Friday, 22 September 2017

ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నాలజిస్ట్‌లు, సీఎస్‌ఎంసీఆర్‌ఐలోఅప్రెంటిస్ ట్రెయినీలు, ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ప్రవేశాలు. Assistant professors Recruitment in health department,Lab technologists Recruitment notification,CSMCRI Apprenticeship Trainee Posts,Project Assistants in IHBT,Radiological Physics Admission Notification,

ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,

మెడికల్ అభ్యర్థులకు అవకాశం
-అకడమిక్ మార్కులు + ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 25

UCHintern
తెలంగాణ ఆరోగ్యం, మెడికల్ & కుటుంబ సంక్షేమశాఖలోని మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.
-మొత్తం పోస్టుల సంఖ్య: 274 పోస్టులు.. ఈ ఖాళీల్లో జనరల్ అభ్యర్థులకు-110, మహిళా అభ్యర్థులకు-164 పోస్టులను కేటాయించారు.
విభాగాలవారీగా ఖాళీలు:
-నాన్ క్లినికల్ డిపార్ట్‌మెంట్-94 పోస్టులు... వీటిలో ఓసీ (జనరల్-30, మహిళలు-22), బీసీ ఏ (మహిళ)-8, బీసీ బీ (మహిళ)-5, బీసీ సీ-2, బీసీ డీ (మహిళ)-1, ఎస్సీ (జనరల్-10, మహిళలు-8), ఎస్టీ (మహిళ)- 8
-విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్.
-క్లినికల్ డిపార్ట్‌మెంట్-96 పోస్టులు... వీటిలో ఓసీ (జనరల్-31, మహిళలు-25), బీసీ ఏ
(మహిళ)-10, బీసీ బీ (మహిళ)-4, బీసీ సీ-2, ఎస్సీ (జనరల్-7, మహిళలు-12), ఎస్టీ (మహిళ)- 5.
-విభాగాలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పిడియాట్రిక్స్, ట్యూబర్‌కులోసిస్ అండ్ చెస్ట్ డిసీజెస్ , సైకియాట్రీ, డెర్మటాలజీ అండ్ వెనెరియోలజీ & లెప్రసీ అనాటమీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియాలజీ, రేడియోడయాగ్నసిస్, రేడియోథెరపీ, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్.
-సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్-64 పోస్టులు... వీటిలో ఓసీ (జనరల్-18, మహిళలు-20), బీసీ ఏ (మహిళ)-7, బీసీ బీ (మహిళ)-1, ఎస్సీ
(జనరల్-5, మహిళలు-11), ఎస్టీ (మహిళ)- 2
-విభాగాలు: కార్డియాలజీ, క్లినికల్ ఫార్మకాలజీ, ఎండోక్రిమినాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, సీటీ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ.
-డెంటల్ డిపార్ట్‌మెంట్-20 పోస్టులు...వీటిలో ఓసీ (జనరల్-4, మహిళలు-8), బీసీ ఏ (మహిళ)-2, ఎస్సీ (జనరల్-1, మహిళలు-5)
-విభాగాలు: ప్రోస్థోడోంటిక్స్, ఓరల్ పాథాలజీ , కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఓరల్ మ్యాక్సియోఫేషియల్ సర్జరీ, పిరియడోంటిక్స్, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియోగ్రఫీ, పబ్లిక్ హెల్త్ అండ్ డెంటిస్ట్రీ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు పీజీ, ఎంఎస్, ఎండీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎంసీహెచ్, డీఎం లేదా సంబంధిత స్పెషాలిటీ సబ్జెక్ట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. సెంట్రల్/ రా్రష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసుకొని ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లవరకు సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 15,600-39,100/-
(యూజీసీ పే స్కేల్ ప్రకారం)
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: అకడమిక్ అండ్ రిసెర్చ్ పర్మామెన్స్ రికార్డ్‌కు 70 పాయింట్స్, ఇంటర్వ్యూకు 30 పాయింట్స్ వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని కింది అడ్రస్‌కు పంపాలి.
చిరునామా: Secretary,Telangana State
Public Service Commission, Prathibha Bhavan, Nampally,
HYDEABAD - 500001
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 16
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.tspsc.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ల్యాబ్ టెక్నాలజిస్ట్‌లు,

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BECIL
వివరాలు:

మినీరత్న కంపెనీ అయిన బీఈసీఐఎల్ అనేది 1995 మార్చి 24న స్థాపించారు.
-మొత్తం పోస్టులు : 43
-పోస్టు పేరు: మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్/మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ)లో ఉత్తీర్ణత. 100 పడకల హాస్పిటల్‌లో రెండేండ్లపాటు అనుభవం ఉండాలి.
-పే స్కేల్ : గ్రాస్ సాలరీ నెలకు
రూ.16,468/- (కన్సాలిడేటెడ్ పే)
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 3
-వెబ్‌సైట్: www.becil.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఎంసీఆర్‌ఐలోఅప్రెంటిస్ ట్రెయినీలు,
సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:

సీఎస్‌ఎంసీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఆర్‌ఐ) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
-పోస్టు పేరు: అప్రెంటిస్ ట్రెయినీలు
-విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్), ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్, టర్నర్, వెల్డర్.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత .
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా నింపి సంబంధిత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను జతచేసి పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా: The Administrative Officer,
CSIR - Central Salt &Marine Chemicals Research Institute
Gijubhai Badheka Marg
Bhavnagar-364002 (Gujarat)
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్ : www.csmcri.org----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు,

హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
himalayan-bioresou
వివరాలు:

ఐహెచ్‌బీటీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న
అనుబంధ సంస్థ.
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్-2)-29 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్/లైఫ్ సైన్సెస్, ప్లాంట్ బ్రీడింగ్, ఆగ్రానమీ, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్, హార్టికల్చర్, సాయిల్ సైన్స్, ఫారెస్ట్రీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, బాటనీ, బయాలజీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ), ఎంఫార్మా (ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
వయస్సు: 2017 సెప్టెంబర్ 27 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: 25,000+ హెచ్‌ఆర్‌ఏ
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్-1)-22 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్/హార్టికల్చర్, ఫారెస్ట్రీ, బాటనీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, లైఫ్‌సైన్సెస్, మెడికల్ లేదా నాన్ మెడికల్ సైన్సెస్‌లో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
వయస్సు: 2017 సెప్టెంబర్ 27 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: 15,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలను నింపి, సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
ఇంటర్వ్యూతేదీ: సెప్టెంబర్ 27,28,29
వెబ్‌సైట్: www.ihbt.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ప్రవేశాలు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా
యూనివర్సిటీ పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ఈ కోర్సును ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, కిమ్స్ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, ఒమేగా హాస్పిటల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా అందిస్తున్నాయి.
-కోర్సు: పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్
-రెండు సెమిస్టర్లు (ఏడాది) + ఏడాది ఇంటర్న్‌షిప్ లేదా ఫీల్డ్ ట్రెయినింగ్ ఉంటుంది.
-అర్హతలు: ఎమ్మెస్సీ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-సీట్ల సంఖ్య - 20. వీటిలో 10 సీట్లు స్పాన్సర్డ్ కోటాలో భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: అక్టోబర్ 4
-వెబ్‌సైట్: www.osmania.ac.in0 comments:

Post a Comment