Friday, 8 September 2017

కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ పోస్టులు, ఎన్‌బీసీసీలో జూనియర్ ఇంజినీర్లు, రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిసెస్‌లు, ఎన్‌ఐబీలో వ్యాక్సిన్ అనలిస్ట్‌లు. Coastgaurd Recruitment Yatrik Posts,Junior Engineers in NBCC,Rail Coach Factory Recruitment,vaccine Analysts in NIB.

కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ పోస్టులు,

డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగం
-రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక
-చివరితేదీ: సెప్టెంబర్ 13
-రాతపరీక్ష: అక్టోబర్‌లో

IndianCoastGuard
ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఖాళీగా ఉన్న యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు :
కేవలం డిప్లొమా ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. చాలెంజింగ్ కెరీర్, మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన సౌకర్యాలు, ఇతర అలవెన్స్‌లు కేవలం 18 ఏండ్ల వయస్సులోనే సెంట్రల్ గవర్నమెంట్ కొలువు. దేశ రక్షణలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం. వీటన్నింటి సమాహారమే ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ టెక్నికల్ పోస్టులు. దరఖాస్తు చివరితేదీ 2017 సెప్టెంబర్ 13 సందర్భంగా నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా మీకోసం ..

-పోస్టు పేరు - యాంత్రిక్ టెక్నికల్ (డిప్లొమా ఇంజినీరింగ్)- 1/2018 బ్యాచ్ కింద వీటిని భర్తీ చేస్తారు.
-అర్హతలు: ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నుంచి కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. జాతీయ స్థాయి క్రీడలలోని 1, 2 ,3వ స్థానం చాంపియన్‌షిప్ పొందిన అభ్యర్థులకు 5 శాతం ఉత్తీర్ణతలో సడలింపు ఉంటుంది.
-వయస్సు: కనిష్ఠంగా 18 ఏండ్లు, గరిష్ఠంగా 22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1996, ఫిబ్రవరి 1 నుంచి 2000, జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:
-ఎత్తు - 157 సెం.మీ.
-ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
-బరువు - ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-కంటిచూపు - 6/24, 6/9, 6/12
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపిక చేస్తారు. రాతపరీక్ష 2017 అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో సంబంధిత డిప్లొమా ఇంజినీరింగ్ సబ్జెక్టులైన ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
-అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌పై కూడా ప్రశ్నలు వస్తాయి.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు.
-ఈ పరీక్షల నిర్వహణకు 1- 2 రోజులు పడుతుంది.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..
-7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి
-20 ఉతక్ బైటక్‌లు చేయాలి
-10 ఫుష్ అప్‌లు
-పై అన్ని పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి వైద్యపరీక్షలను నిర్వహించి, తుది ఫలితాలను ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్‌సైట్‌లో 2018 జనవరిలో వెల్లడిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఏదైనా ఒక పరీక్ష కేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అవి ముంబై, కోల్‌కత, చెన్నై, నోయిడా.
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో 2018 ఫిబ్రవరి నుంచి ట్రెయినింగ్ ప్రారంభమవుతుంది.
-టెక్నికల్‌కు సంబంధించి సముద్ర శిక్షణ, వృత్తిపరమైన శిక్షణను ఇస్తారు.
-శిక్షణ సమయంలో ఏ సందర్బంలోనైనా అసంతృప్తిగా ఉంటే కేటాయించిన యాంత్రిక్ టెక్నికల్ నుంచి తొలగిస్తారు.
-జీతభత్యాలు: రూ. 29,200 + యాంత్రిక్ పే రూ.6,200/- వీటికి తోడు (7వ వేతన సంఘం పే స్కేల్ అనుసరించి) డీఏ, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. ఉచితంగా రేషన్, దుస్తులు, వైద్యం (కుటుంబ సభ్యులకు కూడా) అందిస్తారు.

-నామమాత్రపు లైసెన్స్ ఫీజుతో వసతి సౌకర్యం కల్పిస్తారు.
-రూ. 25 లక్షలకు ఇన్సూరెన్స్ ఉంటుంది.
-క్యాంటీన్, పలు రకాల రుణసదుపాయాలను అందిస్తారు.
-పదవీ విరమణ సహాయక పెన్షన్ స్కీమ్ అండ్ గ్రాట్యుటీ, రిటైర్ అయిన తర్వాత ఈసీహెచ్‌ఎస్ మెడికల్ సౌకర్యం ఉంటుంది.
-పదోన్నతులు: యాంత్రిక్ టెక్నికల్ నుంచి ప్రధాన్‌సహాయక్ ఇంజినీర్ హోదా వరకు వెళ్లవచ్చు. పేస్కేల్ రూ. 47,600 + యాంత్రిక్ పే రూ.6,200/- వీటికి తోడు (7వ వేతన సంఘం పే స్కేల్ అనుసరించి) డీఏ, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్. అర్హత కలిగిన అభ్యర్థులు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చెయ్యాలి. పరీక్ష తేదీ, సమయం, ప్రదేశం తదితర విషలయాలన్నింటిని ఈ-మెయిల్ ఐడీ ద్వారానే తెలియజేస్తారు.
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 6
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 13
-రాతపరీక్ష అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్: సెప్టెంబర్ 22 నుంచి 29
-రాతపరీక్ష: 2017 అక్టోబర్‌లో
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌బీసీసీలో జూనియర్ ఇంజినీర్లు,

నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌బీసీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NBCCCentreOkhla
వివరాలు:
ఎన్‌బీసీసీ ఒక నవరత్న కంపెనీ.
-మొత్తం పోస్టుల సంఖ్య : 94

విభాగాలవారీగా ఖాళీలు:
-జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)-1 పోస్టు
-అడిషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) - 2 పోస్టులు
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) - 6 పోస్టులు
-ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్)-5 పోస్టులు
-డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్)-10 పోస్టులు
-డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)-5 పోస్టులు
-డిప్యూటీ మేనేజర్ (లా)-2 పోస్టులు
-అసిస్టెంట్ మేనేజర్ (లా)-2 పోస్టులు
-సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)-3 పోస్టులు
-అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్‌ఎం)-2 పోస్టులు
-అసిస్టెంట్ మేనేజర్ (రాజభాష)-2 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, ఐసీడబ్ల్యూఏ/ఐసీఏఐ, బ్యాచిలర్ డిగ్రీ (లా), పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంబీఏ (ఫైనాన్స్), ఎంఎస్‌డబ్ల్యూ, బీఈ/బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-జూనియర్ ఇంజినీర్ (సివిల్)-40 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-4 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 24 నాటికి 28 ఏండ్లకు మించరాదు (నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు), ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 1000/-, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 500/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 24
-వెబ్‌సైట్: www.nbccindia.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిసెస్‌లు,

కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Rcf-colony
వివరాలు:
పంజాబ్‌లోని కపుర్తలా ప్రాంతంలో 1986లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: అప్రెంటిసెస్
-మొత్తం ఖాళీల సంఖ్య: 101
-ఫిట్టర్-25 ఖాళీలు (జనరల్-12, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2)
-వెల్డర్ (జీ అండ్ ఈ)-27 ఖాళీలు (జనరల్-14, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2)
-మెషినిస్ట్-8 ఖాళీలు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-పెయింటర్ (జీ)-7 ఖాళీలు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1)
-కార్పెంటర్-7 ఖాళీలు (జనరల్-14, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2)
-మెకానిక్ (మోటారు వెహికిల్)-4 ఖాళీలు (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1)
-ఎలక్ట్రీషియన్-14 ఖాళీలు (జనరల్-8, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
-ఎలక్ట్రానిక్ మెకానిక్-2 ఖాళీలు (జనరల్-1, ఓబీసీ-1)
-ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్-7 ఖాళీలు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

-వయస్సు: 2017 సెప్టెంబర్ 21 నాటికి 15 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను ప్రింట్ తీసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: General Manager (P), Rail Coach Factory,Kapurthala -144602
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 21
-వెబ్‌సైట్: www.rcf.indianrailways.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐబీలో వ్యాక్సిన్ అనలిస్ట్‌లు.
నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్ (ఎన్‌ఐబీ) ఖాళీగా ఉన్న వ్యాక్సిన్ అనలిస్ట్ (తాత్కాలిక ప్రాతిపదిక) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో
పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య:6
-పోస్టు పేరు: వ్యాక్సిన్ అనలిస్ట్ (బ్యాక్టిరియల్, వైరల్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ), ఎంటెక్ (బయోటెక్)లో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 55,000/- అదనంగా కన్వియెన్స్ అలవెన్స్‌లు నెలకు రూ.5000/- ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఈ-మెయిల్ (info.bedi@gmail.com) ద్వారా పంపాలి.
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్: http://nib.gov.in

0 comments:

Post a Comment