌లో మేనేజర్లు, ఎన్‌ఏబీఐలో సైంటిస్టులు, ఫార్మసీ కౌన్సిల్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు. Junior Assistants in the Airport Authority,CEIL Engineers Jobs,NPCCL Managers Posts,NABI scientists Jobs,Technical Assistants at the Pharmacy Council.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ లో జూనియర్ అసిస్టెంట్లు,

నార్తర్న్ రీజియన్‌లోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
aai
వివరాలు:

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వంలోని పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ.
-పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్స్
-విభాగం: ఫైర్ సర్వీస్
-మొత్తం పోస్టుల సంఖ్య: 84 (జనరల్-43, ఓబీసీ-23, ఎస్సీ-14, ఎస్టీ-4)
-నార్తర్న్ రీజియన్ పరిధిలోని ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదోతరగతితోపాటు మూడేండ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమొబైల్/ఫైర్) లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా రెగ్యులర్ విధానంలో ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. ఎన్‌సీసీ బీ సర్టిఫికెట్, ఇంటర్ స్థాయిలో కంప్యూటర్ సర్టిఫికెట్, ఇండస్ట్రియల్ ఫైర్ సర్వీసెస్, ఏఏఐ ఫైర్ ట్రెయినింగ్ నుంచి బేసిక్ ఫైర్ ఫైటింగ్ ట్రెయినింగ్, నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్‌పూర్ నుంచి సబ్ ఫైర్ ఆఫీసర్ కోర్స్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు : 2017 అక్టోబర్ 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 12,500-28,500/- అదనంగా బేసిక్ పే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీపీఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి.
-ఫిజికల్ ఫిట్‌నెస్: ఎత్తు-167 సెం.మీ, ఛాతీ-81 సెం.మీ. గాలిని పీల్చినపుడు 5 సెం.మీ వ్యాకోచం చెందాలి. కనీసం 50 కేజీలకు తగ్గకుండా ఉండాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ ఎత్తు, 45 కేజీల బరువును కలిగి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష
-రాతపరీక్షలో 100 మార్కుల ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది.
-ఈ ఆన్‌లైన్ పరీక్షలో పదోతరగతిస్థాయిలో బేసిక్ అర్థమెటిక్-25 మార్కులు, బేసిక్ సైన్స్-25 మార్కులు, ఎలిమెంటరీ ఇంగ్లిష్/గ్రామర్-25 మార్కులు, ఇంటర్ స్థాయిలో జనరల్ నాలెడ్జ్-25 మార్కులకు సంబంధించిన ప్రశ్నలను ఇస్తారు.
-రాతపరీక్ష ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది.
-రాతపరీక్షలో జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 24
-దరఖాస్తులకు చివరితేదీ : అక్టోబర్ 14
-దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ:అక్టోబర్ 16
-వెబ్‌సైట్: www.airportsindia.org.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈఐఎల్‌లో ఇంజినీర్లు,

సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఈఐఎల్) వివిధ విభాగాల్లో ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ceil
వివరాలు:

సీఈఐఎల్ సంస్థ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో సర్టిఫికేషన్, రీ సర్టిఫికేషనల్, సేఫ్టీ, ఆడిట్ తదితర కార్యక్రమాలను సీఈఐఎల్ నిర్వహిస్తుంది.
-మొత్తం ఖాళీల సంఖ్య - 23
-ఇంజినీర్ (క్వాలిటీ అస్యూరెన్స్/క్వాలిటీ కంట్రోల్) - 5
-సీనియర్ ఇంజినీర్ (క్యూఏ/క్యూసీ) - 5
-డిప్యూటీ ఇంజినీర్ (క్యూఏ/క్యూసీ) - 5
-గ్రేడ్ -1 ఇంజినీర్ స్పెషలిస్ట్ - 6
-గ్రేడ్ - 2 సీనియర్ ఇంజినీర్ స్పెషలిస్ట్ - 2
-గ్రేడ్ - 2 ఆఫీసర్ - 1 పోస్టు
-అర్హతలు, వయస్సు వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ప్రకటన విడుదలైన తేదీ నుంచి 15 రోజుల్లోగా పంపాలి.
(ప్రకటన సెప్టెంబర్ 16 - 22 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైంది)
-వెబ్‌సైట్: http://ceil.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీసీఎల్‌లో మేనేజర్లు,
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NPCC
వివరాలు:

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నీటిపారుదల, నీటివనరులు, విద్యుత్, భారీ పరిశ్రమలు కోర్ రంగాల్లో నిపుణలను తయారుచేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. దీన్ని 1957 జనవరి 9న స్థాపించారు.
-పోస్టు పేరు: మేనేజర్
-మొత్తం పోస్టుల సంఖ్య : 79
-గ్రూప్ జనరల్ మేనేజర్ (సివిల్)-3 పోస్టులు
-జనరల్ మేనేజర్ (సివిల్)-5 పోస్టులు
-జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్)- 1 పోస్టు
-జాయింట్ జనరల్ మేనేజర్ (సివిల్) -10 పోస్టులు
-జాయింట్ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్)-1 పోస్టు
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్)-15 పోస్టులు
-సీనియర్ మేనేజర్ (సివిల్) - 20 పోస్టులు
-మేనేజర్ (ఐటీ)-4 పోస్టులు
-మేనేజర్ (హెచ్‌ఆర్)-15 పోస్టులు
-డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్)-5 పోస్టులు
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎంసీఏ, మేనేజ్‌మెంట్‌లో పీజీ, ఎంబీఏ (హెచ్‌ఆర్), సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2016 మే 31 నాటికి 35/45 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
NPCC1
-పే స్కేల్: రూ. 24,900-50, 500/- పోస్టుల బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ.800/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The General Manager (HR), NPCC Limited, Corporate Office, Plot No. 67-68, Sector-25, Faridabad, Haryana- 121004.
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్: www.npcc.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఏబీఐలో సైంటిస్టులు,
మొహాలీలోని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఏబీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి (అటానమస్) సంస్థ
-పోస్టు పేరు: సైంటిస్ట్
-మొత్తం పోస్టుల సంఖ్య: 45
-విభాగాలవారీగా ఖాళీలు: సైంటిస్ట్ (గ్రేడ్ ఎఫ్-5, గ్రేడ్ ఈ-10, గ్రేడ్ డీ-15, గ్రేడ్ సీ-15)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్/ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ, ఎండీ/ఎంటెక్ లేదా ఎంఈలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.nabi.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫార్మసీ కౌన్సిల్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు.

న్యూఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న టెక్నికల్/అకౌంట్స్ అసిస్టెంట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
pci
వివరాలు:

ఇది కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలో
పనిచేస్తున్న చట్టబద్దమైన సంస్థ.
-పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్ -4 పోస్టులు
-అర్హత: గుర్త్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఫార్మసీలో ఉత్తీర్ణత. ఫార్మసీ కౌన్సిల్‌లో ఫార్మాసిస్ట్‌గా రిజస్టర్ చేసుకొని ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-పే స్కేల్: రూ. 25,000/-
-అకౌంటెంట్ అసిస్టెంట్-2 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాంలో ఉత్తీర్ణత. ట్యాలీ అండ్ ఎంఎస్ ఎక్సెల్‌లో నాలెడ్జ్ ఉండాలి.
-పే స్కేల్: రూ. 17,604/-
-వయస్సు: అకౌంటెంట్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లు, టెక్నికల్ అసిస్టెంట్‌కు 35 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 20 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి. పూర్తి వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (సెప్టెంబర్ 23-29) చూడవచ్చు.
-వెబ్‌సైట్: http://www.pci.nic.in0 comments:

Post a Comment