Thursday, 28 September 2017

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్లు, ఐఐఎస్‌ఈఆర్-మొహాలిలోపీహెచ్‌డీ ప్రోగ్రామ్, గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు. Bank of Maharashtra Recruitment Officers,IISER-Mohali PHD Program,Professors Jobs In Gorakhpur University.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్లు,

బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం.
-బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగం,
-గ్రూప్ డిస్కషన్, ఇంటర్వూ ద్వారా ఎంపిక
-మంచి జీత్భత్యాలు, ఉద్యోగ భద్రత
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 7

లీడింగ్ సెక్టార్ జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

bank

వివరాలు:

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వీజే కాలే, డీకే సాథేలచే 1935 సెప్టెంబర్ 16న పుణెలో బ్యాంకింగ్ సంస్థగా నమోదు చేశారు.1936 ఫిబ్రవరి 8న పూర్తిస్థాయి వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం పుణె ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్ దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాల్లో 1897 బ్రాంచి నెట్‌వర్క్‌లను కలిగి ఉంది.

-పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 110 పోస్టులు (జనరల్-59, ఓబీసీ-28, ఎస్సీ-16, ఎస్టీ-7)
విభాగాలవారీగా ఖాళీలు:
-చీఫ్ మేనేజర్ (టాక్సేషన్, బ్యాలెన్స్ షీట్)
-2 పోస్టులు
-సివిల్ ఇంజినీర్ (గ్రేడ్2 & గ్రేడ్ 4)- 5 పోస్టులు ( జనరల్-1, ఓబీసీ-1)
-చార్టెర్డ్ అకౌంటెంట్-100 పోస్టులు (జనరల్-51, ఓబీసీ-27, ఎస్సీ-15, ఎస్టీ-7)
-ఎలక్ట్రికల్ ఇంజినీర్-2 పోస్టులు (జనరల్-1, ఎస్సీ-1)
-ఫైర్ ఇంజినీర్-1 పోస్టు
bank-logo
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ బ్యాచిలర్ డిగ్రీ+సీఏ, నాలుగేండ్ల సివిల్, ఫైర్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ 4 (ఎస్‌ఎంజీఎస్): రూ. 50,030-1460/4-55,870-1650/3-60,820/-,
-మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ 2 (ఎంఎంజీఎస్) రూ. 31,705-1145/1-32,850-1310 /10-45,950/-
-ప్రొబేషనరీ పీరియడ్: 24 నెలలు
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తిగా నింపిన తర్వాత ప్రింట్ తీసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. నిర్ణీత నమూనాలోనే అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చిరునామా:The Asstt. General Manager (IR &HRD) Bank of Maharashtra
Lokmangal 1501,Shivaji Nagar, Pune - 411005
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 7
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: అక్టోబర్ 17
-వెబ్‌సైట్: www.bankofmaharashtra.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్-మొహాలిలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్,
మొహాలిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) 2018-19 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
IISER
వివరాలు: ఐఐఎస్‌ఈఆర్ కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రతిష్ఠాత్మకమైన సంస్థ.
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్/ఎంటెక్‌లో ఉత్తీర్ణత. గేట్/సీఎస్‌ఐఆర్ లేదా యూజీసీ నెట్, జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం జేఆర్‌ఎఫ్, జేజీఈఈబీఐఎల్‌ఎస్ (టీఐఎఫ్‌ఆర్/ఎన్‌సీబీఎస్), జీప్యాట్, ఐసీఎంఆర్/డీబీటీ-జేఆర్‌ఎఫ్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్‌ను కలిగి ఉండాలి.
-ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: www. iisermohali.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు.

గోరఖ్‌పూర్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ddu-university
వివరాలు: ఈ యూనివర్సిటీ బోధన, నివాస సహిత అనుబంధ విశ్వవిద్యాలయం. దీన్ని 1956లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 211
పోస్టుల వివరాలు:
-ప్రొఫెసర్: 30
-పే స్కేల్: రూ. 37,400 67,000
+అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,000/-
-అసోసియేట్ ప్రొఫెసర్: 42
-పే స్కేల్: రూ. 37,400- 67,000
+అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్: 139
-పే స్కేల్: రూ. 15,600 - 39,100
+అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
-అర్హత: యూనిర్సిటీ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉండాలి.
-దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
చిరునామా: Registrar, Deen Dayal Upadhyay Gorakhpur University, Gorakhpur - 273009 (U.P.)
-చివరితేదీ: అక్టోబర్ 19
-వెబ్‌సైట్: http://ddugorakhpuruniversity.in 

0 comments:

Post a Comment