Friday, 8 September 2017

ఎన్‌ఐవోహెచ్‌లో ఉద్యోగాలు, ఉస్మానియా దూరవిద్య కోర్సులు, ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ ప్రవేశాలు, Jobs at NIOH,Osmania University distance education courses,efluniversity MA English Admissions,

ఎన్‌ఐవోహెచ్‌లో ఉద్యోగాలు,
ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (ఎన్‌ఐవోహెచ్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పరిధిలో ఎన్‌ఐవోహెచ్ పనిచేస్తుంది. దీని కార్యాలయాలు అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరులలో ఉన్నాయి.
టెక్నికల్ ఆఫీసర్ - ఏ (బయలాజికల్ సైన్స్) - 1, టెక్నికల్ ఆఫీసర్ (సైన్స్/అప్లయిడ్ సైన్స్ - 1, టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 1, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ - 2, కెమిస్ట్రీ - 1, ఫిజియాలజీ - 1, బయాలజీ - 1, ఇండస్ట్రియల్ సేఫ్టీ) - 1, బయో మెడికల్ ఇంజినీరింగ్ - 1), 
టెక్నీషియన్ - 1 ఖాళీ ఉన్నాయి. 
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: సెప్టెంబర్ 30

వెబ్‌సైట్: http://www.nioh.org



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఉస్మానియా దూరవిద్య కోర్సులు,
హైదరాబాద్‌లోని ప్రొ. జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొ. జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. గతంలో దీన్ని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌గా పిలిచేవారు.
కోర్సులు:
-ఎంబీఏ - ఇది రెండేండ్ల కోర్సు.
-ఎంసీఏ - ఇది మూడేండ్ల కోర్సు.
- ఎంబీఏ/ఎంసీఏలో ప్రవేశాలు ఐసెట్ - 2017 ర్యాంకు లేదా పీజీఆర్‌ఆర్‌సీడీఈ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా కల్పిస్తారు.
-ఎంఏ (ఉర్దూ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్) - రెండేండ్ల కోర్సు - సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంఏ (ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్) - రెండేండ్ల కోర్సు - ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంకాం - బీకాం ఉత్తీర్ణులు అర్హులు - ఇది రెండేండ్ల కోర్సు
-ఎమ్మెస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) - మ్యాథ్స్/స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ ఉత్తీర్ణత - ఇది రెండేండ్ల కోర్సు.
-వీటితోపాటు బీఏ, బీఏ (మ్యాథ్స్/స్టాటిస్టిక్స్), బీకాం (జనరల్), బీబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మ్యాథమెటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: http://www.oucde.net



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ ప్రవేశాలు,


హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) పరిధిలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంఏ ఇంగ్లిష్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఇఫ్లూని హైదరాబాద్‌లో 1958లో ప్రారంభించారు. అనంతరం 1973లో దీనికి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఇచ్చారు. 2006-07లో ఇఫ్లూకి సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిని కల్పించారు.
కోర్సు: ఎంఏ (ఇంగ్లిష్)
ఇఫ్లూ ఈ కోర్సును దూరవిద్యా విధానంలో అందిస్తుంది.
కాలపరిమితి: రెండేండ్లు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)
చివరితేదీ: అక్టోబర్ 31
వెబ్‌సైట్: http://www.efluniversity.ac.in


0 comments:

Post a Comment